International Trip : బడ్జెట్​ రూ. 50వేలు! శ్రీలంక, థాయిలాండ్, వియత్నాంలో ఏది బెస్ట్?

International Trip under 50000 : ఇండియాలో ట్రిప్ వేయడమే ఖరీదైన వ్యవహారంగా మారుతున్న ఈ రోజుల్లో.. కేవలం రూ. 50,000 బడ్జెట్​లో ఒక వారం రోజుల పాటు అంతర్జాతీయ ట్రిప్ ప్లాన్ చేయడం సాధ్యమేనా? అంటే.. ఖచ్చితంగా సాధ్యమే అంటోంది ఏఐ. ఇందుకోసం 3 దేశాలను ఎనలైజ్​ చేసి పక్కా ప్లాన్ ఇచ్చింది. అవేంటో మీరూ చూసేయండి

Published on: May 24, 2026, 10:43:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రూ. 50,000 బడ్జెట్‌లో విదేశీ పర్యటన చేయాలనుకునే వారి కోసం థాయిలాండ్, వియత్నాం, శ్రీలంక దేశాలు అద్భుతమైన ఆప్షన్లుగా నిలుస్తాయి. నలుగురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల వేసవి ట్రిప్ ప్లాన్ చేయడానికి ఏఐ (చాట్​జీపీటీ) సృష్టించిన బెస్ట్ ప్లాన్, ఖర్చుల వివరాలు, రూ. 50వేల బడ్జెట్​లో ఏ దేశం బెస్ట్ అనే విశ్లేషణను ఇక్కడ చూద్దాము.

రూ. 50వేల బడ్జెట్​లో విదేశీ ట్రిప్- ఎక్కడ బెస్ట్?
రూ. 50వేల బడ్జెట్​లో విదేశీ ట్రిప్- ఎక్కడ బెస్ట్?

1. థాయిలాండ్ - బీచ్‌లు, నైట్‌లైఫ్ లవర్స్ కోసం!

థాయిలాండ్‌ అనగానే మనకు బ్యాంకాక్ ఎనర్జీ, ఫుకెట్ లేదా క్రాబి బీచ్‌లు గుర్తుకొస్తాయి. 7 రోజుల ట్రిప్‌లో మొదటి రెండు రోజులు బ్యాంకాక్, ఆ తర్వాత ఫుకెట్/క్రాబి ద్వీపాల్లో ఐలాండ్ హాపింగ్, ఫై ఫై ఐలాండ్స్ డే ట్రిప్ వేయవచ్చు.

ఫ్లైట్ ఖర్చులు: భారత్ నుంచి రిటర్న్ ఫ్లైట్ టికెట్లు ముందుగా బుక్ చేసుకుంటే రూ. 18,000 నుంచి రూ. 24,000 వరకు ఉంటాయి.

హోటళ్లు అండ్ ఫుడ్: నలుగురు కలిసి రూమ్ షేర్ చేసుకుంటే ఒక వారానికి ఒకరిపై రూ. 8,000 లోపు ఖర్చవుతుంది. లోకల్ ఫుడ్, కేఫ్‌లకు రూ. 5,000 సరిపోతుంది.

మొత్తం ఖర్చు: అంతర్గత విమాన ప్రయాణాలు, సైట్‌సీయింగ్ కలిపి ఒక్కొక్కరికి రూ. 48,000 నుంచి రూ. 58,000 వరకు అవుతుంది.

కేటగిరీఖర్చులు (అంచనా)
Return flightsరూ. 18,000–24,000
Visa/Thailand Digital Arrivalరూ. 2,000–3,000
Hotels (shared)రూ. 8,000
Foodరూ. 5,000
Local transport + internal flightsరూ. 8,000
Sightseeing & island toursరూ. 7,000
Miscellaneousరూ. 3,000
Total Budgetరూ. 48,000–58,000

2. వియత్నాం - అద్భుతమైన ప్రకృతి, సంస్కృతి!

ప్రస్తుతం భారతీయులకు అత్యంత ఇష్టమైన డెస్టినేషన్ వియత్నాం. ఇక్కడి హనోయ్ నగరం, హా లాంగ్ బే క్రూయిజ్ ప్రయాణం, కయాకింగ్, దా నాంగ్, హోయ్ ఆన్ నగరాల్లోని లాంతర్ల వీధులు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

ఫ్లైట్ ఖర్చులు: రిటర్న్ ఫ్లైట్ టికెట్లు రూ. 22,000 నుంచి రూ. 28,000 వరకు ఉంటాయి.

హోటళ్లు అండ్ ఫుడ్: ఇక్కడ వసతి చాలా చౌక. షేర్డ్ రూమ్స్ వారం రోజులకు ఒకరికి రూ. 6,000 మాత్రమే అవుతుంది. ప్రపంచ ప్రసిద్ధ వియత్నామీస్ లోకల్ ఫుడ్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది.

మొత్తం ఖర్చు: హా లాంగ్ బే క్రూయిజ్ రైడ్, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ అన్ని కలిపి ఒక్కొక్కరికి రూ. 47,000 నుంచి రూ. 56,000 అవుతుంది.

కేటగిరీఖర్చులు (అంచనా)
Return flightsరూ.22,000–28,000
Visaరూ. 2,500
Hotels (shared)రూ. 6,000
Foodరూ. 4,000
Local transport + domestic flightరూ. 6,500
Ha Long Bay cruiseరూ. 5,000
Sightseeingరూ. 4,000
Miscellaneousరూ. 3,000
Total Budgetరూ. 47,000–56,000

3. శ్రీలంక - బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ప్రశాంతత..

ఈ మూడింటిలోనూ జేబుకు అస్సలు భారం కాని దేశం శ్రీలంక! కొలంబోతో మొదలుపెట్టి క్యాండీ, ఎల్లా నగరాల్లోని టీ తోటలు, జలపాతాలు, బెంటోటా లేదా మిరిస్సా బీచ్‌లను ఇక్కడ అన్వేషించవచ్చు. ప్రశాంతమైన హాలిడే కావాలనుకునే వారికి ఇది బెస్ట్.

ఫ్లైట్ ఖర్చులు: భారత్‌కు చాలా దగ్గరగా ఉండటం వల్ల ఫ్లైట్ టికెట్లు కేవలం రూ. 14,000 నుంచి రూ. 20,000 లోపే దొరుకుతాయి.

హోటళ్లు అండ్ ఫుడ్: అందమైన లొకేషన్లలో కూడా హోటళ్లు, లోకల్ ట్రాన్స్‌పోర్ట్, సైట్‌సీయింగ్ చాలా రీజనబుల్ ధరల్లో ఉంటాయి.

మొత్తం ఖర్చు: వారం రోజుల పర్యటనకు ఒక్కొక్కరికి రూ. 40,000 నుంచి రూ. 48,000 లోపే ట్రిప్ ముగిసిపోతుంది.

కేటగిరీఖర్చులు (అంచనా)
Return flightsరూ. 14,000–20,000
Visa/ETAరూ. 2,000
Hotels (shared)రూ. 7,000
Foodరూ. 4,000
Local transportరూ. 3,500
Sightseeingరూ. 5,000
Activitiesరూ. 4,000
Miscellaneousరూ. 3,000
Total Budgetరూ. 40,000–48,000

చాట్​జీపీటీ ఫైనల్ జడ్జిమెంట్..

థాయిలాండ్: మీకు షాపింగ్, నైట్‌లైఫ్, పార్టీలు, బీచ్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే థాయిలాండ్ వెళ్లండి.

శ్రీలంక: ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా, తక్కువ బడ్జెట్‌లోనే ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతిని ఆస్వాదించాలంటే శ్రీలంక ది బెస్ట్.

వియత్నాం (విజేత): రూ. 50,000 బడ్జెట్‌లో 'వియత్నాం' అత్యుత్తమమైనది అని ఏఐ స్పష్టం చేసింది. ఎందుకంటే మనం పెట్టే తక్కువ బడ్జెట్‌కు అక్కడ లభించే హోటళ్ల క్వాలిటీ, ప్రీమియం ఫుడ్, క్రూయిజ్ ప్రయాణాలు, లగ్జరీ అనుభూతి చాలా ఎక్కువగా ఉంటాయి.

మరి ఈ మూడు డెస్టినేషన్స్​లో మీరు ఏది ఎంచుకుంటారు?

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More