క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న వేలాది మంది బాధితులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప ఉపశమనం అందించింది. ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సలో వాడే 543 రకాల కీలక ఔషధాల గరిష్ఠ రిటైల్ ధరలపై (ఎమ్ఆర్పీ) భారీ కోతలు విధిస్తూ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధ విభాగం ఈ వివరాలను వెల్లడించింది. సవరించిన నూతన రేట్లు నవంబర్ 9 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి.

ఔషధ తయారీ కంపెనీలు అక్టోబర్ 27 నాటికి అందజేసిన వివరాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. మిగిలిన కంపెనీలు తమ సవరించిన ధరల జాబితాను సమర్పించే కొద్దీ ఈ జాబితాను నిరంతరం నవీకరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఏటా రూ.3,500 కోట్ల వరకు ఆదా
దేశీయంగా క్యాన్సర్ మందుల మార్కెట్లో దాదాపు 225 మందులు, 500 రకాల ఫార్ములేషన్లు చలామణిలో ఉన్నాయి. ఈ విపణి వార్షిక లావాదేవీల విలువ సుమారు రూ.12,500 కోట్లుగా ఉంటుంది. 137 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ ఔషధాలపై ట్రేడ్ మార్జిన్ క్రమబద్ధీకరణను (టీఎమ్‌ఆర్) అమలు చేయడం ద్వారా ఈ ధరల కోత సాధ్యమైంది. తాజా నిర్ణయం వల్ల బాధితులు తమ సొంత జేబుల నుంచి పెట్టే వైద్య వ్యయంలో ఏటా రూ.2,500 కోట్ల నుంచి రూ.3,500 కోట్ల వరకు ఆదా అవుతుందని ఎన్పీపీఏ అంచనా వేసింది.
ఈ నిర్ణయం కింద 20కి పైగా క్యాన్సర్ రకాల చికిత్సకు వాడే ఇమ్యునోథెరపీ మందులు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్లలో ఇచ్చే డెనోసుమాబ్, న్యూట్రోపేనియా నివారణకు వాడే పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్, కొలోన్, అండాశయ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు వాడే బెవాసిజుమాబ్ వంటి అత్యంత ఖరీదైన మందుల రేట్లు అందుబాటులోకి వచ్చాయి.
93 శాతానికి పైగా పడిపోయిన ఔషధ రేట్లు
తాజా సవరణలో కొన్ని రకాల అత్యవసర ఔషధాల ధరలు ఏకంగా 90 శాతానికి పైగా తగ్గిపోవడం విశేషం.
{{/usCountry}}తాజా సవరణలో కొన్ని రకాల అత్యవసర ఔషధాల ధరలు ఏకంగా 90 శాతానికి పైగా తగ్గిపోవడం విశేషం.
{{/usCountry}}పాల్బోసిక్లిబ్ (Palbociclib): రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడే పాల్బోప్రో 125 ఎంజీ (21 క్యాప్సూళ్ల ప్యాక్) ధరపై అత్యధికంగా 93.3 శాతం కోత విధించారు. గతంలో రూ.40,421.33 ఉన్న ఈ మందు ధర రూ.37,701.33 తగ్గి, ఇప్పుడు రూ.2,720 కే లభించనుంది.
థియోటెపా (Thiotepa): మూత్రాశయ క్యాన్సర్, స్టెమ్ సెల్ మార్పిడి సమయంలో వాడే శామ్టెపా 100 ఎంజీ ఇంజెక్షన్ వయల్ ధర 91.1 శాతం తగ్గింది. రూ.80,071.86గా ఉన్న దీని ఎమ్ఆర్పీని రూ.7,150.33కు తగ్గించడంతో ఒక్కో వయల్‌పై రూ.72,921.53 వరకు ఆదా కానుంది.
పెర్టుజుమాబ్ (Pertuzumab): హెచ్ఈఆర్2-పాజిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు వాడే హెర్టుమాబ్ వయల్ ధర రూ.94,951 నుంచి రూ.30,593కు (రూ.64,358 తగ్గింపు) దిగొచ్చింది. లుపిహెర్ 420 ఎంజీ వయల్ ధర రూ.83,520 నుంచి రూ.37,358.35కు తగ్గింది.
బెవాసిజుమాబ్ (Bevacizumab): అండాశయ, కొలోన్, ఊపిరితిత్తుల క్యాన్సర్లలో వాడే ఇవ్జుమాబ్ 400 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.69,852.12 నుంచి రూ.13,512కు తగ్గింది. బెవాసిజాబ్ 400 ఎంజీ ధర రూ.65,205.09 నుంచి రూ.8,956.75కు, సీజుమాబ్ 400 ఎంజీ ధర రూ.57,816 నుంచి రూ.10,211కు పడిపోయాయి.
ఒలాపరిబ్ (Olaparib): రొమ్ము, అండాశయ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లకు ఇచ్చే బిఆర్సిఏవన్ 150 ఎంజీ ప్యాక్ ధర రూ.46,364.05 నుంచి రూ.11,573.68కు తగ్గింది.
పెగ్ ఎల్-అపారాగిన్ (Peg L-Aparagin): ల్యూకేమియా చికిత్సకు ఇచ్చే ఇంజెక్షన్ ధర రూ.41,845.97 నుంచి రూ.7,766.85కు తగ్గించారు.
అబిరాటెరాన్ అసిటేట్ (Abiraterone acetate): ప్రొస్టేట్ క్యాన్సర్‌కు వాడే అబిరాట్ 250 ఎంజీ (120 టాబ్లెట్ల బాటిల్) ధర రూ.36,088.81 నుంచి రూ.4,064.48కు తగ్గింది.
మరికొన్ని ప్రముఖ బ్రాండ్ల నూతన ధరల వివరాలు
దేశీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు విక్రయించే పలు ప్రధాన బ్రాండ్ల ధరలలోనూ ఎన్పీపీఏ మార్పులు చేసింది.
అబాట్ హెల్త్‌కేర్ బెవాజికాబ్ (4 ఎమ్ఎల్ వయల్): రూ.21,767.70 నుంచి రూ.5,930.10కు తగ్గింది.
ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ ఫుల్బ్రెకా (5 ఎమ్ఎల్ వయల్): రూ.26,072.16 నుంచి రూ.5,491కు తగ్గింది.
ఆర్పీజీ డెబ్రుమాబ్ 60 ఎంజీ (1 ఎమ్ఎల్ పీఎఫ్ఎస్): రూ.22,031.25 నుంచి రూ.5,941కి చేరింది.
ఆర్పీజీ ఏనూటా (28 క్యాప్సూళ్లు): రూ.6,578.20 నుంచి రూ.2,232కు తగ్గింది.
హెటెరో హెల్త్‌కేర్ ఫ్లూడానాక్స్ : రూ.14,235 నుంచి రూ.2,432కు పడిపోయింది.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అజాసైటిన్: రూ.6,337 నుంచి రూ.1,495కు దిగొచ్చింది.
నాట్కో ఫార్మా డాసనాట్ 20 (60 టాబ్లెట్లు): రూ.2,812.50 నుంచి రూ.1,085.90కు సవరించారు.
రోగులపై పడుతున్న అపారమైన ఆర్థిక భారానికి చెక్ పెట్టడం ద్వారా నాణ్యమైన వైద్యం నిరుపేదలకు సైతం చేరువవుతుందని నిపుణులు భావిస్తున్నారు.