కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన స్కేళ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి 8వ వేతన సంఘం పనులు వేగవంతం అవుతున్నాయి. నవంబర్ 2025లో ఏర్పాటైన ఈ కమిషన్‌కు నివేదిక సమర్పించడానికి 18 నెలల వ్యవధి ఇచ్చారు. ద్రవ్యోల్బణం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల జీవన వ్యయాలను ప్రాతిపదికగా తీసుకుని వేతన పెంపుపై పే కమిషన్ తుది సిఫార్సులు రూపొందించనుంది.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు (రైల్వేలు, పోస్టల్, ఇన్‌కమ్ టాక్స్, రక్షణ రంగం)లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ సిఫార్సులు అత్యంత కీలకంగా మారాయి. చర్చలు సాగుతున్న కొద్దీ, ప్రతిపాదిస్తున్న వేతన నిర్మాణంలో బేసిక్ పే (కనీస వేతనం) పెరగడం వల్ల ఎక్కువ లబ్ధి చేకూరుతుందా లేక అలవెన్సులు (జీత భత్యాలు) పెరగడం వల్ల మేలు జరుగుతుందా అనే ప్రశ్న ఉద్యోగుల్లో ప్రధానంగా వ్యక్తమవుతోంది.
ఫిట్‌మెంట్ ఫాక్టర్ అంటే ఏంటి? జీతం ఎలా మారుతుంది?
కొత్త వేతన సంఘం కింద సవరించిన బేసిక్ పేని లెక్కించడానికి వాడే అంశమే ‘ఫిట్‌మెంట్ ఫాక్టర్’. ఉద్యోగుల సంఘాలు 8వ వేతన సంఘంలో 3.2 నుంచి 4 రెట్లు లేదా అంతకంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఫాక్టర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఉదాహరణకు, ఫిట్‌మెంట్ ఫాక్టర్ 3 అని భావిస్తే:
ప్రస్తుతం రూ. 18,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగి కొత్త బేసిక్ పే రూ. 54,000కు పెరుగుతుంది (రూ. 36,000 పెరిగినట్లు).
ప్రస్తుతం రూ. 44,500 బేసిక్ పే పొందుతున్న ఉద్యోగి జీతం ఏకంగా రూ. 1,33,500కు చేరుతుంది (రూ. 89,000 పెంపు).
అయితే ఇవి అంచనాలు మాత్రమే. తుది ఫిట్‌మెంట్ ఫాక్టర్‌ను కమిషన్ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
అలవెన్సుల పెంపుతో తక్షణ ఉపశమనం!
{{/usCountry}}అయితే ఇవి అంచనాలు మాత్రమే. తుది ఫిట్‌మెంట్ ఫాక్టర్‌ను కమిషన్ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
అలవెన్సుల పెంపుతో తక్షణ ఉపశమనం!
{{/usCountry}}ఒక ఉద్యోగి మొత్తం వేతనంలో బేసిక్ పేతో పాటు కరువు భత్యం (డీఏ), ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ), రవాణా భత్యం (టీఏ) ప్రాధాన్యత వహిస్తాయి.
8వ వేతన సంఘం ద్వారా అలవెన్సులు పెరిగితే రోజువారీ ఇంటి ఖర్చులు, ఇళ్ల అద్దెలు, ఇంధన వ్యయాల భారం నుంచి ఉద్యోగులకు తక్షణ నగదు ఉపశమనం లభిస్తుంది. పాత ఇన్కమ్ టాక్స్ విధానాన్ని ఎంచుకునే ఉద్యోగులకు కొన్ని అలవెన్సుల ద్వారా పన్ను మినహాయింపులు కూడా లభించే అవకాశం ఉంటుంది. అయితే ఏ అలవెన్సుపై పన్ను మినహాయింపు ఉందో పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 'బేసిక్ పే' ఎందుకు కీలకం?
అయితే దీర్ఘకాలికంగా, ముఖ్యంగా పదవీ విరమణ సమయానికి బేసిక్ పే పెరగడమే అత్యంత ప్రయోజనకరం! ఎందుకంటే ఉద్యోగి పొందే పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కాంట్రిబ్యూషన్లు, గ్రాట్యుటీ లెక్కలన్నీ బేసిక్ పే ప్రాతిపదికగానే నిర్ణయమవుతాయి.
ఉదాహరణకు, బేసిక్ పేలో 12% ప్రావిడెంట్ ఫండ్‌కు వెళ్తుందనుకుంటే:
- బేసిక్ పే రూ. 18,000 ఉన్నప్పుడు నెలకు రూ. 2,160 పీఎఫ్‌కు జమ అవుతుంది.
- అదే బేసిక్ పే రూ. 25,000 కి పెరిగితే, నెలకు రూ. 3,000 పీఎఫ్‌కు వెళ్తుంది.
సుదీర్ఘ సేవా కాలంలో కాంపౌండింగ్ వడ్డీతో కలిపి రిటైర్మెంట్ నాటికి ఇది ఉద్యోగి చేతికి భారీ కార్పస్ నిధిగా మారుతుంది!
8వ వేతన సంఘం- ఉద్యోగులు ఏమి పరిగణనలోకి తీసుకోవాలి?
అలవెన్సుల పెంపు తక్షణ చేతి ఖర్చులకు వెసులుబాటు కల్పిస్తే, బేసిక్ పే పెంపు రిటైర్మెంట్ నిధిని పటిష్టం చేస్తుంది. ప్రతీ ఉద్యోగి తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాలు, పన్ను విధానం, పెన్షన్ అర్హతలను బట్టి వీటి ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి.
ఇక 8వ వేతన సంఘం సిఫార్సులు అందిన తర్వాత, వాటిని పరిశీలించిన అనంతరం, కేంద్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసే వరకు ఈ ప్రతిపాదనలన్నీ అంచనాలు మాత్రమేనని గమనించాలి.