టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​లో ఏది వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​? ధర, ఫీచర్లు..

మైక్రో ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా దూసుకెళుతునన టాటా పంచ్ ఇప్పుడు 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మరింత పవర్‌ఫుల్​గా మారింది. కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్, సెగ్మెంట్లోనే మొదటిసారిగా సీఎన్జీ ఏఎమ్‌టీ వంటి ఫీచర్లతో అలరించనుంది. మరి ఈ ఎస్​యూవీలో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఏది? ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jan 17, 2026, 08:15:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ వాహనదారుల మనసు గెలుచుకున్న 'టాటా పంచ్' ఇప్పుడు సరికొత్త హంగులతో మన ముందుకు వచ్చింది. ఈ మేరకు పంచ్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని ఇటీవలే సంస్థ లాంచ్​ చేసింది. కేవలం డిజైన్ మాత్రమే కాకుండా, ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం పరంగా కూడా ఈ చిన్న ఎస్‌యూవీ ఇప్పుడు మరింత శక్తివంతంగా మారింది. టాటా మోటార్స్ ఈ 2026 మోడల్‌ను మొత్తం ఎనిమిది వేరియంట్లలో (స్మార్ట్​, ప్యూర్​, ప్యూర్​+, ప్యూర్​+ ఎస్​, అడ్వెంచర్​, అడ్వెంచర్​ ఎస్​, అకంప్లీష్డ్​, అకంప్లీష్డ్​+ ఎస్​) విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 2026 టాటా పంచ్​ వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ఏది? అనేది ఇక్కడ తెలుసుకోండి..

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్ వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​..
టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్ వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​..

2026 టాటా పంచ్​- ధర, ఇంజిన్ వివరాలు..

కొత్త టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 5.59 లక్షలుగా ఉండగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 10.54 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

ఈసారి మెకానికల్ పరంగా టాటా పెద్ద మార్పులే చేసింది:

సాధారణ పెట్రోల్ ఇంజిన్: 1.2 లీటర్ ఇంజిన్ 88 హెచ్​పీ పవర్, 115ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టీ ఆప్షన్లలో లభిస్తుంది.

పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్: నెక్సాన్ నుంచి తీసుకున్న 1.2 లీటర్ టర్బో ఇంజిన్‌ను కూడా ఇప్పుడు పంచ్‌లో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఏకంగా 120 హెచ్​పీ పవర్, 170 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది.

సీఎన్జీ ఏఎమ్‌టీ: దేశంలోనే మొట్టమొదటిసారిగా సీఎన్జీ కార్లలో ఆటోమేటిక్ సౌకర్యాన్ని టాటా తీసుకొచ్చింది. ఇది నగర ప్రయాణాలను మరింత సులభతరం చేస్తుంది.

అదిరిపోయే కలర్స్​- కొత్త పంచ్ ఎస్​యూవీ ఇప్పుడు ఆరు రకాల ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది. అవి.. ప్రిస్టీన్ వైట్, బెంగాల్ రూజ్, కారామెల్, సయాంటాఫిక్, డేటోనా గ్రే, కూర్గ్ క్లౌడ్స్. వీటికి తోడు డ్యూయల్ టోన్ (బ్లాక్ లేదా వైట్ రూఫ్) ఆప్షన్లు కూడా ఉండటంతో రోడ్డుపై ఈ కారు చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్​టర్​, మారుతీ ఇగ్నిస్ వంటి మోడళ్లతో పోటీ పడుతున్న టాటా పంచ్, ఈ అప్‌డేట్స్‌తో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేలా కనిపిస్తోంది.

2026 టాటా పంచ్​ వేరియంట్ల వారీగా ముఖ్యమైన ఫీచర్లు:

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ స్మార్ట్: 6 ఎయిర్‌బ్యాగులు (స్టాండర్డ్), ఈఎస్​సీ, టీపీఎంఎస్​ వంటి భద్రతా ఫీచర్లతో పాటు డిజిటల్ క్లస్టర్ లభిస్తుంది.

ప్యూర్: రేర్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆల్ పవర్ విండోస్ ఉంటాయి.

అడ్వెంచర్: 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి వినూత్న ఫీచర్లు చేరాయి.

అకంప్లిష్డ్+ ఎస్​: ఇది టాప్ ఎండ్ మోడల్. ఇందులో 10.25-ఇంచ్​ టచ్‌స్క్రీన్, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్​వీఎం వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

2026 టాటా పంచ్​- వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​..

సాధారణ ప్రయాణాల కోసం: మీరు రోజువారీ పనుల కోసం 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎంచుకోవచ్చు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూ. 8.99 లక్షలకు లభిస్తుంది. ఒకవేళ నగర ట్రాఫిక్‌లో క్లచ్ నొక్కే బాధ లేకుండా ఉండాలంటే, ఏఎమ్‌టీ వెర్షన్‌ను రూ. 9.54 లక్షలకు సొంతం చేసుకోవచ్చు.

పొదుపుగా ప్రయాణించాలనుకుంటే: పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఆటోమేటిక్ డ్రైవింగ్ సౌకర్యం కావాలనుకునే వారికి సీఎన్జీ మోడల్ బెస్ట్. ఈ లైనప్‌లో అత్యంత ఖరీదైన వేరియంట్ ఇదే. దీని ధర రూ. 10.54 లక్షలు. మైలేజ్ విషయంలో ఇది మీకు మంచి లాభాన్ని అందిస్తుంది.

వేగం, పవర్ కోరుకునే వారికోసం: కారు నడిపేటప్పుడు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారు 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎంచుకోవచ్చు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని ధర రూ. 9.79 లక్షలు. హైవేలపై లాంగ్ డ్రైవ్ వెళ్లే వారికి ఈ ఇంజిన్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

మొత్తానికి, మీరు పెట్టే ప్రతి రూపాయికి తగిన విలువ దక్కాలంటే మాత్రం, అదిరే ఫీచర్లు, అన్ని రకాల ఇంజిన్ ఆప్షన్లు ఉన్న అకంప్లిష్డ్+ ఎస్​ వేరియంట్ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More