Quote of the day : సక్సెస్​కి కావాల్సిన అసలు మైండ్‌సెట్- రణ్​వీర్​ సింగ్​ మాటల్లో..

Quote of the day : బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్​వీర్ సింగ్ ప్రస్తుతం కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా గోల్డెన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక సామాన్యుడిగా మొదలై సూపర్ స్టార్‌గా ఎదిగినరణ్​వీర్ జీవన తత్వం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Apr 22, 2026, 07:28:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ranveer Singh success story : వరుస విజయాలు ఒకవైపు, తండ్రి కాబోతున్నానన్న ఆనందం మరోవైపు.. రణ్​వీర్ జీవితం ఇప్పుడు ముచ్చటగా కనిపిస్తోంది. అయితే, ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆయన అనుసరించిన ఒకే ఒక సూత్రం 'నిరంతర పోరాటం'. గతంలో జరిగిన ఓ బ్రాండ్ లాంచ్‌ ఈవెంట్​లో ఈ ధురంధర్​ స్టార్ పంచుకున్న తన లైఫ్​ ఫిలాసఫీ నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

ధురంధర్​ 2లో రణ్​వీర్​ సింగ్..
ధురంధర్​ 2లో రణ్​వీర్​ సింగ్..

భయాన్ని వదిలేయండి.. ఇష్టాన్ని వెంటాడండి!

విజయానికి మార్గం ఏమిటని అడిగినప్పుడు రణ్​వీర్ చాలా స్పష్టంగా సమాధానమిచ్చారు.

"మీకు దేని మీదైతే మక్కువ (ప్యాషన్) ఉందో, దానిని అనుసరించడానికి అస్సలు భయపడకండి. మీ పూర్తి శక్తిని, మనస్సును పెట్టి దాని కోసం పోరాడండి. మనకు ఉన్నది ఒకే ఒక్క జీవితం, దానిని అత్యుత్తమంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనదే," అని ఆయన పేర్కొన్నారు.

చాలామంది విఫలమవుతామేమో అన్న భయంతో తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రారు. కానీ రణ్​వీర్ దృష్టిలో, ఓటమి అనేది ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు విజయం వరించి తీరుతుందని ఆయన బలంగా నమ్ముతారు.

"ఓర్పు" మాత్రమే కాదు.. "పోరాటం" కూడా ముఖ్యం

కేవలం ఏదో ఒక పని చేస్తూ బతికేయడం జీవితం అనిపించుకోదు. మనకు ఇష్టమైన పనిని చేస్తున్నప్పుడే మనం నిజంగా జీవిస్తున్నట్లు అనుభూతి చెందుతాము. రణ్​వీర్ సింగ్ కూడా తన తొలి సినిమా 'బ్యాండ్ బాజా బారాత్' కంటే ముందు ఎన్నో కష్టాలు పడ్డారు.

అబ్జర్వేషన్: కేవలం ఆడిషన్స్ ఇవ్వడమే కాదు, షూటింగ్ సెట్స్‌కి వెళ్లి నటులు ఎలా నటిస్తున్నారో గంటల తరబడి గమనించేవారు.

నిబద్ధత: తన కలను నిజం చేసుకోవడం కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధపడేవారు.

చాలామంది "ఒకవేళ వర్కవుట్ కాకపోతే పరిస్థితి ఏంటి?" అని ఆలోచిస్తూ ఆగిపోతారు. కానీ, రణ్​వీర్ చెప్పినట్లు మనల్ని మనం నమ్ముకుని, భావోద్వేగపూరితంగా ఒక పని మీద దృష్టి పెడితే పరిస్థితులు వాటంతట అవే సెట్​ అవుతాయి.

మైండ్‌సెట్ ఇలా ఉండాలి..

ప్రస్తుతం రణ్​వీర్ సాధిస్తున్న విజయాల వెనుక ఈ ‘నేర్చుకునే తత్వం’, 'అంతం లేని పట్టుదల' ఉన్నాయి. ఓటమిని చూసి కుంగిపోకుండా, ప్రతి అడుగులోనూ కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగడం వల్లే ఆయన ఈరోజు బాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరిగా నిలబడ్డారు. ఇప్పుడు రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందుతూ పర్సనల్ లైఫ్‌లోనూ సక్సెస్ ఫుల్ అనిపించుకుంటున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. రణ్​వీర్ సింగ్, దీపికా పదుకొనే రెండో బిడ్డ గురించి ఎప్పుడు ప్రకటించారు?

ఇటీవలే రణ్​వీర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తాము రెండో బిడ్డను ఆశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

2. రణ్​వీర్ సింగ్ సక్సెస్ మంత్రం ఏంటి?

తనకు ఇష్టమైన పనిని భయం లేకుండా వెంబడించడం, ఓటమిని చూసి భయపడకుండా పట్టుదలతో ప్రయత్నించడమే తన సక్సెస్ సీక్రెట్ అని ఆయన చెబుతారు.

3. రణ్​వీర్ సింగ్ కెరీర్ మొదట్లో ఎలాంటి కష్టాలు పడ్డారు?

తొలి అవకాశం రాకముందు రణ్​వీర్ ఎన్నో ఆడిషన్స్ ఇచ్చారు. షూటింగ్ సెట్స్‌కి వెళ్లి నటులను గమనిస్తూ, నటనలోని మెళకువలను నేర్చుకుంటూ తన వంతు ప్రయత్నం చేసేవారు.

4. రణ్​వీర్ సింగ్ తాజా హిట్లు ఏంటి?

ప్రస్తుతం రణ్​వీర్ బాక్సాఫీస్ వద్ద వరుసగా రెండు భారీ హిట్లను అందుకున్నారు, ఇవి ఇండియన్ సినిమాలో కలెక్షన్ల పరంగా రికార్డులను సృష్టించాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More