నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను…ఫిట్ గా ఉంటాను అని చాలా మంది చెబుతుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండటం, ఫిట్‌గా ఉండటం ఒకటే కాదంట..! చాలామంది ఈ తేడాను గుర్తించకుండా ఒకేలా వాడుతుంటారు. చాలామందికి ఆరోగ్యంగా ఉండటం, ఫిట్‌గా ఉండటం ఒకటే అనిపిస్తుంది.. కానీ అది నిజం కాదని ప్రముఖ్య వైద్యుడు డాక్టర్ సీమా ధీర్ చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో అందం, శరీరాకృతిపై ఉన్న శ్రద్ధ ఆరోగ్యంపై ఉండటం లేదనేది నిపుణుల మాట. ఒక వ్యక్తి జిమ్‌కు వెళ్లి కండలు పెంచినంత మాత్రాన వారు పూర్తి ఆరోగ్యవంతులు అని చెప్పలేం. అలాగే ఒక వ్యక్తి సన్నగా ఉన్నంత మాత్రాన వారు అన్-ఫిట్ అని కూడా అనలేం. అసలు 'హెల్త్' అంటే ఏమిటి,,,? 'ఫిట్‌నెస్' అంటే ఏమిటి…? ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్గావ్‌లోని ఆర్టెమిస్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సీమా ధీర్ వివరించారు.
డాక్టర్ సీమా ధీర్ ప్రకారం …. “ఆరోగ్యం” అనేది ఒక స్థితి, ఫిట్‌నెస్ అనేది మనం చేసే పనిని సూచిస్తుంది. ఆరోగ్యం అంటే కేవలం రోగాలు లేకపోవడం మాత్రమే కాదు. ఇది శరీరం, మనస్సు, సామాజికంగా మనం ఎంత హాయిగా ఉన్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారంటే.. వారి శరీర అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయని అర్థం. రోగనిరోధక శక్తి బలంగా ఉందని, హార్మోన్లు సమతుల్యంగా ఉన్నాయని భావిస్తాం. మానసిక ప్రశాంతతతో పాటు మంచి నిద్ర పడుతుందని అర్థం. ఉదాహరణకు.. ఒక వ్యక్తి భారీ వ్యాయామాలు చేయకపోయినా, సరైన ఆహారం తీసుకుంటూ, ఒత్తిడిని జయిస్తూ, హాయిగా నిద్రపోతుంటే వారు కూడా ఆరోగ్యవంతులే అవుతారు.
ఫిట్‌నెస్ అంటే..?
ఫిట్‌నెస్ అనేది శారీరక పనులను ఎంత సమర్థవంతంగా చేయగలరు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో బలం, ఓర్పు, ఫ్లెక్సిబిల్టీ,సామర్థ్యం వంటివి ఉంటాయి. అథ్లెట్లు లేదా బాడీబిల్డర్లు చాలా ఫిట్‌గా ఉండవచ్చు. ఎందుకంటే వారు కఠినమైన శారీరక పనులను సులభంగా చేయగలరు. కానీ వారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది వారి అంతర్గత వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది.
ఫిట్‌గా ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్లా?
{{/usCountry}}ఫిట్‌నెస్ అనేది శారీరక పనులను ఎంత సమర్థవంతంగా చేయగలరు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో బలం, ఓర్పు, ఫ్లెక్సిబిల్టీ,సామర్థ్యం వంటివి ఉంటాయి. అథ్లెట్లు లేదా బాడీబిల్డర్లు చాలా ఫిట్‌గా ఉండవచ్చు. ఎందుకంటే వారు కఠినమైన శారీరక పనులను సులభంగా చేయగలరు. కానీ వారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది వారి అంతర్గత వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది.
ఫిట్‌గా ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్లా?
{{/usCountry}}ఖచ్చితంగా కాదు… ఫిట్‌నెస్ కోసం చాలామంది అతిగా వ్యాయామాలు చేయడం , కఠినమైన డైట్లు పాటించడంతో పాటు కొన్ని రకాల సప్లిమెంట్లు వాడటం చేస్తుంటారు. ఇది బయటకి ఫిట్‌గా కనిపించేలా చేసినా…. లోపల అవయవాలపై ఒత్తిడి పెంచి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక వ్యక్తి బయటకి ఫిట్‌గా కనిపించకపోయినా…. వారి శరీరంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా ఉంటే వారు ఆరోగ్యవంతులే అవుతారు.
"ఆరోగ్యంలో ఫిట్‌నెస్ అనేది ఒక భాగం మాత్రమే. అదే సర్వస్వం కాదు. నిజమైన ఆరోగ్యం కావాలంటే శరీరాన్ని లోపలి నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి" అని డాక్టర్ ధీర్ సూచించారు. అందుకే కేవలం ఫిట్‌నెస్ వెనుక పరుగులు తీయకుండా… దీర్ఘకాలిక శ్రేయస్సును ఇచ్చే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.