టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​- ధర రూ. 5.59 లక్షలే!

మచ్​ అవైటెడ్​ టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ని టాటా మోటార్స్​ సంస్థ మంగళవారం లాంచ్​ చేసింది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 5.59లక్షలే కావడం విశేషం. ఈ ఎస్​యూవీ లుక్స్​, ఫీచర్లు, భద్రతా ఫీచర్లకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 13, 2026, 12:13:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ రంగంలో మైక్రో ఎస్‌యూవీ ట్రెండ్‌కు ఊపిరిపోసిన 'టాటా పంచ్' ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, మరింత పవర్‌ఫుల్‌గా మన ముందుకు వచ్చింది. ఈ మేరకు టాటా పంచ్​ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మంగళవారం (జనవరి 13) మార్కెట్​లోకి విడుదల చేసింది టాటా మోటార్స్​ సంస్థ. కేవలం రూ. 5.59 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ కారు కోసం బుకింగ్స్ కూడా నేటి నుంచే ప్రారంభమయ్యాయి.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​
టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​

హ్యుందాయ్ ఎక్స్​టర్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా టాటా మోటార్స్ ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను తీర్చిదిద్దింది. ఈ 2026 టాటా పంచ్‌ ఫ్యామిలీ ఎస్​యూవీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​- అదిరిపోయే లుక్స్​..

2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ చూడగానే టాటా పంచ్ ఈవీని గుర్తుకు తెస్తుంది. దీని బాక్సీ ఆకారాన్ని అలాగే ఉంచుతూనే, ముందు భాగంలో గణనీయమైన మార్పులు చేశారు.

లైటింగ్: కొత్తగా రీడిజైన్ చేసిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ డీఆర్ఎల్స్, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఈ ఫ్యామిలీ ఎస్​యూవీకి ప్రీమియం లుక్ ఇచ్చాయి.

డిజైన్: కొత్త గ్రిల్, స్పోర్టీ బంపర్లు, డైమండ్ కట్ అలాయ్ వీల్స్‌తో ఈ కారు రోడ్డుపై మరింత గంభీరంగా కనిపిస్తుంది.

కొత్త రంగులు: కేవలం డిజైన్ మాత్రమే కాదు, సయాంటాఫిక్, కారామెల్, బెంగాల్ రూజ్, కూర్గ్ క్లౌడ్స్ వంటి ఆకర్షణీయమైన కొత్త రంగుల్లో కూడా ఇది లభించనుంది.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​- ఇంటీరియర్..

2026 టాటా పంచ్​ లోపల అడుగుపెట్టగానే డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ మనకు స్వాగతం పలుకుతాయి.

డిస్​ప్లే: 26.03 సెంటీమీటర్ల (10.25 ఇంచ్​) భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 17.8 సెంటీమీటర్ల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు.

కంఫర్ట్​ ఫీచర్స్​: 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎం వంటి లగ్జరీ ఫీచర్లు ఇప్పుడు టాటా పంచ్‌ ఫేస్​లిఫ్ట్​లో భాగమయ్యాయి.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​- ఇంజిన్..

ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద మార్పు.. కొత్తగా పరిచయం చేసిన 1.2 లీటర్ ఐ-టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 120 పీఎస్ పవర్, 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 11.1 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. దీనితో పాటు రెగ్యులర్ 1.2 లీటర్ రివోట్రాన్ పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో సీఎన్జీ ఏఎంటీ ఆప్షన్ ఇవ్వడం గమనార్హం.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ భద్రతలో రాజీ లేదు..

పంచ్ అంటేనే భద్రతకు మారుపేరు. ఈ కొత్త మోడల్ కూడా భరత్ ఎన్​సీఏపీలో 5-స్టార్ రేటింగ్‌ను (పెద్దలు, పిల్లల రక్షణలో) సాధించి తన వారసత్వాన్ని కాపాడుకుంది. 6 ఎయిర్ బ్యాగులు, ఈఎస్‌పీ, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో స్టాండర్డ్‌గా వస్తున్నాయి.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​- వేరియంట్లు, ధరలు..

2026 టాటా పంచ్ మొత్తం ఆరు వేరియంట్లలో లభించనుంది:

  • స్మార్ట్
  • ప్యూర్
  • ప్యూర్ ప్లస్
  • అడ్వెంచర్
  • ఎకంప్లిష్డ్
  • ఎకంప్లిష్డ్ ప్లస్ ఎస్

ఇక టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధరను రూ. 5.59 లక్షలుగా నిర్ణయించారు.

బడ్జెట్‌లో అదిరిపోయే లుక్, అదిరిపోయే పర్ఫార్మెన్స్, అంతకంటే ముఖ్యంగా తిరుగులేని భద్రత కావాలనుకునే వారికి ఈ 'న్యూ పంచ్' సరైన ఛాయిస్ అని చెప్పొచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More