Milind Soman Diet Plan : భారతీయ మోడల్, ఫిట్‌నెస్ ఐకాన్, ప్రముఖ నటుడు మిలింద్ సోమన్ తన పవర్‌తో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జలమార్గాలలో ఒకటైన ‘స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్’ (Strait of Gibraltar)ను మే 1, 2026న ఆయన ఈది దాటారు. స్పెయిన్‌లోని టారిఫా (యూరోప్) నుంచి ప్రారంభించి మొరాకో (ఆఫ్రిక) తీరం వరకు సుమారు 15 కిలోమీటర్ల దూరాన్ని ఆయన స్విమ్ చేసేశారు. సముద్రం మధ్యలో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని ఆయన దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

60ఏళ్ల మిలింద్ సోమన్కి ఇదెలా సాధ్యమైంది? ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి?
కేవలం 15 నిమిషాల వర్కౌట్.. కానీ అంకితభావం
అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు గంటల తరబడి జిమ్‌లో గడుపుతుంటే, అయితే మిలింద్ సోమన్ మాత్రం కేవలం 10 నుంచి 15 నిమిషాల నిర్మాణాత్మక వ్యాయామాన్నే నమ్ముకుంటారు. ఇందులో ఆయన పాటించే ‘కన్సిస్టెన్సీ’ అత్యంత కీలకం! రన్నింగ్, సైక్లింగ్, యోగా ఆయన దైనందిన జీవితంలో భాగం. తీవ్రమైన కసరత్తుల కంటే రోజూ చేసే చిన్నపాటి వ్యాయామమే శరీరానికి ఎక్కువ మేలు చేస్తుందని ఆయన వివరిస్తారు.
ఆహార నియమాలు: జంక్ ఫుడ్‌కు నో.. ప్రకృతికి ఎస్!
మిలింద్ సోమన్ ఫిట్‌నెస్‌లో ఆయన డైట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆయన పాటించే కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఇవే:
{{/usCountry}}మిలింద్ సోమన్ ఫిట్‌నెస్‌లో ఆయన డైట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆయన పాటించే కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఇవే:
{{/usCountry}}ప్రాసెస్డ్ ఫుడ్ వద్దు: రిఫైన్డ్, ప్యాక్డ్, జంక్ ఫుడ్‌కు ఆయన పూర్తిగా దూరం. సాఫ్ట్ డ్రింక్స్ ముట్టుకోరు. ఏడాదికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఆల్కహాల్ తీసుకుంటారు.
సహజ సిద్ధమైన ఫలహారం: ఉదయం టీ, బిస్కెట్లకు బదులు సీజనల్ పండ్లను అధికంగా తీసుకుంటారు. ఒకేసారి ఒకటి రెండు పప్పాయలు లేదా సగం పుచ్చకాయను అల్పాహారంగా తీసుకోవడం ఆయన అలవాటు.
సింపుల్ ఇండియన్ మీల్: మధ్యాహ్నం, రాత్రి భోజనంలో పప్పు, అన్నం, కూరగాయలు వంటి సాధారణ భారతీయ వంటకాలనే తింటారు. ఎలాంటి సప్లిమెంట్లు లేదా విటమిన్ టాబ్లెట్లు వాడరు.
గోరువెచ్చని నీరు: దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు, కానీ ఎప్పుడూ చల్లటి నీటిని తాగరు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో బరువు తగ్గింపు
2024 నవంబర్ నుంచి మిలింద్ 16:8 నిష్పత్తిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రారంభించారు. దీనివల్ల ఆయన సుమారు 6 నుంచి 7 కిలోల బరువు తగ్గడమే కాకుండా, మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే హాఫ్-ఐరన్ మ్యాన్ వంటి కఠినమైన పోటీలకు సిద్ధమయ్యేటప్పుడు మాత్రం శరీరానికి అవసరమైన శక్తి కోసం ఈ డైట్‌లో మార్పులు చేస్తుంటారు.
ఆలస్యంగా నిద్రలేచినా.. క్రమశిక్షణతో!
చాలామంది ఫిట్‌నెస్ ప్రేమికులు తెల్లవారుజామునే నిద్రలేవాలని అనుకుంటారు. కానీ మిలింద్ సోమన్ మాత్రం ఉదయం 8:30 గంటలకు నిద్రలేస్తారు. రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. సరైన విశ్రాంతి ఉంటేనే శరీరం మళ్లీ కష్టపడటానికి సిద్ధమవుతుందని ఆయన నమ్ముతారు. ప్రకృతికి దగ్గరగా ఉంటూ, సాదాసీదా ఆహారం తీసుకుంటే 60 ఏళ్లలో కూడా 20 ఏళ్ల యువకుడిలా మెరవచ్చని మిలింద్ సోమన్ నిరూపిస్తున్నారు.