Happy Rath Yatra 2026 : పూరీ జగన్నాథ రథయాత్ర 2026.. మీ బంధుమిత్రులకు ఈ శుభాకాంక్షలు పంపండి

Rathyatra : దేశవ్యాప్తంగా పూరీ జగన్నాథ రథయాత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. గురువారం మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ రథోత్సవం కోసం భక్తులు భారీగా తరలివెళుతున్నారు. ఈ శుభ సందర్భంలో మీ బంధుమిత్రులతో పంచుకోవాల్సిన వాట్సాప్ సందేశాలు, శుభాకాంక్షలు ఇక్కడ చూసేయండి..

Published on: Jul 16, 2026, 09:08:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ సనాతన సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన, కోట్లాది మంది భక్తుల "జై జగన్నాథ్" నినాదాల మధ్య సాగే శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవం నేడు అత్యంత వైభవంగా ప్రారంభంకానుంది. ఒడిశాలోని పూరీ క్షేత్రంతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఉత్సవాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. 12వ శతాబ్దానికి చెందిన పూరీ క్షేత్రం ప్రస్తుతం భక్తజన సంద్రమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి సమేతంగా సాగే ఈ రథాల ఊరేగింపును కళ్లారా చూసేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు.

జగన్నాథ రథయాత్ర 2026 శుభాకాంక్షలు..
జగన్నాథ రథయాత్ర 2026 శుభాకాంక్షలు..

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి కూడా ఏటా వేలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి పయనం అవుతుంటారు. భక్తుల రక్షణ కోసం ఒడిశా ప్రభుత్వం పూరీ పట్టణాన్ని కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి తెచ్చింది.

సాయంత్రం 4 గంటలకు రథాల కదలిక!

గురువారం సాయంత్రం 4:00 గంటలకు పూరీ గ్రాండ్ రోడ్ (బడదండ) పై రథాల ప్రయాణం ప్రారంభం కానుంది. ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమై 2.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ గుండిచా ఆలయానికి ఈ యాత్ర చేరుకుంటుంది. మూడు విశిష్టమైన చెక్క రథాలపై స్వామివారలు విహరిస్తారు.

  • బలభద్రుడి రథాన్ని 'తాళధ్వజం' అని పిలుస్తారు.
  • సుభద్ర దేవి రథాన్ని 'దర్పదలనం' అంటారు.
  • సృష్టికర్త అయిన జగన్నాథుడి రథాన్ని 'నందిఘోష' అని పిలుస్తారు.

ఈ మూడు రథాల తాడును ఒక్కసారైనా తాకి, లాగాలని భక్తులు తపిస్తుంటారు. భక్తి, విశ్వాసం, సాంప్రదాయాల కలయికగా సాగే ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపాల్సిన శుభాకాంక్షలు, వాట్సాప్ స్టేటస్‌లు ఇక్కడ చూద్దాం.

జగన్నాథ రథయాత్ర 2026 శుభాకాంక్షలు..

"శ్రీ జగన్నాథుడి రథయాత్ర మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలి. ఆ భగవంతుడి ఆశీస్సులతో మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, అఖండ ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షిస్తూ.. రథయాత్ర శుభాకాంక్షలు!"

ఈ పవిత్ర రథయాత్ర మీ జీవితంలో సరికొత్త ప్రారంభాలకు, అంతులేని ఆశీర్వాదాలకు వేదిక కావాలని కోరుకుంటున్నాను.

జగన్నాథుడి దివ్య పయనం మీ జీవితంలో సరికొత్త ఆశలను, సానుకూల దృక్పథాన్ని నింపాలని ఆశిస్తున్నాను. హ్యాపీ రథయాత్ర!

శ్రీ జగన్నాథుడి కరుణాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండి, మీరు ఎంచుకున్న మార్గంలో విజయం వైపు నడిపించాలి.

జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిల త్రిమూర్తుల ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ కురియాలి.

ఈ పవిత్ర ఉత్సవం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించి, శాంతిని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ రథయాత్ర 2026!

వాట్సాప్ సందేశాలు..

"ఆ జగన్నాథుడి ఆశీస్సులు మీ ఇంటి నిండా సంతోషాన్ని, సమృద్ధిని నింపాలి. మీకు, మీ కుటుంబానికి పవిత్ర రథయాత్ర శుభాకాంక్షలు."

"మీరు చేపట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని ఆశిస్తూ.. రథయాత్ర శుభాకాంక్షలు."

"జగన్నాథుడి రథం మిమ్మల్ని విజయతీరాలకు చేర్చాలి, మీ మనస్సు ఎల్లప్పుడూ భక్తిభావంతో నిండాలి."

"ఆ స్వామి మీ జీవితంలోని బాధలన్నింటినీ తుడిచివేసి, అంతులేని ఆనందాన్ని ప్రసాదించుగాక."

“భక్తి, శ్రద్ధ, కృతజ్ఞతలతో ఈ పవిత్ర పండుగను జరుపుకుందాం. జై జగన్నాథ్!”

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More