పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు అధిక మైలేజ్ ఇచ్చే కార్లవైపు చూస్తున్నారు. అందుకే సీఎన్జీ కార్ల సేల్స్ పెరుగుతున్నాయి. ఈ డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు.. నిస్సాన్ మోటార్ ఇండియా తన 7-సీటర్ ఎంపీవీ ‘గ్రావైట్’ కోసం సీఎన్జీ రెట్రోఫిట్‌మెంట్ కిట్‌ను విడుదల చేసింది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి.

కారు మైలేజీని పెంచుతూ, ఖర్చులను తగ్గించేందుకు వీలుగా రూ. 82,999 (ప్రారంభ ధర) సీఎన్జీ కిట్‌ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని నిస్సాన్ అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా ఈ కిట్ అందుబాటులో ఉంటుంది.
ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
1. ట్విన్-సిలిండర్ టెక్నాలజీ: స్పేస్‌కి లోటు లేదు!
సాధారణంగా సీఎన్జీ కిట్ అమర్చినప్పుడు కారులో బూట్ స్పేస్ తగ్గిపోతుంది. కానీ, గ్రావైట్ కోసం తీసుకొచ్చిన ఈ కిట్‌లో ట్విన్-సిలిండర్ (2 x 25 లీటర్లు) సెటప్‌ను ఉపయోగించారు.
దీనివల్ల కారు లోపల క్యాబిన్ స్పేస్ ఏమాత్రం తగ్గదు.
గ్రావైట్ పూర్తి 7-సీటర్ కాన్ఫిగరేషన్‌ను అలాగే వాడుకోవచ్చు.
మూడొవ వరుసలో కూర్చునే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనిని డిజైన్ చేశారు.
2. టెక్నాలజీ, భద్రత..
ఈ సీఎన్జీ సొల్యూషన్‌ను 'మోటోజెన్' సంస్థ అభివృద్ధి చేసింది. ఇది ప్రభుత్వం నిర్దేశించిన కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
బీఎస్6.2 నిబంధనలు: ఇది లేటెస్ట్ బీఎస్6.2 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే సీక్వెన్షియల్ కిట్.
ఐసీఏటీ ఆమోదం: ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పటిష్టత: ఇందులో 8.1ఎంఎం మందపాటి సిలిండర్‌ను వాడారు. అలాగే డైనమిక్ అడ్వాన్సర్ టెక్నాలజీ వల్ల పెర్ఫార్మెన్స్ తగ్గదు.
{{/usCountry}}పటిష్టత: ఇందులో 8.1ఎంఎం మందపాటి సిలిండర్‌ను వాడారు. అలాగే డైనమిక్ అడ్వాన్సర్ టెక్నాలజీ వల్ల పెర్ఫార్మెన్స్ తగ్గదు.
{{/usCountry}}స్మార్ట్ ఇంటిగ్రేషన్: పెట్రోల్ ఫిల్లింగ్ పాయింట్ వద్దే సీఎన్జీ నింపుకునే సౌకర్యం ఇచ్చారు. పెట్రోల్ నుంచి సీఎన్జీ మోడ్‌కు సులభంగా మారవచ్చు.
3. వారంటీ, సర్వీస్..
కస్టమర్ల నమ్మకం కోసం నిస్సాన్ ఈ కిట్‌పై భారీ వారంటీని అందిస్తోంది.
ప్రధాన భాగాలపై 3 ఏళ్లు లేదా 1,00,000 కిలోమీటర్ల వరకు థర్డ్ పార్టీ వారంటీ లభిస్తుంది.
నిస్సాన్ అధికారిక డీలర్‌షిప్‌ల ద్వారానే దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీనివల్ల ఫిట్టింగ్ విషయంలో ఎటువంటి ఫిర్యాదులకు అవకాశం ఉండదు.