Dhurandhar 2 : 'ధురంధర్ 2' విల్లా వెనుక అసలు నిజం! కరాచీలో కాదు.. మన అమృత్‌సర్‌లో..

Dhurandhar 2 collection : ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్​వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో కరాచీలోని ల్యారీలో ఉన్నట్టు చూపించిన విలాసవంతమైన విల్లా, నిజానికి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉందని మీకు తెలుసా?

Published on: Mar 22, 2026, 10:01:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రణ్​వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. 2025లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'ధురంధర్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం.. పాకిస్థాన్‌లోని బలోచ్ గ్యాంగ్‌లోకి చొరబడిన భారత గూఢచారి జస్కీరత్ సింగ్ రంగీ (అలియాస్ హమ్జా అలీ మజారీ) కథాంశంతో సాగుతుంది.

ధురంధర్​ 2 బంగ్లా..
ధురంధర్​ 2 బంగ్లా..

సినిమా రెండో భాగంలో, కరాచీలోని ల్యారీ ఏరియాలో అండర్ వరల్డ్ కింగ్‌పిన్‌గా ఎదిగిన హమ్జా (రణవీర్), తన భార్య యలీనా (సారా అర్జున్) కోసం ఒక అత్యంత విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేస్తాడు. అయితే, వెండితెరపై కరాచీలో ఉన్నట్టు కనిపించే ఆ అద్భుతమైన బంగ్లా ఎక్కడుందో తెలుసా? నిజానికి ఈ బంగ్లా మన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంది!

'ఆనంద'.. పంజాబ్ మట్టిలో వెలిసిన ఆధునిక కళాఖండం..

మార్చి 20న ఇన్​స్టాగ్రామ్​లో '23డీసీ ఆర్కిటెక్ట్స్' అనే సంస్థ ఒక వీడియోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. తాము డిజైన్ చేసిన 'ఆనంద' అనే ప్రాజెక్ట్ 'ధురంధర్ 2' వంటి సినిమాటిక్ మాస్టర్‌పీస్‌లో భాగమైనందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. రణ్​వీర్ సింగ్, సారా అర్జున్‌ల స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల ఆ ఇల్లు మరింత అందంగా కనిపిస్తోందని వారు పేర్కొన్నారు.

ధురంధర్​ 2 బంగ్లా- ప్రకృతి, ఆధునికత కలబోత..

ఈ ఇంటిని ప్రకృతిని కాపాడుతూనే, భారతీయ సౌందర్య దృక్పథంతో నిర్మించారు.

"ఈ భవనంలో వెలుతురు, స్పేస్​ ఒక లయబద్ధంగా కలిసిపోతాయి. పూల తోటలు భవనం గుండా అల్లుకుపోయి ఉంటే, సాంప్రదాయ హస్తకళలు ఆధునిక డిజైన్‌కు వెన్నుముకగా నిలుస్తాయి," అని ఆర్కిటెక్ట్స్ వివరించారు.

Aditya Dhar Net worth : ధురంధర్​ 2 మేనియా- ఆదిత్య ధర్​ నెట్​ వర్త్​ ఎంతో తెలుసా?

ధురంధర్​ 2 బంగ్లా లోపల ఏముంది?

ఎక్స్‌టీరియర్: బయటి నుంచి చూస్తే గ్రే రంగు గోడలు, చెక్క పలకల ఫినిషింగ్‌తో అత్యంత మోడ్రన్‌గా కనిపిస్తుంది. లోపలికి ప్రవేశించగానే రాతి శిల్పాలు, గాజు గోడలు, పచ్చని లాన్, ప్రైవసీ కోసం నిర్మించిన ఎత్తైన గోడలు మనల్ని ఆహ్వానిస్తాయి.

మెయిన్ హాల్: ఇంటి మధ్యలో ఉండే నలుపు రంగు మార్బుల్ 'స్పైరల్ మెట్లు' ఇంటికి ప్రధాన ఆకర్షణ. ఇది ఆఫ్-వైట్ మార్బుల్ ఫ్లోరింగ్‌కు చక్కని కాంట్రాస్ట్‌ను ఇస్తుంది. పెద్ద కిటికీలు, గ్లాస్ ప్యానెల్ గోడల వల్ల పగలు సహజమైన వెలుతురు ఇల్లంతా పరుచుకుంటుంది.

బెడ్‌రూమ్‌లు: డబుల్-సీలింగ్ ఉన్న ఈ బంగ్లాలోని బెడ్‌రూమ్‌లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. మినిమల్ డెకర్, ఆధునిక ల్యాంప్స్, సెంట్రల్ కూలింగ్ సిస్టమ్, విశాలమైన వార్డ్‌రోబ్స్ ఇందులో ఉన్నాయి.

గార్డెన్ అండ్ పూల్: ఈ ఇంటి హైలైట్ ఏదైనా ఉందంటే అది అక్కడి స్విమ్మింగ్ పూల్, అవుట్‌డోర్ సీటింగ్ ఏరియా. వెదురుతో చేసిన కంఫర్ట్ సోఫాలు, చుట్టూ దట్టమైన మొక్కల మధ్య ఈ ప్రదేశం అద్భుతంగా ఉంటుంది.

లివింగ్ రూమ్: బీజ్, బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉండే లివింగ్ రూమ్‌లో అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ పీస్, ఖరీదైన సోఫాలు రాయల్ లుక్‌ను అందిస్తాయి.

సినిమా షూటింగ్ కోసం లొకేషన్ల ఎంపిక ఎంత కీలకంగా ఉంటుందో ఈ 'ఆనంద' బంగ్లా నిరూపిస్తోంది. అమృత్‌సర్‌లోని ఒక అందమైన ఇంటిని కరాచీలోని డాన్ నివాసంగా చూపించడంలో చిత్ర బృందం సఫలమైందని చెప్పడంలో సందేహమే లేదు.

ధురంధర్​ 2లో ఉన్న రణ్​వీర్​ సింగ్​ బంగ్లా వీడియోని ఇక్కడ చూసేయండి..

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More