Tata Tiago facelift : ఈ ఏడాది తొలినాళ్లల్లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌తో సక్సెస్ సాధించిన టాటా మోటార్స్.. ఇప్పుడు తన మోస్ట్ పాపులర్ ఎంట్రీ-లెవెల్ హ్యాచ్‌బ్యాక్ లైనప్‌ను అప్‌డేట్ చేసింది. రాబోయే మే 28న జరగనున్న అధికారిక లాంచ్‌కు ముందే కంపెనీ సరికొత్త ‘టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్’, ‘టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్’ మోడళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. చాలా కాలం తర్వాత ఈ మోడళ్లకు జరిగిన మొదటి మేజర్ డిజైన్ అప్‌డేట్ ఇది. ఈ నేపథ్యంలో వీటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
సరికొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్..

ఈ టాటా టియాగో, టాటా టియాగో ఈవీ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ల ఎక్స్టీరియర్ని టాటా పూర్తిగా మార్చేసింది.
ఫ్రంట్ లుక్: కారు ముందు భాగంలో ఐబ్రో ఆకారంలో ఉండే సరికొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, సరికొత్త హెడ్‌లైట్ డిజైన్‌ను అందించారు. పెట్రోల్ వెర్షన్‌లో ఆల్ట్రోజ్ కారును పోలిన పెద్ద బ్లాక్ గ్రిల్ ఉండగా.. ఈవీ వెర్షన్‌లో బాడీ కలర్ క్లోజ్డ్ గ్రిల్ ప్యానల్‌ను ఇచ్చారు.
సైడ్ అండ్ రేర్ ప్రొఫైల్: కారు సైడ్ ప్రొఫైల్ పాత మోడల్‌లానే ఉన్నప్పటికీ, కొత్తగా 15-ఇంచ్ స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ను జత చేశారు. వెనుక భాగంలో సరికొత్తగా త్రీ-వర్టికల్ లైన్స్ డిజైన్‌తో కూడిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ ఉన్నాయి. ఇవి మధ్యలో ఉండే టాటా లోగోతో కనెక్ట్ అయినట్లు కనిపిస్తాయి. టెయిల్‌గేట్‌పై పెద్ద అక్షరాలతో "TIAGO" అని రాసి ఉంది. అలాగే బంపర్ డిజైన్‌ను కూడా మార్చారు.
లగ్జరీ క్యాబిన్, అధునాతన ఫీచర్లు..
2026 టాటా టియాగో, 2026 టాటా టియాగో ఈవీ లోపలి భాగంలో డాష్‌బోర్డ్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. స్టీరింగ్ వీల్‌పై టాటా కర్వ్, పంచ్ ఈవీ తరహాలోనే ఇల్యూమినేటెడ్ టాటా లోగోను అమర్చారు.
ఇందులో కొత్తగా 10.25-ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అప్డేటెడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు.
{{/usCountry}}ఇందులో కొత్తగా 10.25-ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అప్డేటెడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు.
{{/usCountry}}అధికారిక ఫీచర్ల లిస్ట్ ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఈ కార్లలో సురక్షితమైన ప్రయాణం కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, క్రూజ్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
ఇంజిన్, పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు..
టాటా టియాగో (పెట్రోల్/సీఎన్జీ): ఇందులో మునుపటి లాగే 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఇది 86 హెచ్‌పీ, 113 ఎన్ఎం టాప్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనితో పాటు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక దీని సీఎన్జీ వెర్షన్ 75 హెచ్‌పీ పవర్, 96 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ బ్యాటరీ, రేంజ్..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో రానుంది:
19.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది 61 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. దీని మైలేజ్/రేంజ్ సింగిల్ ఛార్జ్‌పై 223 కిలోమీటర్లుగా ఉంది.
24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది 75 హెచ్‌పీ పవర్, 114 ఎన్ఎ టార్క్‌ను ఇస్తుంది. దీని రేంజ్ సింగిల్ ఛార్జ్‌పై 293 కిలోమీటర్లుగా ఉంది.
అయితే, పంచ్ ఈవీ తరహాలోనే టాటా మోటార్స్ ఈ కార్లలో కూడా బ్యాటరీ సామర్థ్యాన్ని కాస్త పెంచి, ఎక్కువ రేంజ్ ఇచ్చేలా మార్పులు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
ధరల వివరాలు (అంచనా)..
కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పుల కారణంగా టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్, టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాధారణ టియాగో పెట్రోల్ ధరలు రూ. 4.60 లక్షల నుంచి రూ. 7.68 లక్షల వరకు ఉండగా.. టియాగో ఈవీ ధరలు రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.14 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
మే 28న కంపెనీ వీటి అధికారిక ధరలను దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ అనౌన్స్ చేయనుంది.