హైదరాబాద్ లాంటి మహానగరాల్లో డెస్క్ ఉద్యోగాలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజూ గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, సుదీర్ఘ ప్రయాణాలు, నిశ్చల జీవనశైలి వల్ల చాలామంది తమ శరీరానికి కావాల్సిన శారీరక శ్రమను అందించలేకపోతున్నారు. మన శరీరంలో ఎక్కడైనా నొప్పులు వస్తేనే ఆరోగ్యం క్షీణిస్తోందని లేదా వ్యాయామం ప్రారంభించాలని సాధారణంగా భావిస్తాం. కానీ నొప్పులు, తీవ్రమైన అసౌకర్యం ప్రారంభం కాకముందే శరీరం కొన్ని సూక్ష్మమైన హెచ్చరికలను పంపుతుంది.

"తీవ్రమైన అసౌకర్యం లేదా నొప్పి కలగడానికి ముందే శరీరం తన అవసరాలను కొన్ని సంకేతాల రూపంలో తెలియజేస్తుంది," అని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ సచిన్ సేథి వెల్లడించారు. రోజంతా నిష్క్రియగా ఉండడం వల్ల కండరాలు, కీళ్లు, రక్తప్రసరణ వ్యవస్థతో పాటు శక్తి స్థాయిలు ఎలా ప్రభావితమవుతాయో ఆయన వివరించారు. శరీరం ఇచ్చే ఆ 6 ముఖ్యమైన సంకేతాలను వివరంగా తెలుసుకుందాం.
కూర్చుని లేవగానే కీళ్లలో బిగుతు..
సుదీర్ఘ సమయం ఒకే చోట కూర్చున్న తర్వాత నిలబడేటప్పుడు తుంటి, మోకాళ్లు, భుజాలు లేదా వెన్నుభాగంలో బిగుతుగా అనిపించడం శారీరక శ్రమ లోపించిందనడానికి మొదటి సంకేతం. క్రమం తప్పకుండా శరీరాన్ని కదిలించడం వల్ల కీళ్లు తమ సహజ సిద్ధమైన పరిధిలో కదులుతాయి. కండరాలు బిగుసుకుపోకుండా ఉపశమనం లభిస్తుంది.
చిన్న చిన్న పనులకే విపరీతమైన అలసట..
నాలుగు మెట్లు ఎక్కినా, కొద్దిదూరం నడిచినా లేదా ఇంటి చిన్న పనులు చేసినా వెంటనే అలసిపోతున్నారా? అయితే మీ శారీరక ఫిట్‌నెస్ తగ్గబోతోందని అర్థం. "శరీరం కదలికలకు దూరంగా ఉంటే.. రోజువారీ ప్రాథమిక పనులు చేయడం కూడా కష్టంగా మారుతుంది," అని సేథి పేర్కొన్నారు.
నిరంతరం మందకొడిగా అనిపించడం..
రోజువారీ దినచర్యలో తగినంత వ్యాయామం లేకపోతే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మందకొడిగా తయారవుతారు. రోజంతా ఉత్సాహం నశించి నిద్రమత్తుగా అనిపిస్తుంది. కొద్దిసేపు వేగంగా నడవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి, మెదడు చురుగ్గా మారుతుంది.
శరీర బ్యాలెన్స్ కోల్పోవడం..
{{/usCountry}}రోజువారీ దినచర్యలో తగినంత వ్యాయామం లేకపోతే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మందకొడిగా తయారవుతారు. రోజంతా ఉత్సాహం నశించి నిద్రమత్తుగా అనిపిస్తుంది. కొద్దిసేపు వేగంగా నడవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి, మెదడు చురుగ్గా మారుతుంది.
శరీర బ్యాలెన్స్ కోల్పోవడం..
{{/usCountry}}ఒకే కాలుపై నిలబడినప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు లేదా వెనక్కి తిరిగేటప్పుడు ఒంటిని సమతుల్యంగా ఉంచలేక తడబడితే బాడీ బ్యాలెన్స్, కోఆర్డినేషన్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. నడక, కండరాలను బలోపేతం చేసే స్ట్రెంగ్త్ ఎక్సర్‌సైజుల ద్వారా శరీరం స్థిరత్వాన్ని తిరిగి పొందవచ్చు.
వంగిపోయే శరీర భంగిమ..
కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు తరచుగా ముందరకు వంగిపోవడం, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం లేదా నిటారుగా కూర్చోవడం కష్టంగా అనిపించడం బలహీనమైన కండరాలకు సంకేతం. పొత్తికడుపు , వెన్ను, కాళ్ల కండరాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా శరీర భంగిమను, కదలికలను మెరుగుపరుచుకోవచ్చు.
కదలడం భారంగా అనిపించడం..
"నడవడం, వంగడం, కింద కూర్చోవడం లేదా కుర్చీలోంచి లేవడం మునుపటి కంటే కష్టంగా అనిపిస్తుంటే తక్షణమే శ్రద్ధ వహించాలి. బాహ్యంగా ఎలాంటి నొప్పి కనిపించకపోయినా కండరాల బలం, కీళ్ల కదలిక సామర్థ్యం క్రమంగా తగ్గిపోవచ్చు," అని సచిన్ సేథి హెచ్చరించారు.
పరిష్కార మార్గాలు - నిపుణుల సలహా..
ఈ సమస్యల నుంచి బయటపడేందుకు పెద్ద పెద్ద వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. పని మధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకుంటూ కాసేపు నడవడం, తేలికపాటి స్ట్రెచింగ్ చేయడం, దినచర్యలో బ్యాలెన్సింగ్ వ్యాయామాలను చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
ఒకవేళ కండరాల్లో నిరంతరం బలహీనత, తిమ్మిర్లు లేదా తగ్గని బిగుతు ఉంటే వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.