చాలామంది బరువు తగ్గడానికి డైటింగ్ చేస్తుంటారు. మొదట్లో వేగంగా బరువు తగ్గినట్టు అనిపించినా, కొద్దిరోజుల తర్వాత ఫలితాలు కనిపించవు. దీనికి మన మెటబాలిజం (జీవక్రియ) మందగించడమే కారణమని భావిస్తుంటారు. అయితే, మెటబాలిజం పనితీరుపై మనకున్న అపోహలను తొలగిస్తూ డాక్టర్ కునాల్ సూద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
మెటబాలిజం 'బ్రేక్' అవ్వదు.. అది మారుతుంది!

బరువు తగ్గడం ఆగిపోయినప్పుడు మన మెటబాలిజం దెబ్బతిందని అనుకుంటాం. కానీ, నిజానికి మన శరీరం కేలరీల కోతకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. దీనినే 'మెటబాలిక్ అడాప్టేషన్' అంటారు.
డాక్టర్ సూద్ వివరించిన ఆ 5 ముఖ్యమైన వాస్తవాలు ఇవే:
1. 60 ఏళ్ల వరకు మెటబాలిజం స్థిరంగానే ఉంటుంది..
చాలామంది 30 లేదా 40 ఏళ్లు రాగానే మెటబాలిజం తగ్గిపోతుందని భయపడతారు. కానీ పరిశోధనల ప్రకారం, 20 నుంచి 60 ఏళ్ల వరకు మన శరీర శక్తి వినియోగం దాదాపు స్థిరంగానే ఉంటుంది. 60 ఏళ్ల తర్వాతే అది క్రమంగా తగ్గుతుంది. కాబట్టి 40ల్లో బరువు పెరగడానికి వయసు కంటే శారీరక శ్రమ తగ్గడం, కండరాల క్షీణత ప్రధాన కారణం.
2. విశ్రాంతి సమయంలోనే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి..
మనం వ్యాయామం చేస్తేనే కేలరీలు కరుగుతాయని అనుకుంటాం. కానీ, మన శరీరంలోని 60 నుంచి 70 శాతం శక్తి మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఖర్చవుతుంది. రక్త ప్రసరణ, శ్వాసక్రియ, అవయవాల పనితీరు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి ప్రాథమిక విధుల కోసం శరీరం నిరంతరం శక్తిని వాడుకుంటుంది. దీనినే బాసల్ మెటబాలిక్ రేట్ అంటారు.
3. నిద్ర లేకపోతే ఆకలి పెరుగుతుంది..
{{/usCountry}}3. నిద్ర లేకపోతే ఆకలి పెరుగుతుంది..
{{/usCountry}}సరైన నిద్ర లేకపోతే శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఆకలిని పెంచే ‘గ్రెలిన్’ హార్మోన్ పెరిగి, కడుపు నిండిన అనుభూతినిచ్చే ‘లెప్టిన్’ తగ్గిపోతుంది. దీనివల్ల మెదడులోని రివార్డ్ పాత్‌వేస్ యాక్టివేట్ అయ్యి, అధిక కేలరీలు ఉండే జంక్ ఫుడ్ తినాలనే కోరిక విపరీతంగా పెరుగుతుంది.
4. పదేపదే డైటింగ్ చేయడం వల్ల లాభం కంటే నష్టమే!
కఠినమైన డైటింగ్ చేసినప్పుడు శరీరం 'సర్వైవల్ మోడ్'లోకి వెళుతుంది. కేలరీలు తక్కువగా అందుతున్నాయని గ్రహించి, శక్తిని ఖర్చు చేయడం తగ్గించేస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో బరువు తగ్గడం మరింత కష్టమవుతుంది. ముఖ్యంగా డైటింగ్ వల్ల కొవ్వుతో పాటు కండరాలు కూడా తగ్గుతాయి, ఇది మెటబాలిజం రేటును మరింత తగ్గిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం చాలా ముఖ్యం.
5. ప్రోటీన్ మరియు క్రియేటిన్ ప్రాముఖ్యత..
ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటే దాన్ని అరిగించుకోవడానికి శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. అలాగే, ఇది కండరాలను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రియేటిన్ వాడటం వల్ల కండరాలు బలోపేతమై, పరోక్షంగా మెటబాలిక్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే కండరాలు గ్లూకోజ్ వినియోగానికి ప్రధాన కేంద్రాలు.