IPL 2026: 15 ఏళ్ల చిన్నోడు చితక్కొట్టాడు.. 15 బాల్స్‌లోనే వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డు హాఫ్ సెంచ‌రీ.. చెన్నై చిత్తు

IPL 2026: ఐపీఎల్ కొత్త సీజన్ వచ్చిందో లేదో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మెరుపులు మొదలయ్యాయి. ఐపీఎల్ 2025లో సంచలనం రేపిన ఈ చిన్నోడు.. ఐపీఎల్ 2026లో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే 15 బాల్స్ లో ఫిఫ్టీ చేసి రికార్డులు బ్రేక్ చేశాడు. 

Published on: Mar 31, 2026, 06:19:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గౌహతిలోని బార్‌సపారా స్టేడియం సోమవారం (మార్చి 30) రాత్రి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌కు సాక్ష్యంగా నిలిచింది. ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించాడు. చెన్నై బౌలర్లను ఉతికేస్తూ, కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వైభవ్ సూర్యవంశీ (PTI)
వైభవ్ సూర్యవంశీ (PTI)

వైభవ్ దంచుడు

ఐపీఎల్ 2025 సీజన్ లో వైభవ్ సూర్యవంశీ అనే పేరు ప్రపంచానికి తెలిసింది. ఈ చిన్నోడు చెలరేగిపోయాడు. ఇప్పుడు ఐపీఎల్ 2026లోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ మ్యాచ్ లోనే క్రీజులోకి వచ్చినప్పటి నుంచి వైభవ్ దంచుడు మొదలెట్టాడు. రికార్డులు బ్రేక్ చేశాడు.

రికార్డుల వేటలో

ఐపీఎల్ 2026లో తన ఫస్ట్ మ్యాచ్ లోనే వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత మోగించాడు. కేవలం 15 బాల్స్ లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసిన ఈ యంగ్ సెన్సేషనల్ ప్లేయర్.. ఐపీఎల్ హిస్టరీలో మూడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించాడు. ఐపీఎల్ లో ఈ కుర్రాడికి ఇదే వేగవంతమైన అర్ధశతకం.

గత ఏడాది జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 17 బంతుల్లో సాధించిన తన సొంత రికార్డును వైభవ్ అధిగమించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఇది సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. యశస్వి జైస్వాల్ (13 బాల్స్) ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.

విధ్వంసమే

వైభవ్ క్రీజులోకి వస్తే విధ్వంసమే. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో అతని బ్యాటింగ్ అలాగే సాగింది. ఆరంభంలో కార్తీక్ శర్మ తన క్యాచ్ డ్రాప్ చేయడంతో వచ్చిన ఛాన్స్ ను వైభవ్ పూర్తిగా యూజ్ చేసుకున్నాడు. తర్వాతి బంతినే సిక్సర్‌గా మలిచి తన ఉద్దేశాన్ని చాటాడు. చివరికి 17 బంతుల్లో 305 స్ట్రైక్ రేట్‌తో 52 పరుగులు చేశాడు.

చెన్నై చిత్తు

రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై చిత్తయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.4 ఓవర్లలో 127 రన్స్ కే ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, జడేజా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఛేజింగ్ లో వైభవ్ సూర్యవంశీ చెలరేగడంతో రాజస్థాన్ విజయం నల్లేరుపై నడకలా మారింది.

రాజస్థాన్ 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ 4 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు.

అండర్-19 వరల్డ్ కప్ హీరో

వైభవ్ కేవలం ఐపీఎల్‌లోనే కాదు, జూనియర్ క్రికెట్‌లోనూ సంచలనాలు సృష్టించాడు. ఇటీవల జరిగిన U-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్ ఆరోసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గత ఐపీఎల్ సీజన్‌లో 252 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించిన వైభవ్, ఈ సీజన్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగిస్తూ తనపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More