Fridge Safety Tips : ఫ్రిడ్జ్ విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి - లేకపోతే పేలిపోవడం ఖాయం..!
Refrigerator Safety Tips Summer : ఎండలు మండిపోతున్న వేళ ఫ్రిజ్ వాడకం విపరీతంగా పెరిగింది. అయితే సరైన నిర్వహణ లేకపోతే రిఫ్రిజిరేటర్ పేలిపోయే ప్రమాదం ఉందని తెలుసా…? కంప్రెసర్ వేడెక్కకుండా, షార్ట్ సర్క్యూట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Refrigerator Safety Tips Summer : వేసవి కాలం మొదలైందంటే చాలు.. ఇంట్లో అందరూ ఎక్కువగా వాడే వస్తువు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఫ్రిజ్ మాత్రమే. చల్లని నీరు, పండ్లు, కూరగాయలు మాత్రమే కాకుండా, ఆహారం పాడవకుండా ఉండటానికి నేడు ప్రతి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్ తప్పనిసరి అయిపోయింది. అయితే, ఎంతటి సౌకర్యాన్ని ఇస్తుందో, అంతే జాగ్రత్తగా దీన్ని నిర్వహించకపోతే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది.

ఇటీవల కాలంలో వేసవి ఎండల తీవ్రతకు ఫ్రిజ్ కంప్రెసర్లు పేలిపోతున్న వార్తలు మనం తరచుగా వింటున్నాం. అధిక వేడి, వోల్టేజ్ సమస్యలు, నిర్వహణ లోపాల వల్ల ఫ్రిజ్ ఒక బాంబులా మారే అవకాశం ఉంది. మీ ఇంట్లోని ఫ్రిజ్ సురక్షితంగా ఉండాలంటే మీరు చేస్తున్న ఈ చిన్న చిన్న పొరపాట్లను తక్షణమే సరిదిద్దుకోవాలి.
గోడకు ఆనించి ఉంచుతున్నారా…?
చాలా ఇళ్లలో స్థలం తక్కువగా ఉందని ఫ్రిజ్‌ను గోడకు అతుక్కుపోయేలా పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఫ్రిజ్ వెనుక భాగంలో ఉండే కంప్రెసర్ పని చేస్తున్నప్పుడు అధిక వేడిని విడుదల చేస్తుంది. ఫ్రిజ్‌కు, గోడకు మధ్య తగినంత ఖాళీ లేకపోతే ఆ వేడి బయటకు వెళ్లడానికి గాలి ఆడదు. దీనివల్ల కంప్రెసర్ మరింత వేడెక్కి (Overheating) పేలిపోయే అవకాశం ఉంది. అందుకే ఫ్రిజ్‌కు, గోడకు మధ్య కనీసం 5 నుండి 7 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి.
స్టెబిలైజర్ లేకపోవడం
వేసవిలో విద్యుత్ వినియోగం పెరగడం వల్ల పవర్ కట్స్, వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో నేరుగా ప్లగ్ పాయింట్ నుంచి ఫ్రిజ్‌ను నడిపించడం రిస్క్‌తో కూడుకున్న పని. వోల్టేజ్ ఒక్కసారిగా పెరిగినప్పుడు కంప్రెసర్ మీద లోడ్ పడి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే నాణ్యమైన స్టెబిలైజర్‌ను తప్పనిసరిగా వాడాలి. ఇది వోల్టేజ్‌ను నియంత్రించి ఫ్రిజ్ ప్రాణాలను కాపాడుతుంది.
వైరింగ్ - పాత ప్లగ్ పాయింట్లు
చలికాలంలో చాలామంది ఫ్రిజ్ వాడకాన్ని తగ్గిస్తారు లేదా ఆపేస్తారు. మళ్లీ ఎండలు రాగానే ఒక్కసారిగా దాన్ని ఆన్ చేస్తారు. ఈ క్రమంలో వైర్లు ఎక్కడైనా ఎలుకలు కొరికాయా లేదా ప్లగ్ సాకెట్ వదులుగా ఉందా అనేది చెక్ చేయరు. వైరింగ్ సరిగ్గా లేకపోతే నిప్పురవ్వలు (Sparks) వచ్చి ఫ్రిజ్‌కు నిప్పు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే వాడకం మొదలుపెట్టే ముందు వైరింగ్‌ను ఒకసారి నిపుణులతో తనిఖీ చేయించడం ఉత్తమం.
అతి తక్కువగా సెట్ చేయకండి…
వస్తువులు త్వరగా చల్లబడాలని చాలామంది ఫ్రిజ్ థర్మోస్టాట్‌ను అత్యంత తక్కువ ఉష్ణోగ్రతకు (Maximum Cooling) సెట్ చేస్తారు. బయట ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల కంప్రెసర్ నిరంతరం పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల దానిపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా పాత ఫ్రిజ్ ఉన్నవారు ఉష్ణోగ్రతను మరీ తక్కువగా ఉంచకుండా, సాధారణ స్థాయిలో ఉంచడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.
మంచు పేరుకుపోవడం….
ఫ్రిజ్ ఫ్రీజర్‌లో మంచు విపరీతంగా పేరుకుపోతున్నా చాలామంది పట్టించుకోరు. గడ్డకట్టిన మంచు కూలింగ్ సిస్టమ్‌పై ఒత్తిడి పెంచుతుంది. ఇది కంప్రెసర్ మీద నేరుగా ప్రభావం చూపుతుంది. వేసవిలో బయటి వాతావరణం వేడిగా ఉండటం వల్ల ఈ ఒత్తిడి రెట్టింపు అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు 'డీఫ్రాస్ట్' (Defrost) బటన్ నొక్కి మంచును కరిగించాలి. అలాగే, ఫ్రిజ్ తలుపును పదేపదే తీయడం లేదా ఎక్కువ సేపు తెరిచి ఉంచడం వల్ల లోపలి కూలింగ్ తగ్గి, కంప్రెసర్ మళ్లీ మళ్లీ స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. దీనివల్ల విద్యుత్ బిల్లు పెరగడమే కాకుండా కంప్రెసర్ లైఫ్ కూడా తగ్గుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

