Gut Health Improve : గట్ హెల్త్ ఎలా మెరుగుపడాలి ....? ఈ సూపర్ పుడ్ కాంబినేషన్లు తెలుసుకోండి

Gut Health Improve Foods : మనం తీసుకునే ఆహారం ఎంత బలమైనది అనేదానికంటే… అది ఒంటికి ఎంత పట్టిందనేది ముఖ్యం. గట్ ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తి పెంచేందుకు కొన్ని ప్రత్యేకమైన సూపర్ పుడ్స్ తీసుకోవాలని డాక్టర్ శుభమ్ వాత్స్య సూచిస్తున్నారు.

Published on: Apr 10, 2026 4:01 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gut Health Improve Foods : ఆరోగ్యంగా ఉండేదుంకు పౌష్టికాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే శరీరానికి అవసరమైన పోషకాలు కేవలం ఆహారం తీసుకోవడం వల్ల మాత్రమే అందవు. పోషకాలు రక్తంలోకి సరిగ్గా శోషించబడాలి . దీనినే 'బయోఅవైలబిలిటీ' అంటారు.

గట్‌ హెల్త్‌ - ఈ 3 పుడ్స్ ట్రై చేయండి (Pexel)
గట్‌ హెల్త్‌ - ఈ 3 పుడ్స్ ట్రై చేయండి (Pexel)

ఇదే విషయంపై ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్ లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభమ్ వాత్స్య పలు వివరాలను సోషల్ మీడియాలో(ఇన్ స్టా గ్రామ్) పోస్ట్ చేశారు. శరీర శక్తితో పాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు మూడు అద్భుతమైన ఆహారాలను సూచించారు. ఈ ఆహారాలు తీసుకోవటం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తితో పాటు రోగనిరోధక శక్తి పెంచేందుకు సహాయపడుతాయని పేర్కొన్నారు.

పప్పు - బచ్చలికూర + నిమ్మరసం :

శాఖాహారులకు ఐరన్ అందించే ప్రధాన వనరులు ఆకుకూరలు, పప్పు ధాన్యాలు అని చెప్పొచ్చు. ఉదాహరణకు…. 100 గ్రాముల బచ్చలికూరలో మనకు రోజువారీ అవసరమయ్యే ఇనుములో 15 శాతం లభిస్తుంది. కానీ మొక్కల నుంచి లభించే ఇనుమును గ్రహించే శక్తి మన శరీరానికి తక్కువ. "మీరు పప్పు లేదా ఆకుకూరల్లో కాస్త నిమ్మరసం పిండితే…. అందులోని విటమిన్-సి ఇనుమును శరీరం త్వరగా గ్రహించేలా చేస్తుంది. ఇది రక్తహీనతను తగ్గించి, మీ శక్తి స్థాయిలను పెంచుతుంది," అని డాక్టర్ శుభమ్ వివరించారు.

పెరుగు - చియా/సబ్జా గింజలు :

జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే పీచు పదార్థం, ప్రోబయోటిక్స్ చాలా అవసరం. చియా గింజల్లో ఉండే పీచు విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. సబ్జా గింజల్లో ఉండే కరిగే పీచు జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని నియంత్రిస్తుంది. వీటికి పెరుగును జోడించినప్పుడు…. పెరుగులోని ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) గట్ ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తాయి. ఈ కాంబినేషన్ తో కూడిన ఆహారం… మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు - నల్ల మిరియాలు :

పసుపులో 'కర్కుమిన్' అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది వాపులను తగ్గించి… క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడుతుంది. అయితే పసుపును నేరుగా తీసుకుంటే శరీరంలోకి కర్కుమిన్ శోషణ చాలా తక్కువగా ఉంటుంది. "నల్ల మిరియాలను పసుపుతో కలిపి తీసుకుంటే.. మిరియాల్లోని 'పైపెరిన్' వల్ల కర్కుమిన్ శోషణ ఏకంగా 2000 రెట్లు పెరుగుతుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని నయం చేయడానికి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది" అని డాక్టర్ శుభమ్ వాత్స్య పేర్కొన్నారు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు లేదా కొత్త ఆహారపు అలవాట్లను మొదలుపెట్టేవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More