Woman health : ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి కారణంగా చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమే) ఒకటి. వైద్య నిపుణులు ఇటీవల దీనిని 'పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్' లేదా ‘పీఎమ్‌ఓఎస్’గా మార్చారు. ఈ హార్మోన్ల లోపానికి శాశ్వత నివారణ లేనప్పటికీ, సరైన ఆహారపు అలవాట్లు, రోజువారీ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవచ్చు.

ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దీప్శిఖ జైన్ తన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో స్థానిక మార్కెట్‌ను సందర్శించి, హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడే కొన్ని ప్రత్యేకమైన కూరగాయలను పరిచయం చేశారు.
“మీరు గనుక పీఎమ్‌ఓఎస్ లేదా హార్మోన్ల సమస్యలతో బాధపడుతుంటే, మీ రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన నాలుగు కూరగాయలు ఇవే,” అని ఆమె ఆ కూరగాయల ప్రత్యేకతలను క్లియర్ గా వివరించారు.
ఆకుకూరలు (పాలకూర, తోటకూర, మెంతికూర)..
పాలకూర, మెంతికూర వంటి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) కూడా తక్కువగా ఉండటం వల్ల, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను లేదా ఇన్సులిన్‌ను ఒక్కసారిగా పెంచకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ముదురు రంగు ఆకుకూరల్లో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, ఇవి హార్మోన్లను సమతుల్యం చేయడంతో పాటు శరీరంలో వచ్చే వాపు, నొప్పులను తగ్గిస్తాయని న్యూట్రిషనిస్ట్ పేర్కొన్నారు.
క్రూసిఫెరస్ కూరగాయలు (బ్రాకోలి, క్యాబేజీ)
బ్రాకోలి, క్యాలీఫ్లవర్, కేల్, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ జాతికి చెందిన కూరగాయలు శరీరంలో వచ్చే మెటబాలిక్, హార్మోన్ల అసమతుల్యతపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో, ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో, పీఎమ్‌ఓఎస్ వల్ల శరీరంలో వచ్చే అంతర్గత వాపును (ఇన్‌ఫ్లమేషన్‌ను) తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బ్రాకోలి, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు శరీరంలో పెరిగిపోయే ఈస్ట్రోజెన్ ఆధిక్యతను తగ్గించడమే కాకుండా, కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, తద్వారా హార్మోన్లు సమతుల్యంగా మారుతాయని దీప్శిఖ జైన్ తెలిపారు.
చిలగడదుంప..
హార్మోన్ల ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల జాబితాలో తర్వాతి స్థానం చిలగడదుంపది. చిలగడదుంపల్లో 'రెసిస్టెంట్ స్టార్చ్' ఉంటుందని, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఆమె వివరించారు. జీర్ణవ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉంటే, హార్మోన్ల పనితీరు అంత బాగుంటుందని ఆమె చెప్పారు. అంతేకాకుండా, ఇవి రుచికి తీపిగా ఉన్నప్పటికీ, సాధారణ బంగాళాదుంపలతో పోలిస్తే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) చాలా తక్కువగా ఉంటుంది. ఈ గుణం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరగవు మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యను సులభంగా మేనేజ్ చేయవచ్చు.
కాకరకాయ..
{{/usCountry}}హార్మోన్ల ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల జాబితాలో తర్వాతి స్థానం చిలగడదుంపది. చిలగడదుంపల్లో 'రెసిస్టెంట్ స్టార్చ్' ఉంటుందని, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఆమె వివరించారు. జీర్ణవ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉంటే, హార్మోన్ల పనితీరు అంత బాగుంటుందని ఆమె చెప్పారు. అంతేకాకుండా, ఇవి రుచికి తీపిగా ఉన్నప్పటికీ, సాధారణ బంగాళాదుంపలతో పోలిస్తే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) చాలా తక్కువగా ఉంటుంది. ఈ గుణం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరగవు మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యను సులభంగా మేనేజ్ చేయవచ్చు.
కాకరకాయ..
{{/usCountry}}చివరిగా కాకరకాయ పీఎమ్‌ఓఎస్ ఉన్నవారికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. కాకరకాయ రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటుందని, శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహించేలా (ఇన్సులిన్ సెన్సిటివ్) చేస్తుందని దీప్శిఖ వివరించారు. దీనివల్ల హార్మోన్ల పనితీరు మెరుగై, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, కాకరకాయలో ఉండే కొన్ని సహజ ప్లాంట్ కాంపౌండ్స్ శరీరంలో ఇన్సులిన్ లాగే ప్రవర్తించి, రక్తప్రవాహం నుంచి అదనపు గ్లూకోజ్‌ను తొలగించడానికి అద్భుతంగా తోడ్పడతాయి.