Heat Stroke treatment : భారతదేశంలో, మరీ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ లేదా ‘హీట్ స్ట్రోక్’ బారినపడే వారి సంఖ్య పెరుగుతోందని, దీనిని సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఎండలో తిరిగితేనే కాకుండా ఉక్కపోత, గాలి ఆడని గదులు, డీహైడ్రేషన్ వల్ల కూడా హీట్ స్ట్రోక్ రావచ్చు. సకాలంలో గుర్తించకపోతే ఇది మెదడు, గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వడదెబ్బ లక్షణాలు, చికిత్స వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుని జాగ్రత్త పడండి..
ప్రజలు నిర్లక్ష్యం చేసే ముందస్తు లక్షణాలు..

హీట్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. చాలామంది వీటిని సాధారణ నీరసంగా భావించి లైట్ తీసుకుంటారు. అలా అస్సలు చేయకూడని ఆ లక్షణాలు ఇవే:
- విపరీతమైన తలనొప్పి, కళ్లు తిరగడం
- వాంతులు కావడం లేదా వికారంగా అనిపించడం
- గుండె వేగంగా కొట్టుకోవడం
- మొదట్లో విపరీతంగా చెమటలు పట్టడం, ఆ తర్వాత చర్మం పొడిబారడం
- కండరాల నొప్పులు లేదా పీకడం
- మానసిక గందరగోళం - అత్యంత ప్రమాదకర సంకేతం
వడదెబ్బ తీవ్రమయ్యే కొద్దీ మెదడుపై ప్రభావం పడుతుంది. దీనివల్ల బాధితుల్లో మానసిక గందరగోళం, స్పృహ తప్పడం, మాట ముద్దబారడం, లేనివి ఊహించుకోవడం, ఫిట్స్ వంటివి వస్తాయి. ఒక్కోసారి బాధితుడి కంటే ముందుగా చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులు వారి ప్రవర్తనలో మార్పును (చిరాకు, అసాధారణ ప్రవర్తన) గుర్తించవచ్చు.
వడదెబ్బతో ఎవరికి ఎక్కువ ప్రమాదం?
- చిన్న పిల్లలు, వృద్ధులు
- ఎండలో పని చేసే కూలీలు, రైతులు, అథ్లెట్లు
- మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు
- శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్నవారు
ఒకవేళ వడదెబ్బ తగిలితే చేయాల్సిన అత్యవసర చర్యలు..
ఎవరైనా వడదెబ్బకు గురైనట్లు గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కింది చర్యలు చేపట్టాలి:
నీడకు చేర్చండి: బాధితుడిని వెంటనే ఎండలో నుంచి ఏసీ లేదా మంచి గాలి వచ్చే నీడ ఉన్న గదిలోకి మార్చాలి.
{{/usCountry}}నీడకు చేర్చండి: బాధితుడిని వెంటనే ఎండలో నుంచి ఏసీ లేదా మంచి గాలి వచ్చే నీడ ఉన్న గదిలోకి మార్చాలి.
{{/usCountry}}దుస్తులు లూజ్ చేయండి: వారిపై ఉన్న గట్టి లేదా అదనపు దుస్తులను తొలగించాలి.
శరీరాన్ని చల్లబరచండి: చల్లటి తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి లేదా చల్లటి నీటిని చల్లాలి.
ఐస్ ప్యాక్స్: మెడ, చంకలు, తల, తొడల భాగంలో ఐస్ ప్యాక్‌లను ఉంచడం ద్వారా శరీర ఉష్ణోగ్రత వేగంగా తగ్గుతుంది.
నీరు తాగించడం: బాధితుడు పూర్తిగా స్పృహలో ఉంటేనే ఓఆర్ఎస్, కొబ్బరినీళ్లు లేదా మంచినీళ్లు తాగించాలి. స్పృహ లేకపోతే ఎలాంటి ద్రవాలు నోట్లో పోయకూడదు.
వైద్య సహాయం: వెంటనే అత్యవసర అంబులెన్స్ సేవలకు సమాచారం అందించాలి. సొంత వైద్యం అస్సలు చేయకూడదు.
- హీట్ స్ట్రోక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రోజంతా ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
- మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు నేరుగా ఎండలోకి వెళ్లడం మానుకోవాలి.
- వదులుగా ఉండే కాటన్ (నూలు) దుస్తులను మాత్రమే ధరించాలి.
- ఎండలో ప్రయాణించాల్సి వస్తే గొడుగు, టోపీ, సన్‌గ్లాసెస్ తప్పనిసరిగా వాడాలి.