Surya Namaskar Benefits : యోగాలో సూర్య నమస్కారాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 12 విభిన్న భంగిమల కలయికగా ఉండే ఈ ప్రక్రియను చాలామంది కేవలం ఫ్లెక్సిబిలిటీ కోసం మాత్రమే చేస్తారు. అయితే… ఇది మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం అద్భుతమని ప్రముఖ న్యూరో సర్జన్, డాక్టర్ ప్రశాంత్ కటకోల్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ (ఏప్రిల్ 14, 2026) ద్వారా పంచుకున్నారు.

'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్సెస్' ప్రచురించిన ఒక అధ్యయనాన్ని ఆయన ఉటంకించారు. 80 మంది వ్యక్తులపై ఆరు నెలల పాటు (వారానికి ఐదు రోజులు) చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి:
- సెరోటోనిన్ పెరుగుదల: సూర్య నమస్కారం చేయడం వల్ల మెదడులో సెరోటోనిన్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి.
- మానసిక స్థితి: తేలికపాటి నిరాశ (Depression), తీవ్రమైన ఆందోళన (Anxiety), ఒత్తిడి గణనీయంగా తగ్గాయి.
- శారీరక మార్పులు: బరువు, బిఎమ్ఐ (BMI), నడుము చుట్టుకొలత తగ్గడమే కాకుండా శరీర ఆకృతిలో మెరుగుదల కనిపించింది.
సెరోటోనిన్ అంటే ఏమిటి?
సెరోటోనిన్ అనేది మన మెదడులోని ఒక రసాయనం, ఇది మూడ్‌ను స్థిరంగా ఉంచుతుంది. "తక్కువ సెరోటోనిన్ నేరుగా డిప్రెషన్, దీర్ఘకాలిక ఒత్తిడికి దారితీస్తుంది. బయటి మందుల కంటే… మెదడు తనను తాను నయం చేసుకునేలా చేయడంలో సూర్య నమస్కారం తోడ్పడుతుంది" అని డాక్టర్ కటకోల్ వివరించారు.
సూర్య నమస్కారం - 12 భంగిమలు
సూర్య నమస్కారంలోని ప్రతి భంగిమ ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. 12 భంగిమల పేర్లను ఇక్కడ తెలుసుకోండి….
- ప్రాణమాసన (ప్రార్థన భంగిమ)
- హస్త ఉత్తానాసనం (చేతుల భంగిమ)
- పాదహస్తాసనం (పాదాల దగ్గరకు చేతులు)
- ఆశ్వ సంచలానాసన (గుర్రపు భంగిమ)
- దండాసన (పలక భంగిమ)
- అష్టాంగ నమస్కారం (ఎనిమిది భాగాలతో నమస్కారం)
- భుజంగాసన (నాగుపాము భంగిమ)
- అధోముఖ స్వానాసన (క్రిందికి చూసే కుక్క భంగిమ)
- ఆశ్వ సంచలానాసన (మరోసారి గుర్రపు భంగిమ)
- పాదహస్తాసన (పాదాల దగ్గరకు చేతులు)
- హస్త ఉత్తానాసనం (ఎత్తిన చేతుల భంగిమ)
- తదాసన (పర్వత భంగిమ)
ఆరోగ్య ప్రయోజనాలు
{{/usCountry}}సూర్య నమస్కారంలోని ప్రతి భంగిమ ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. 12 భంగిమల పేర్లను ఇక్కడ తెలుసుకోండి….
- ప్రాణమాసన (ప్రార్థన భంగిమ)
- హస్త ఉత్తానాసనం (చేతుల భంగిమ)
- పాదహస్తాసనం (పాదాల దగ్గరకు చేతులు)
- ఆశ్వ సంచలానాసన (గుర్రపు భంగిమ)
- దండాసన (పలక భంగిమ)
- అష్టాంగ నమస్కారం (ఎనిమిది భాగాలతో నమస్కారం)
- భుజంగాసన (నాగుపాము భంగిమ)
- అధోముఖ స్వానాసన (క్రిందికి చూసే కుక్క భంగిమ)
- ఆశ్వ సంచలానాసన (మరోసారి గుర్రపు భంగిమ)
- పాదహస్తాసన (పాదాల దగ్గరకు చేతులు)
- హస్త ఉత్తానాసనం (ఎత్తిన చేతుల భంగిమ)
- తదాసన (పర్వత భంగిమ)
ఆరోగ్య ప్రయోజనాలు
{{/usCountry}}సూర్య నమస్కారం చేస్తే… గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థ ఉత్తేజమవుతుంది. రోగనిరోధక శక్తి పెరగటంతో పాచు క్యాలరీలను ఖర్చు చేసి ఊబకాయాన్ని తగ్గిస్తుందని డాక్టర్ కటకోల్ వివరించారు.