...
...
Next Story

పెరుగుతున్న ఊబకాయం సమస్య.. శారీరక, మానసిక ఆరోగ్యానికి డబుల్ ట్రబుల్

ఊబకాయం అంటే బరువు పెరగడం మాత్రమే కాదు. శరీర ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే ఒక ప్రమాదకరమైన పరిస్థితి. చాలా సార్లు ఇది ఒక లూప్ లా మారుతుంది. శరీర సమస్యలు మానసికంగా ప్రభావం చూపుతాయి, మానసిక సమస్యలు మళ్లీ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.

Published on: Apr 16, 2026 12:16 PM IST
Advertisement

ప్రస్తుతం ఊబకాయం (ఒబేసిటీ) ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద పబ్లిక్ హెల్త్ సమస్యగా మారింది. ప్రపంచంలో 100 కోట్లకు పైగా జనాభా ఈ సమస్యతో జీవిస్తున్నారు. ముందుగా శరీరంపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.

1. శారీరక ప్రభావం: దీర్ఘకాలిక వ్యాధుల పెరుగుదల

పెరుగుతున్న ఊబకాయం సమస్య.. శారీరక, మానసిక ఆరోగ్యానికి డబుల్ ట్రబుల్
పెరుగుతున్న ఊబకాయం సమస్య.. శారీరక, మానసిక ఆరోగ్యానికి డబుల్ ట్రబుల్

ఊబకాయం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది రిపీట్ అయ్యే స్వభావం కలిగి ఉంటుంది. ఇది చాలా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కి ప్రధాన కారణం.

ఇందులో ముఖ్యంగా :

  • హార్ట్ & మెటబాలిక్ సమస్యలు
  • క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగడం
  • లివర్ పనితీరు దెబ్బతినడం, మరీ ముఖ్యంగా ఫ్యాటీ లివర్
  • గాల్ బ్లాడర్ సమస్యలు
  • శ్వాసకోశ సమస్యలు, ముఖ్యంగా ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా
  • ఎముకలు, కండరాలపై ఒత్తిడి

2. మానసిక ఆరోగ్యంపై ప్రభావం: కనిపించని భారం

ఊబకాయం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఊబకాయం ఉన్నవారికి 30 నుంచి 70 శాతం వరకు మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

డిప్రెషన్, ఆందోళన, సమాజంలో ఎదురయ్యే విమర్శలు, బాడీ షేమింగ్ వల్ల నామోషీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ప్రభావం చూపిస్తుంది.

3. ఈ రెండూ కలిసి ఒక్ లూప్ లా పని చేయడం

  • ఊబకాయం, మానసిక సమస్యలు ఒకదానిని మరొకటి పెంచుతాయి.
  • ఊబకాయం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన పెరుగుతాయి. మానసిక సమస్యల వల్ల ఊబకాయం పెరుగుతుంది.
  • డిప్రెషన్ ఉన్నవారు సాధారణంగా కదలరు. వ్యాయామం చేయడానికి ఆసక్తి కోల్పోతారు. ఒత్తిడి ఎక్కువైతే ఎక్కువగా తినడం జరుగుతుంది. దీనివల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్ పెరిగి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది.
  • WHO (వల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) లెక్కల ప్రకారం ఊబకాయం అనేది జెనెటిక్స్, న్యూరో బయాలజీ, ఆహారపు అలవాట్లు, అందుబాటులో ఆరోగ్యకరమైన ఆహారం, పరిసరాలు వంటి అనేక అంశాల ప్రభావంతో వచ్చే వ్యాధి.
  • దేశాలు అభివృద్ధి చెందుతున్నకొద్దీ, ఆహార అలవాట్లు మారడం, ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఊబకాయం వేగంగా పెరుగుతోంది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది.
  • BMI 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఊబకాయం అంటారు.
  • మనం తీసుకునే ఎనర్జీ మరియు ఖర్చు చేసే ఎనర్జీ మధ్య అసమతుల్యత వల్ల ఊబకాయం వస్తుంది.
  • ఇది పర్యావరణం, మానసిక అంశాలు, జెనెటిక్ వేరియంట్స్ వల్ల వచ్చే వ్యాధి. ఊబకాయం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై ఇప్పుడు అవగాహన బాగా పెరిగింది.
  • పిల్లలు, ఇంకా యువతలో ఊబకాయం ఉంటే మానసికంగా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.

నివారణ, నిర్వహణ :

వ్యాస రచయిత:

- డా. హారిక ఉప్పలపాటి

కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్

మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON