Meet your younger self : చిన్ననాటి మీతో మీరు- ఈ ప్రాంప్ట్స్‌తో ఇమేజ్ క్రియేట్ చేసుకోండి..
Meet your younger self prompt : ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న “మీట్ యువర్ యంగర్ సెల్ఫ్” ఫొటోలను మీరు చూసే ఉంటారు. మరి అలాంటివి మీరు కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రాంప్ట్‌లు కాపీ, పేస్ట్ చేసుకోండి చాలు!
Meet your younger self trend : ప్రతి ఒక్కరి జీవితంలోనూ చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ప్రత్యేకం! అప్పట్లో మనం ఎలా ఉండేవాళ్లమో, ఇప్పుడు ఎలా మారామో అని పాత ఆల్బమ్స్ చూసుకుంటే కలిగే ఆ అనుభూతే వేరు. అయితే, ఇప్పుడు ఆ పాత జ్ఞాపకాలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తోడైతే? మీ చిన్ననాటి రూపం, మీ ప్రస్తుత రూపం పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో ‘మీట్ యువర్ యంగర్ సెల్ఫ్’ అనే ట్రెండ్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అసలేంటిది? ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎలాంటి ప్రాంప్ట్స్ వాడాలి? ఇక్కడ తెలుసుకోండి..

ఏంటి ఈ ట్రెండ్? ఎందుకు ఇంత ఫేమస్?
సాధారణంగా మనం చిన్నప్పటి ఫోటోలను, ఇప్పుటి ఫోటోలను పక్కపక్కన పెట్టి ‘కోల్లెజ్’ చేస్తాం. కానీ ఈ ఏఐ ట్రెండ్ అంతకు మించి ఉంటుంది. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించి, మీ చిన్ననాటి ముఖకవళికలను ఏమాత్రం మార్చకుండా, ప్రస్తుత మీ రూపంతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఉండేలా అత్యంత సహజమైన చిత్రాలను ఇది సృష్టిస్తోంది.
"ఈ ప్రాంప్ట్‌లు కేవలం ఫోటోలను మాత్రమే కాదు, మన జీవిత ప్రయాణాన్ని ఒకే చిత్రంలో చూపిస్తున్నాయి," అని ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంజు బేబీ రోజ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ ట్రెండ్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ‘ప్రాంప్ట్స్’ పంచుకోవడంతో ఇది మరింత వైరల్ అయ్యింది.
మీరూ ట్రై చేయాలనుకుంటున్నారా? ఈ 3 ప్రాంప్ట్స్ వాడండి!
మీ పాత ఫోటోను ఏఐకి అందించి, కింది ప్రాంప్ట్స్‌ను ఉపయోగించి అద్భుతమైన చిత్రాలను రూపొందించవచ్చు.
1. స్టూడియో స్టైల్ పోర్ట్రెయిట్ (బ్లాక్ అండ్ వైట్):
క్లాసిక్ లుక్ కోరుకునే వారు ఈ ప్రాంప్ట్ వాడవచ్చు.
“Create an ultra-realistic, soft, emotional black-and-white (slightly warm-toned) studio-style photograph using the provided images. On the left, show a younger version of me from my childhood photo, preserving exact facial features, smiling and looking towards the right. On the right, show my present self looking at my younger self with a calm smile. Place a simple table between both versions to symbolise time. Use soft cinematic lighting, a minimal studio background, realistic proportions and high photographic quality. Format: Aspect ratio 4:5.”
2. పార్కులో పాత జ్ఞాపకాలు:
చిన్నప్పటి మీతో మీరు కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా ఉండాలంటే ఇది బెస్ట్.
“Create an ultra-realistic image of me meeting my younger self in a peaceful park during sunset. My childhood version should be sitting on a bench holding a toy and smiling, while my present self sits beside them having a warm conversation. Keep both facial features accurate based on the uploaded photos. Use warm lighting, realistic emotions, soft background blur and cinematic quality.”
3. అద్దంలో అద్భుతం:
అద్దంలో చూసుకుంటే మీ చిన్ననాటి రూపం కనిపిస్తే ఎలా ఉంటుంది?
“Create a realistic portrait of my present self standing in front of a large mirror, but instead of my current reflection, show my younger self from my childhood photo smiling back at me. Maintain accurate facial details, realistic lighting, emotional expressions and a cinematic atmosphere. Make the image look like a professional photograph.”
తెలుగు నెటిజన్ల ఎమోషనల్ కనెక్ట్..
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ట్రెండ్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో పాత ఫోటోలు తక్కువగా ఉంటాయి. ఏఐ సాయంతో ఆ పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను సరికొత్త రంగుల్లో, నేటి కాలంతో ముడిపెట్టి చూసుకోవడం అద్భుతమైన అనుభూతిని ఇస్తోంది. ఇది కేవలం ఒక టెక్నాలజీ ట్రెండ్ మాత్రమే కాదు, కాలచక్రంలో మనం ఎంత దూరం ప్రయాణించామో గుర్తుచేసే ఒక ఎమోషనల్ జర్నీ.
మరి మీరు కూడా ఈ ఏఐ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారా?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


