భారత మార్కెట్లోని మైక్రో ఎస్‌యూవీ విభాగంలో తన పట్టును మరింత పెంచుకునేందుకు హ్యుందాయ్ సిద్ధమైంది. సరికొత్త 2026 ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ డిజైన్, ఫీచర్లు, భద్రత పరంగా 25కు పైగా అప్‌డేట్స్‌తో వచ్చింది. ఇంజిన్ పరంగా పాత మోడల్ తరహాలోనే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హ్యుందాయ్ ఎక్స్‌టర్ 2026: వేరియంట్ వారీగా ధరల పట్టిక (ఎక్స్-షోరూమ్)

కొత్త ఎక్స్‌టర్ పెట్రోల్ (మాన్యువల్, ఏఎంటీ), సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది.
| వేరియంట్ | ట్రాన్స్మిషన్ | ధర (ఎక్స్‌షోరూం) రూ. |
|---|---|---|
| ఈఎక్స్ | ఎంటీ | 5.79 లక్షలు |
| ఎస్ | ఎంటీ | 6.23 లక్షలు |
| ఎస్+ | ఎంటీ | 7.21 లక్షలు |
| ఎస్ఎక్స్ | ఎంటీ | 7.95 లక్షలు |
| ఎక్స్ఎక్స్ (ఓ) | ఎంటీ | 8.35 లక్షలు |
| ఎస్ | ఏఎంటీ | 6.90 లక్షలు |
| ఎస్+ | ఏఎంటీ | 8.05 లక్షలు |
| ఎస్ఎక్స్ | ఏఎంటీ | 8.54 లక్షలు |
| ఎస్ఎక్స్ (ఓ) | ఏఎంటీ | 9.07 లక్షలు |
| ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ | ఏఎంటీ | 9.41 లక్షలు |
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ సీఎన్జీ వేరియంట్ల ధరలు..
| వేరియంట్ | ట్రాన్స్మిషన్ | ధర (ఎక్స్‌షోరూం) రూ. |
|---|---|---|
| ఈఎక్స్ | ఎంటీ | 6.99 లక్షలు |
| ఎస్ | ఎంటీ | 7.43 లక్షలు |
| ఎస్+ | ఎంటీ | 8.26 లక్షలు |
| ఎస్ఎక్స్ | ఎంటీ | 8.93 లక్షలు |
| ఎస్ఎక్స్ (ఓ) | ఎంటీ | 9.40 లక్షలు |
2026 హ్యుందాయ్ ఎక్స్‌టర్- డిజైన్ మార్పులు:
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ బాహ్య రూపంలో కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్‌ను చేర్చారు. ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ థీమ్, కొత్త సీట్ డిజైన్, మెటల్ పెడల్స్, 'డీ-కట్' స్టీరింగ్ వీల్‌తో క్యాబిన్ మరింత ప్రీమియంగా మారింది.
2026 హ్యుందాయ్ ఎక్స్‌టర్- అత్యాధునిక ఫీచర్లు:
{{/usCountry}}హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ బాహ్య రూపంలో కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్‌ను చేర్చారు. ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ థీమ్, కొత్త సీట్ డిజైన్, మెటల్ పెడల్స్, 'డీ-కట్' స్టీరింగ్ వీల్‌తో క్యాబిన్ మరింత ప్రీమియంగా మారింది.
2026 హ్యుందాయ్ ఎక్స్‌టర్- అత్యాధునిక ఫీచర్లు:
{{/usCountry}}సెగ్మెంట్-ఫస్ట్: ఇన్-బిల్ట్ డాష్‌క్యామ్ .
కనెక్టివిటీ: వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 60కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు.
కంఫర్ట్: ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ డిస్‌ప్లే, వెనుక ప్రయాణికుల కోసం టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్.
సీఎన్జీ స్పెషల్: సీఎన్‌జీ వెర్షన్‌లో ఇప్పుడు 'డ్యూయల్ సిలిండర్' సెటప్ ఇచ్చారు. స్పేర్ టైర్‌ను కారు అడుగు భాగానికి మార్చడం వల్ల డిక్కీలో 225 లీటర్ల ఖాళీ స్థలం (బూట్ స్పేస్) లభిస్తుంది.
కలర్స్: గోల్డెన్ బ్రాంజ్, టైటానియం బ్లాక్ మ్యాట్ అనే రెండు కొత్త రంగులను పరిచయం చేశారు.
2026 హ్యుందాయ్ ఎక్స్‌టర్- భద్రత..
భద్రత విషయంలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ రాజీ పడలేదు. ఈ కారులో మొత్తం 45కు పైగా సేఫ్టీ ఫీచర్లు ఉండగా, అందులో 30 ఫీచర్లను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఇచ్చారు.
6 ఎయిర్‌బ్యాగ్‌లు (అన్ని వేరియంట్లలో).
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ).
హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ) వంటివి కొన్ని ఉదాహరణలు.