Dhurandhar : ధురంధర్​లోని చాయ్​ షాపు.. ఒరిజినల్ లొకేషన్ ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు!

Dhurandhar 2 : ఇటీవల విడుదలైన ధురంధర్ సినిమాలో కనిపించే ‘వాష్మా బట్ బిర్యానీ అండ్ చాయ్ షాప్’.. కేవలం సినిమా సెట్ అనుకుంటే పొరపాటే. లద్ధాఖ్‌లోని లేహ్లో ఈ చాయ్ షాప్ నిజంగానే ఉందంటూ ఒక ట్రావెల్ వ్లాగర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

May 19, 2026, 09:08:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dhurandhar 2 OTT : ఇటీవలి కాలంలో వన్ ఆఫ్​ ది బెస్ట్​ సినిమ్యాటిక్​ ఎక్స్​పీరియెన్స్​ ఇచ్చిన చిత్రాల్లో 'ధురంధర్​' ఒకటని అనడంలో సందేహం లేదు. ఆదిత్య ధర్ పీక్​ డీటైలింగ్​తో వచ్చిన ధురంధర్​ 1, ధురంధర్​ 2 సినిమాలు బాక్సాఫీసు వద్ద ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అనేక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రెండో పార్ట్​లో రణవీర్​ సింగ్​ పోషించిన హంజా కుటుంబం పాత్ర పాకిస్థాన్​లో ఒక లగ్జరీ విల్లాలో ఉన్నట్టు చూపిస్తారు. వాస్తవానికి అది అమృత్​సర్​ దగ్గరిలో ఉందని గతంలో తెలిసింది. ఇక ఇప్పుడు ఆ సినిమాల్లో తరచూ చూపించే చాయ్​ షాపు ఒరిజినల్​ లొకేషన్ సైతం బయటపడింది. అది తెలిసిన వారందరు షాక్​ అవుతున్నారు.

ధురంధర్​లో చూపించిన చాయ్ షాపు ఇదే..
ధురంధర్​లో చూపించిన చాయ్ షాపు ఇదే..

ధురంధర్​లో చాయ్​ షాపు- ఎక్కడుందంటే..

సినిమాల్లో కొన్ని లొకేషన్లు ఎంత అందంగా, పద్ధతిగా కనిపిస్తాయంటే.. ప్రేక్షకులు అవన్నీ కేవలం ఆర్ట్ డైరెక్టర్లు వేసిన ఫిలిం సెట్స్ అని భావిస్తారు. ధురంధర్​లో కనిపించిన ‘వాష్మా బట్ బిర్యానీ అండ్ చాయ్ షాప్’ విషయంలోనూ ఇదే జరిగింది. అయితే, అది ఎలాంటి సినిమా సెట్ కాదు.. లద్ధాఖ్‌లోని ‘లేహ్’లో ఉన్న ఒక నిజమైన చాయ్ దుకాణం అని తేలింది.

సౌమ్య ఛటర్జీ అనే ట్రావెల్ క్రియేటర్ ఈ ఐకానిక్ చాయ్ స్పాట్‌ను స్వయంగా సందర్శించి తన ఇన్​స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఈ టీ షాప్ సినిమాలో కనిపించినట్లుగానే పాతకాలపు రస్టిక్ సెటప్, అదే బోర్డు, అదే వైబ్‌తో అచ్చంగా అలాగే ఉంది. ఈ కేఫ్ లోపల సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్లు కూడా ఉన్నాయి. అందులో ఒక పోస్టర్‌లో హంజా అలీ, ఆలం భాయ్‌తో కలిసి టీ తాగుతూ కనిపిస్తాడు.

ఆ వీడియోలో వ్లాగర్ సౌమ్య మాట్లాడుతూ.. "ఇక్కడికి ఒంటరిగా రావడం నిషేధం ఏమీ కాదు. కానీ ఒక చిన్న కండిషన్ ఉంది.. మీరు ఇక్కడ రెండు కప్పుల చాయ్ ఆర్డర్ చేయాలి. ఒకటి మీ కోసం, మరొకటి ఈ ప్రదేశం అనుభూతిని ఆస్వాదించడం కోసం," అంటూ లొకేషన్ అందాన్ని వర్ణించాడు.

సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న వీడియోని ఇక్కడ చూడండి :

నిజమైన పేరు అది కాదు.. నెటిజన్ల కామెడీ కామెంట్స్..

ఈ కథనంలో అత్యంత ఆసక్తికరమైన, హాస్యాస్పదమైన విషయం ఏంటంటే.. ఆ హోటల్ అసలు పేరు 'వాష్మా బట్' కాదు. దాని బయట ఉన్న ఒక చిన్న బోర్డు ప్రకారం దాని అసలు పేరు 'ఎస్​హెచ్ ఖాన్ రెస్టారెంట్'. కానీ ధురంధర్ సినిమా షూటింగ్ సమయంలో పెట్టిన 'వాష్మా బట్ బిర్యానీ అండ్ చాయ్ షాప్' అనే బోర్డు సినిమా హిట్టయ్యాక అలాగే ఉండిపోయింది.

అయితే ఆ పేరును ఇంగ్లీషులో చదివితే అది కాస్త "వాష్ మై బట్" (Wash My Butt) లాగా వినబడుతుండటంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో కామెడీ చేస్తున్నారు. "అసలు ఆ పేరును ఎవరూ గమనించడం లేదా?" అని ఒకరు, "ఇక ఇక్కడ జనాలు లైన్లు కట్టడం ఖాయం" అని మరొకరు కామెంట్ చేశారు. ధురంధర్ సినిమాలో వచ్చే ‘ఉప్పు చాయ్’ సీన్‌ను గుర్తు చేసుకుంటూ.. "భాయ్.. చాయ్ ఏమైనా ఉప్పగా ఉందా?" అని ఒక నెటిజన్ అడగడం విశేషం.

లద్ధాఖ్‌కు కొత్త అట్రాక్షన్!

లేహ్-లద్ధాఖ్ అనగానే అందరికీ గుర్తొచ్చే అందమైన పర్వతాలు, బౌద్ధారామాలు, అడ్వెంచర్ రోడ్ల జాబితాలోకి ఇప్పుడు 'ధురంధర్' సినిమా పుణ్యమా అని ఈ సరికొత్త టూరిస్ట్ అట్రాక్షన్ కూడా వచ్చి చేరింది. సదరు సినిమాలో ‘ఆలం భాయ్’ పాత్ర పోషించిన నటుడు గౌరవ్ గేరా సైతం ఈ వీడియోపై స్పందిస్తూ హార్ట్ ఎమోజీలను కామెంట్ సెక్షన్‌లో షేర్ చేశాడు.

ధురంధర్​ 2లో చూపించిన విల్లా గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇండియాలో ధురధర్​ 2 ఓటీటీ రిలీజ్​ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More