Mangoes : మామిడి పండ్లు.. ఇలా తింటేనే రుచితో పాటు ఆరోగ్యం!
How to eat mangoes : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లు పండిన మామిడి పండ్ల సువాసనతో నిండిపోతాయి. పండ్లలో రాజుగా పిలిచే మామిడిని ఇష్టపడని వారుండరు. అయితే, అమితమైన ఇష్టంతో మామిడి పండ్లను ఎలా పడితే అలా తింటే అనారోగ్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
How to clean mangoes : తీపి, పులుపు కలగలిసిన మామిడి పండును షేక్స్, డెజర్ట్స్ లేదా భోజనం తర్వాత నేరుగా తినడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ, మామిడి పండు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణాన్ని కలిగి ఉంటుంది. సరైన పద్ధతిలో తీసుకోకపోతే నోటి పూత, ఎసిడిటీ లేదా కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుంచి తప్పించుకుని మామిడి పండు రుచిని ఆస్వాదించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

మామిడి పండ్లను నీళ్లలో ఎందుకు నానబెట్టాలి?
చాలామంది మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను అలాగే తినేస్తుంటారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు! మామిడి పండ్లను తినడానికి కనీసం 30 నిమిషాల నుంచి రెండు గంటల ముందు శుభ్రమైన నీటిలో నానబెట్టాలి.
ఉష్ణోగ్రత నియంత్రణ: నీళ్లలో నానబెట్టడం వల్ల పండ్లలోని సహజమైన వేడి తగ్గుతుంది.
రసాయనాల తొలగింపు: పండ్లను త్వరగా పండించేందుకు వాడే కార్బైడ్ వంటి రసాయనాలు నీటిలో నానబెట్టడం వల్ల తొలగిపోతాయి.
జీర్ణక్రియ: ఇలా చేయడం వల్ల ఎసిడిటీ సమస్య రాదు, చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
మామిడి పండ్లను తినేటప్పుడు పాటించాల్సిన 5 సూత్రాలు..
1. శుభ్రంగా కడగాలి:
నానబెట్టిన తర్వాత పండ్లను ప్రవహించే నీటి కింద పెట్టి మరోసారి కడగాలి. తొక్కతో సహా తినే అలవాటు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
2. భోజనం తర్వాత వెంటనే వద్దు:
భారీగా భోజనం చేసిన వెంటనే మామిడి పండు తింటే కడుపు ఉబ్బరం (బ్లోయింగ్) లేదా అజీర్తి కలిగే అవకాశం ఉంది. భోజనానికి, పండు తినడానికి మధ్య కొంత సమయం ఉండేలా చూసుకోండి.
3. చలవ చేసే వస్తువులతో కలిపి..:
మామిడి పండు తిన్నప్పుడు శరీరంలో పెరిగే వేడిని తగ్గించడానికి పెరుగు, పుదీనా లేదా మజ్జిగ వంటి వాటిని ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.
4. సహజంగా పండినవే మేలు:
కెమికల్స్‌తో పండించినవి నీటిపై తేలుతాయి, సహజంగా పండిన పండ్లు నీటిలో మునుగుతాయి. ఈ చిన్న పరీక్షతో నాణ్యమైన పండ్లను గుర్తించవచ్చు.
5. అతిగా తినకండి:
రుచిగా ఉంది కదా అని ఒకేసారి ఎక్కువ పండ్లు తినకూడదు. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. అతిగా తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది.
సమ్మర్ ఇచ్చే తియ్యని కానుక మామిడి పండు! మన పెద్దలు చెప్పిన ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మామిడి పండును తింటే, ఎండకాలం వేడిని తట్టుకుంటూనే సీజన్ ఫ్రూట్‌ను హాయిగా ఆస్వాదించవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. మామిడి పండ్లను ఎన్ని గంటలు నానబెట్టాలి?
కనీసం 30 నిమిషాల నుంచి గంటన్నర వరకు నానబెట్టడం వల్ల పండులోని వేడి తగ్గి, రసాయనాలు తొలగిపోతాయి.
2. మామిడి పండు తింటే మొటిమలు వస్తాయా?
అవును, మామిడి పండ్లను నేరుగా అలాగే తింటే శరీరంలో వేడి పెరిగి చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది. నీటిలో నానబెట్టి తింటే ఈ సమస్య తగ్గుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


