కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, పెన్షన్లు, ఇతర అలవెన్సులను పునఃసమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం (8th Pay Commission) తన కార్యకలాపాలను వేగవంతం చేసింది. 2025 నవంబర్ 3న జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఈ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌లో ప్రొఫెసర్ పులక్ ఘోష్, పంకజ్ జైన్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. కమిషన్ తన తుది నివేదికను సమర్పించడానికి కేంద్ర ప్రభుత్వం 18 నెలల గడువును నిర్దేశించింది.

ప్రస్తుతం కమిషన్ దేశవ్యాప్తంగా వివిధ వాటాదారులు, ఉద్యోగ సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 9న పుదుచ్చేరిలో, సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు చండీగఢ్‌లో చర్చలు పూర్తి చేసుకుంది. తదుపరి సమావేశాలు అక్టోబర్ 7, 8 తేదీల్లో బెంగళూరులో, అక్టోబర్ 22, 23 తేదీల్లో ముంబైలో జరగనున్నాయి. ముంబై భేటీలో తమ అభిప్రాయాలను తెలపాలనుకునే ప్రతినిధులు అక్టోబర్ 10వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా అపాయింట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, పెన్షన్ సవరణ, డీఏ విలీనం వంటి ప్రధాన అంశాలపై ఉద్యోగులు తెలుసుకోవాల్సిన 25 కీలక ప్రశ్నలు-సమాధానాలు ఇవే:
8వ వేతన సంఘం: 25 కీలక ప్రశ్నలు - సమాధానాలు
1. 8వ వేతన సంఘం అంటే ఏమిటి?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర సేవా నిబంధనలను పరిశీలించి సవరణలను సిఫార్సు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక వ్యవస్థ ఇది.
2. 8వ వేతన సంఘం ఎప్పుడు ఏర్పాటైంది?
కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. తుది నివేదిక సమర్పించేందుకు 18 నెలల గడువు ఇచ్చింది.
3. ఈ కమిషన్‌లో సభ్యులు ఎవరు?
ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. ప్రొఫెసర్ పులక్ ఘోష్, పంకజ్ జైన్ సభ్యులుగా ఉన్నారు.
4. వేతన సంఘం నివేదిక ఎప్పుడు వస్తుంది?
{{/usCountry}}ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. ప్రొఫెసర్ పులక్ ఘోష్, పంకజ్ జైన్ సభ్యులుగా ఉన్నారు.
4. వేతన సంఘం నివేదిక ఎప్పుడు వస్తుంది?
{{/usCountry}}కమిషన్ నిబంధనల ప్రకారం 18 నెలల కాలపరిమితి మే 2027తో పూర్తవుతుంది. అయితే రాబోయే 8 నుంచి 9 నెలల్లోనే కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశముంది.
5. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కమిషన్ ప్రకటించిందా?
లేదండి. 8వ వేతన సంఘం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రకటించలేదు.
6. 6వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత?
6వ వేతన సంఘం మొదట 1.74 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేయగా, ప్రభుత్వం దానిని 1.86కి పెంచి అమలు చేసింది.
7. 7వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత?
7వ వేతన సంఘం వేతన నిర్ణయం కోసం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేసింది.
8. 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే జీతం 157% పెరిగినట్లా?
కాదు. 2.57 ఫ్యాక్టర్‌లో అప్పటికే ఉన్న కరవు భత్యం (డీఏ) సర్దుబాటు కలిసి ఉంటుంది. 7వ వేతన సంఘం లెక్కల ప్రకారం మూల వేతనంలో అసలు పెంపు దాదాపు 14.29 శాతంగా ఉంది.
9. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు?
భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ (బీపీఎంఎస్) వంటి ప్రముఖ యూనియన్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 4.0గా నిర్ణయించాలని కోరుతున్నాయి. ఎన్‌సీ(జేసీఎం) స్టాఫ్, భారత్ పెన్షనర్స్ సమాజ్ 3.833 ఫ్యాక్టర్‌ను ప్రతిపాదించాయి. ఉద్యోగ సంఘాలు జీతాలు గణనీయంగా పెరగాలంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.5 కంటే ఎక్కువగా ఉండాలని స్పష్టం చేస్తున్నాయి.
10. ప్రస్తుత కనీస మూల వేతనం ఎంత? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో అది ఎలా పెరుగుతుంది?
7వ వేతన సంఘం ప్రకారం ప్రస్తుతం కనీస మూల వేతనం (Basic Pay) నెలకు ₹18,000. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 3.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఆమోదిస్తే, కనీస మూల వేతనం ₹18,000 x 3 = ₹54,000కి పెరుగుతుంది.
11. 8వ వేతన సంఘం కనీస మూల వేతనాన్ని పెంచుతుందా?
కమిషన్ ప్రస్తుతం వేతన నిర్మాణాన్ని పునఃసమీక్షిస్తోంది. సవరించిన కనీస వేతనాన్ని ఇంకా ప్రకటించలేదు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు కనీస మూల వేతనాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి.
12. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మూల వేతనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఉద్యోగి కొత్త మూల వేతనాన్ని ఖరారు చేసే ప్రాసెస్ (Pay Fixation) లో ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను గుణకారంగా ఉపయోగిస్తారు.
13. 8వ వేతన సంఘం పెన్షన్‌ను కూడా సవరిస్తుందా?
అవును, పెన్షన్ల సవరణ అంశం కూడా 8వ వేతన సంఘం పరిశీలనా పరిధి (Terms of Reference) లో భాగమే.
14. 8వ సీపీసీ అమలుకు ముందే రిటైరైన పెన్షనర్లకు సవరించిన పెన్షన్ లభిస్తుందా?
పాత పెన్షనర్లకు లభించే ప్రయోజనాలు కమిషన్ ఇచ్చే సిఫార్సులు, దానిపై ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి.
15. డీఏ (DA) ను మూల వేతనంలో విలీనం చేస్తారా?
8వ వేతన సంఘం కింద కరవు భత్యాన్ని (డీఏ) మూల వేతనంలో విలీనం చేయడంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
16. 8వ సీపీసీ సిఫార్సులు 2026 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయా?
సిఫార్సుల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. అయితే, తాత్కాలికంగా 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
17. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు (Arrears) లభిస్తాయా?
బకాయిల చెల్లింపు అనేది ప్రభుత్వం నిర్ణయించే అమలు తేదీ, తుది ఉత్తర్వులపై ఆధారపడి ఉంటుంది.
18. ఉద్యోగుల చేతికి పెరిగిన జీతాలు ఎప్పుడు అందుతాయి?
వేతన సంఘం నివేదిక సమర్పించిన తర్వాత, ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపి నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరమే పెరిగిన జీతాలు ఉద్యోగులకు అందుతాయి.
19. కమిషన్ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిందా?
లేదు. సంప్రదింపుల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో సమావేశాలు షెడ్యూల్ చేశారు.
20. ఇటీవల కమిషన్ సంప్రదింపులు ఎక్కడ జరిగాయి?
సెప్టెంబర్ 9న పుదుచ్చేరిలో, సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు చండీగఢ్‌లో కమిషన్ సంప్రదింపులు నిర్వహించింది.
21. తదుపరి వేతన సంఘం సమావేశం ఎక్కడ ఉంది?
అక్టోబర్ 7, 8 తేదీల్లో బెంగళూరులో తదుపరి సమావేశం జరగనుంది.
22. ముంబైలో వేతన సంఘం సమావేశం ఎప్పుడు జరగనుంది?
అక్టోబర్ 22, 23 తేదీల్లో ముంబైలో సంప్రదింపుల సమావేశాలు నిర్వహించనున్నారు.
23. ముంబై సమావేశంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏది?
ముంబై సమావేశంలో పాల్గొనాలనుకునే ప్రతినిధులు అక్టోబర్ 10వ తేదీలోగా 8వ వేతన సంఘం అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
24. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 8వ సీపీసీ ప్రయోజనాలు స్వయంచాలకంగా వర్తిస్తాయా?
లేదు. కేంద్ర వేతన సంఘం సిఫార్సులను స్వీకరించడం లేదా సవరించి అమలు చేయడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే విడివిడిగా నిర్ణయం తీసుకుంటాయి.
25. ప్రస్తుతం గమనించాల్సిన ముఖ్యమైన తేదీలు ఏవి?
తక్షణమే గమనించాల్సిన తేదీలు అక్టోబర్ 7-8 (బెంగళూరు భేటీ), అక్టోబర్ 22-23 (ముంబై భేటీ), ముంబై అపాయింట్‌మెంట్ కోసం అక్టోబర్ 10 చివరి తేదీ.
8వ వేతన సంఘానికి సంబంధించిన మరింత సమాచారం, తాజా అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్ https://8cpc.gov.in/ ను సందర్శించవచ్చు.