Independence Day 2026 : 79 ఆ? లేక 80 ఆ? భారత్​కు ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవం?

Independence day 2026 how many years : భారత్ రేపు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 79వ లేదా 80వదా? అనే గందరగోళానికి తెరదించుతూ, ఈ ఏడాది వేడుకల థీమ్, చారిత్రక ప్రాధాన్యత పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 14, 2026, 07:31:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశం.. ప్రతి ఏటా ఆగస్టు 15న తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. 2026 సంవత్సరంలో ఈ వేడుక శనివారం రోజున వచ్చింది. రెండొందల ఏళ్ల బ్రిటిష్ వలస పాలన నుంచి దేశానికి విముక్తి లభించిన వైనాన్ని, స్వేచ్ఛా దేశ స్వప్నాన్ని సాకరం చేయడానికి ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను ఈ రోజు స్మరించుకుంటాము.

భారత్​కు ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవం?
భారత్​కు ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవం?

స్వాతంత్ర్య దినోత్సవం 2026: ఇది 79వదా లేక 80వదా?

ప్రతి ఏటా లాగే 2026లో ఇది 79వ స్వాతంత్ర్య దినోత్సవమా లేక 80వదా అనేదానిపై ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంటుంది. దీనిపై స్పష్టత ఏమిటంటే, 2026లో భారత్ తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1947 ఆగస్టు 15న భారత్ బ్రిటిష్ పాలకుల చెర నుంచి స్వాతంత్ర్యం సాధించింది.

ప్రస్తుత సంవత్సరం 2026 నుంచి 1947ని తీసివేయడం వల్ల 79 వస్తుందని చాలా మంది భావిస్తారు. అయితే మొదటి స్వాతంత్ర్య వేడుకను లెక్కలోకి తీసుకోకపోవడం వల్లే ఈ పొరపాటు జరుగుతుంది. అందువల్ల, 1947 ఆగస్టు 15 — భారత్ స్వాతంత్ర్యం పొందిన రోజును మొదటి స్వాతంత్ర్య దినోత్సవంగా లెక్కించాలి. అప్పుడు 2026 భారతదేశ స్వాతంత్ర్యానికి 80వ వార్షికోత్సవం అవుతుంది.

స్వాతంత్ర్య దినోత్సవం 2026 థీమ్

2026 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ‘యువ శక్తి ఫర్ వికసిత్ భారత్@ 2047’ అనే ప్రధాన అంశంపై దృష్టి పెట్టనున్నాయి.

అలాగే ఈ ఏడాది వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకున్న వెంటనే ఈ జాతీయ గీతాన్ని ఆలపించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం 2026: ప్రాముఖ్యత, చరిత్ర..

1947 ఆగస్టు 15న భారత్ రెండు శతాబ్దాల వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. విస్తృతమైన శాసనోల్లంఘన, నిరాహార ఉద్యమాలు, విప్లవ కార్యకలాపాలు, రాజకీయ చర్చలు, స్వాతంత్ర్య సమరయోధులు, దేశ ప్రజల వివిధ రూపాల ప్రతిఘటనల ద్వారా భారత్ బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం సాధించింది.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇవి స్వాతంత్ర్యం సాధించడంలో మనకు సహాయపడిన విప్లవాత్మక ఆలోచనలను, విలువలను నిలబెట్టాలని భారతదేశ ప్రజలకు గుర్తు చేస్తాయి. అలాగే మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకోవడానికి దోహదపడతాయి.

ప్రతి సంవత్సరం భారతదేశం అంతటా వేడుకలు నిర్వహిస్తారు. రాష్ట్ర రాజధానులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంఘాలు జెండా ఆవిష్కరణ వేడుకలు, పరేడ్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తాయి.

అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం సాయుధ దళాలు, దిల్లీ పోలీసులు భారతదేశ ప్రధానికి గౌరవ వందనం సమర్పించడంతో ప్రారంభమవుతుంది. దీని తర్వాత జాతీయ గీతం, 21 ఫిరంపుల కాల్పుల మధ్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. భారతీయ వాయుసేన హెలికాప్టర్లు ఎర్రకోటపై పూల వర్షం కురిపిస్తాయి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని అందిస్తారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More