Tata Tiago facelift : కొత్త లుక్‌లో రాబోతున్న టాటా టియాగో.. ఫేస్​లిఫ్ట్​లో అదిరిపోయే ఫీచర్లతో!

2026 Tiago : భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ‘టాటా టియాగో’కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. భారత రోడ్లపై ఈ సరికొత్త మోడల్ టెస్టింగ్ అవుతుండగా లీకైన చిత్రాలు.. ఈ కారులో రాబోతున్న డిజైన్ చేంజెస్, ప్రీమియం ఫీచర్లను వెల్లడిస్తున్నాయి. వాటి వివరాలు..

Published on: May 18, 2026, 14:01:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాటా మోటార్స్ తమ మోడ్రన్ ప్యాసింజర్ వెహికల్ లైనప్‌లో మైలురాయిగా నిలిచిన ‘టాటా టియాగో’ని సరికొత్త హంగులతో మార్కెట్​లోకి విడుదల చేయడానికి సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మార్కెట్​లో మంచి సక్సెస్ సాధించిన ఈ కారుకు ఈ ఏడాది చివరిలో మరో ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా దేశీయ రోడ్లపై ఈ కొత్త టియాగో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ముమ్మరంగా టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరా కంటికి చిక్కింది. లీకైన స్పై ఇమేజెస్ ప్రకారం.. కారు పాత సిల్హౌట్ అలాగే ఉన్నప్పటికీ, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో భారీ కాస్మెటిక్ మార్పులు జరగనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ టాటా టియాగో ఫేస్​లిఫ్ట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా టియాగో ఫేస్​లిఫ్ట్.. (Instagram / mycarmydreamofficial)
టాటా టియాగో ఫేస్​లిఫ్ట్.. (Instagram / mycarmydreamofficial)

టాటా టియాగో ఫేస్​లిఫ్ట్​- ఎక్స్‌టీరియర్ డిజైన్ మార్పులు..

కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ ముందు భాగం టాటా లేటెస్ట్ డిజైన్ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మరింత షార్ప్‌గా, మస్కులర్‌గా మారనుంది.

హెడ్‌ల్యాంప్స్: ఇందులో సరికొత్తగా డిజైన్ చేసిన ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్​తో పాటు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, టర్న్ ఇండికేటర్లను అందించనున్నారు.

గ్రిల్ అండ్ బంపర్: కారుకు సరికొత్త లుక్ ఇచ్చేలా రీఫ్రెష్డ్ ఫ్రంట్ గ్రిల్, రీవైజ్డ్ బంపర్ డిజైన్‌ను జోడించబోతున్నారు.

అల్లాయ్ వీల్స్: మిగిలిన టాటా మోడల్స్ లాగే ఈ టాటా టియాగో ఫేస్​లిఫ్ట్​లో కూడా జామెట్రిక్ ప్యాటర్న్‌తో కూడిన సరికొత్త అల్లాయ్ వీల్స్‌ను ఇవ్వనున్నారు.

వెనుక భాగం: కారు వెనుక వైపు అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, ట్వీక్డ్ బంపర్ డిజైన్, మునుపటి మోడల్ లాగే షార్క్-ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లు కొనసాగనున్నాయి.

Tata Sierra EV : పండుగ సీజన్​లో టాటా సియెర్రా ఈవీ లాంచ్- ధర ఎంతో తెలుసా?

టాటా టియాగో ఫేస్​లిఫ్ట్- ప్రీమియం క్యాబిన్, కొత్త ఫీచర్లు..

కారు లోపలి భాగం.. టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ నుంచి ప్రేరణ పొంది సరికొత్త క్యాబిన్ లేఅవుట్, కొత్త అప్‌హోల్‌స్టరీ (సీట్ల కవర్ల డిజైన్) తో రానుంది. కారును మరింత ప్రీమియంగా మార్చేందుకు టాటా పలు ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లను జోడించనుంది. అవి..

పెద్దదైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.

టచ్-బేస్డ్ క్లైమేట్ కంట్రోల్స్, వెనుక ప్రయాణికుల కోసం రేర్ ఏసీ వెంట్స్.

యాంబియంట్ లైటింగ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్.

అన్నింటికంటే ముఖ్యంగా భద్రత, సులభమైన పార్కింగ్ కోసం ఈ బడ్జెట్ కారులో 360-డిగ్రీల కెమెరాను కూడా అందించబోతున్నట్లు సమాచారం. దీనితో పాటు సౌండ్ సిస్టమ్‌ను కూడా మరింత అప్‌గ్రేడ్ చేయనున్నారు.

టాటా టియాగో ఫేస్​లిఫ్ట్- ఇంజిన్, పవర్‌ట్రెయిన్..

మెకానికల్ పరంగా ఈ కారులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇది ప్రస్తుత మోడల్‌లో ఉన్న 1.2-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ తోనే కొనసాగనుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 86 బీహెచ్​పీ పవర్, 115 ఎన్​ఎం టాప్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఏఎంటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది.

ఈ టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడల్ పెట్రోల్​తో పాటు సీఎన్జీ వేరియంట్లలోనూ అందుబాటులో ఉంటుంది. అయితే, టాటా మోటార్స్ ఇటీవల పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రవేశపెట్టినట్లే.. కొత్త టియాగో సీఎన్జీ వెర్షన్‌లో కూడా ఏఎంటీ ఆటోమేటిక్ ఆప్షన్​ని తీసుకువచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు.

టాటా టియాగో ఫేస్​లిఫ్ట్ లాంచ్​, ధర వంటి వివరాలపై కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More