1.3 మిలియన్ ఫాలోవర్స్- 100 మందికి చర్మ సంరక్షణపై ఉచిత సెషన్స్- హైదరాబాద్‌లో డీఎన్ఏ ఏస్థెటిక్స్ క్లినిక్ ప్రారంభం!

Dr Priyanka Reddy DNA Dermatology And Aesthetics Clinic Opened: మంచి వైద్య సలహాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్న డాక్టర్ ప్రియాంక రెడ్డి హైదరాబాద్‌లో డీఎన్ఏ డెర్మటాలజీ అండ్ ఏస్థెటిక్స్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Published on: Mar 16, 2026, 23:12:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం ఒక కంటెంట్ రీచ్ అవ్వాలంటే అందుకు బెస్ట్ ఆప్షన్ సోషల్ మీడియా. వైద్య సలహాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు డాక్టర్ ప్రియాంక రెడ్డి. వైద్య సూచనలు ఇస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 1.3 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

1.3 మిలియన్ ఫాలోవర్స్- 100 మందికి చర్మ సంరక్షణపై ఉచిత సెషన్స్- హైదరాబాద్‌లో డీఎన్ఏ ఏస్థెటిక్స్ క్లినిక్ ప్రారంభం!
1.3 మిలియన్ ఫాలోవర్స్- 100 మందికి చర్మ సంరక్షణపై ఉచిత సెషన్స్- హైదరాబాద్‌లో డీఎన్ఏ ఏస్థెటిక్స్ క్లినిక్ ప్రారంభం!

హైదరాబాద్‌లో డీఎన్ఏ ఏస్థెటిక్స్ క్లినిక్

అంతటి క్రేజ్ సాధించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్ పోస్ట్‌లో అత్యాధునిక చర్మ, సౌందర్య చికిత్సా సేవలను అందించే డీఎన్ఏ డెర్మటాలజీ & ఏస్థెటిక్స్ క్లినిక్‌‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభత్సవానికి వైద్య నిపుణులు, చర్మ సంరక్షణ, బ్యూటీ రంగ నిపుణులు హాజరయ్యారు.

చర్మ ఆరోగ్యం నుంచి ఆత్మ విశ్వాసం వరకు

డాక్టర్ ప్రియాంక రెడ్డి స్థాపించిన డీఎన్ఏ డెర్మటాలజీ & ఏస్థెటిక్స్, ఆధునిక డెర్మటాలజీ చికిత్సలు, ఏస్థెటిక్స్ సేవలను అందిస్తూ చర్మ ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పని చేయనుంది.

అత్యాధునిక సాంకేతికతతో

ఈ క్లినిక్‌లో అత్యాధునిక వైద్య సాంకేతికతతో పాటు నిపుణుల సలహాలు అందిస్తూ, వైద్య, సౌందర్య చర్మ సమస్యలకు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సలు అందించనున్నారు.

డెర్మటాలజీ సేవలను

ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఆధునిక డెర్మటాలజీ సేవలను అందించేందుకు ఈ క్లినిక్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు.

శాస్త్రీయంగా నిరూపితమైన చికిత్సలు

"శాస్త్రీయంగా నిరూపితమైన చికిత్సలు, సురక్షితమైన ఏస్థెటిక్స్ ప్రక్రియలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన చర్మ సంరక్షణ పరిష్కారాలను అందించడం మా లక్ష్యం. ఎవరికి చర్మానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరమో వాళ్లకి తగినట్టుగా కేవలం అవసరమైనంత మేరకు మాత్రమే మనం చికిత్స అందిస్తాము" అని డాక్టర్ ప్రియాంక రెడ్డి పేర్కొన్నారు.

ఉత్తమ సేవలను పొందుతారు

అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన ఈ క్లినిక్‌లో వివిధ రకాల డెర్మటాలజీ, ఏస్థెటిక్స్ చికిత్సలు సమగ్రంగా అందించనున్నారు. సౌకర్యవంతమైన, ఆధునిక వాతావరణంలో నిపుణుల చేత ఉత్తమ సేవలను పొందగలుగుతారని ఆమె వెల్లడించారు. హైదరాబాద్‌లో చర్మ, సౌందర్య సంరక్షణలో కొత్త మైలురాయిగా నిలుస్తామని పేర్కొన్నారు.

100 మందికి ఉచిత సెషన్స్

ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మందికి ప్రత్యేక మాస్టర్‌క్లాస్, కన్సల్టేషన్ సెషన్స్‌ని ఉచితంగా నిర్వహించారు . ఈ సెషన్‌లో పాల్గొనే వారికి తాజా డెర్మటాలజీ అభివృద్ధులు, చర్మ పునరుజ్జీవనం (Skin Rejuvenation), ఆధునిక ఏస్థెటిక్స్ చికిత్సల గురించి అవగాహన కల్పించారు. అలాగే నిపుణులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కూడా అందించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More