...
...
Next Story

పర్సనల్​ లోన్ త్వరగా​ అప్రూవ్​ అవ్వాలంటే.. ఈ 6 టిప్స్​ పాటించాలి!

మీ ఆర్థిక అవసరాల కోసం పర్సనల్​ లోన్​ తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. పర్సనల్​ లోన్​ని వేగంగా పొందాలంటే కొన్ని టిప్స్​ని ఫాలో అవ్వాలి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Dec 20, 2025 06:46 AM IST
Advertisement

మన ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఉన్న సులభమైన మార్గాల్లో పర్సనల్​ లోన్​ ఒకటి. ప్రాథమిక అర్హతలు ఉంటే చాలు.. కొన్ని గంటల్లోనే నగదు మీ చేతికి అందుతుంది! కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తక్కువ సమయంలో లోన్ అప్రూవల్ కావాలంటే మీ ఆర్థిక ప్రొఫైల్ పక్కాగా ఉండాలి.

Smart financial planning can help borrowers secure a personal loan with favourable terms and conditions.
Smart financial planning can help borrowers secure a personal loan with favourable terms and conditions.

వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మతులు లేదా విదేశీ విద్య వంటి అవసరాల కోసం మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే, మీ లోన్ అప్రూవల్ అవకాశాలను పెంచేందుకు ఆరు ముఖ్యమైన టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

పర్సనల్ లోన్ అప్రూవల్ పెంచే 6 టిప్స్​..

1. క్రెడిట్ స్కోర్ మెరుగుపరుచుకోండి-

లోన్ రావడంలో ‘క్రెడిట్​ స్కోర్’ కీలక పాత్ర పోషిస్తుంది. మీ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే బ్యాంకులు మీకు సులభంగా లోన్ ఇస్తాయి. క్రెడిట్ కార్డు బిల్లులు, పాత ఈఎంఐలను గడువులోగా చెల్లించడం ద్వారా మీ స్కోర్‌ను పెంచుకోవచ్చు. ఇందుకోసం 'ఆటో డెబిట్' ఆప్షన్‌ను సెట్ చేసుకోవడం ఉత్తమం.

2. అప్పు-ఆదాయ నిష్పత్తిని తగ్గించుకోండి-

మీ నెలవారీ ఆదాయంలో ఎంత భాగం ఇప్పటికే ఉన్న అప్పుల కోసం ఖర్చవుతుందో బ్యాంకులు గమనిస్తాయి. మీ అప్పులు.. ఆదాయం కంటే తక్కువగా ఉంటేనే కొత్త లోన్ త్వరగా మంజూరవుతుంది. అందుకే, కొత్త లోన్ అప్లై చేసేముందు పాత, చిన్నపాటి బాకీలను తీర్చివేయడం మంచిది.

3. స్థిరమైన ఉద్యోగం, ఆదాయం-

వరుసగా మారుతున్న ఉద్యోగాల కంటే, ఒకే చోట స్థిరంగా పనిచేస్తున్న వారికి బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తాయి. మీ జీతం క్రమం తప్పకుండా అకౌంట్‌లో పడుతుంటే లోన్ ప్రాసెస్ వేగవంతం అవుతుంది. స్వయం ఉపాధి పొందే వారు కూడా తమ ఆదాయ వనరులను, పన్ను రికార్డులను పక్కాగా ఉంచుకోవాలి.

మీ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి లోన్ అమౌంట్​ని ఎంచుకోవాలి. అనవసరంగా ఎక్కువ మొత్తానికి అప్లై చేస్తే రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మీ అవసరానికి ఎంత కావాలో, అంతే అప్పు తీసుకోవడం బాధ్యతాయుతమైన లక్షణం!

5. మీ బ్యాంకులోనే ప్రయత్నించండి-

మీకు ఇప్పటికే అకౌంట్ ఉన్న బ్యాంకులో లోన్ కోసం దరఖాస్తు చేస్తే.. పని సులభం అవుతుంది. మీ ఆర్థిక లావాదేవీలపై వారికి అవగాహన ఉండటం వల్ల తక్కువ డాక్యుమెంటేషన్‌తో, తక్కువ వడ్డీకే లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

6. ఒకేసారి అనేక బ్యాంకుల్లో అప్లై చేయకండి-

డబ్బు అత్యవసరమని.. ఒకేసారి నాలుగైదు బ్యాంకుల్లో లోన్ కోసం అప్లై చేయకండి! దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. మీరు 'క్రెడిట్ హంగ్రీ' (అప్పుల కోసం పాకులాడుతున్నట్లు)గా బ్యాంకులు భావిస్తాయి. ఇది మీ అప్రూవల్ ప్రక్రియను నెమ్మదిస్తుంది.

ముఖ్య గమనిక: రిస్క్ గురించి ఆలోచించారా?

పర్సనల్ లోన్ సులభంగా దొరుకుతుంది కదా అని వెంటనే తీసేసుకోవడం మంచిది కాదు! ఇందులో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి:

  • ఇతర లోన్లతో పోలిస్తే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి.
  • లోన్ అప్రూవల్ కోసం ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాలి.
  • ఒకవేళ ఈఎంఐలు కట్టకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, మీ క్రెడిట్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. భవిష్యత్తులో ఇది ఇబ్బందిని కలిగిస్తుంది.

కాబట్టి, లోన్ తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి, అన్ని నియమ నిబంధనలను క్షుణ్ణంగా చదివిన తర్వాతే ముందడుగు వేయండి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. పర్సనల్​ లోన్​ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోండి.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe