Hair Care : మండే ఎండ మీ జుట్టు మీద ప్రభావం చూపిస్తుందా? ఈ ఆహారాలు తినండి
Summer Hair Care : వేసవిలో చర్మమే కాదు.. సూర్యుడి ప్రతాపానికి జుట్టు కూడా పాడవుతుంది. అందుకే సరైనా ఆహారాలు తీసుకోవాలి. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన కోపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పిటేకే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. మన జుట్టు సూర్యుని కారణంగా వివిధ రకాల ఇబ్బందులకు గురవుతుంది. ఇతర కాలాలతో పోలిస్తే వేసవిలో జుట్టు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. మండే వేసవి ఎండ నుండి మీ జుట్టును కాపాడుకోవడానికి సీక్రెట్ ఏంటంటే.. మీ ఆహారంలోనే ఉంది.

బ్లూబెర్రీస్
- అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన హ్యూమన్ న్యూట్రిషన్ సెంటర్ (HNRCA) నివేదిక ప్రకారం, 40 రకాల పండ్లు, కూరగాయలను కలిపి చూసినా వాటికంటే బ్లూబెర్రీస్‌లో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బ్లూబెర్రీస్ మీ జుట్టును రక్షించడమే కాకుండా.. వృద్ధాప్యం, గుండె జబ్బులు, క్యాన్సర్‌కు దారితీసే ఆక్సీకరణ ఒత్తిడిని కూడా ఎదుర్కొంటాయి. వాటిని పెరుగుతో కలిపి తినడం వల్ల వాటి ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఎందుకంటే వాటిలోని అదనపు ప్రోటీన్ మీ జుట్టును బలంగా, ఒత్తుగా ఉంచుతుంది.
చేపలు
- ఇతర మాంసాహారాలతో పోలిస్తే, జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు చేపలలో పుష్కలంగా ఉంటాయి. చేపలు, ముఖ్యంగా సాల్మన్, సార్డిన్‌లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు లేకపోతే, జుట్టు పెళుసుగా, పొడిగా మారుతుంది. ఈ వేసవిలో మీ ఆహారంలో చేపలను తరచుగా చేర్చుకోండి.
పుచ్చకాయ
- పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, అందులో అనేక పోషకాలు కూడా ఉంటాయి. ఒక కప్పు పుచ్చకాయలో రోజువారీ సిఫార్సు చేసిన విటమిన్ ఏ లో 17 శాతం, విటమిన్ సీ లో 21 శాతం ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. విటమిన్ ఏ తలపై చుండ్రును నివారిస్తుంది. ఆరోగ్యకరమైన కొల్లాజెన్ కణాలను ప్రోత్సహిస్తుంది, తద్వారా మీ జుట్టు మెరిసేలా, బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది కాకుండా పుచ్చకాయలో థయామిన్, విటమిన్ బి-6, మెగ్నీషియం, పాంతోతేనిక్ యాసిడ్, పొటాషియం, జింక్, సెలీనియం, కోలిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది, ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.
పాలకూర
- వేసవి కాలంలో మీ ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే పాలకూర ఆకులను క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పాలకూర వంటి ఆకుకూరలు ఎర్ర రక్త కణాలకు, కేశ కుదుళ్లకు ఆక్సిజన్‌ను చేరవేయడంలో సహాయపడి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. పాలకూర రకాలలో జుట్టు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ అయిన బయోటిన్ పుష్కలంగా ఉంటుంది.
టొమాటో
- లైకోపీన్, బీటా-కెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉండే టమోటాలు, చర్మాన్ని, జుట్టును నష్టం నుండి కాపాడతాయి. టమోటాలలో లైకోపీన్ అధికంగా ఉంటుంది. వేసవి నెలల్లో వీలైనంత తరచుగా మీ ఆహారంలో టమోటాలను చేర్చుకోవడం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


