...
...
Next Story

8th pay commission : 8వ వేతన సంఘంతో పెన్షన్లు ఆగిపోతాయా? క్లారిటీ ఇదిగో..

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పింఛన్లు నిలిచిపోతాయని, 8వ వేతన సంఘం సవరణలు వర్తించవంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని జేసీఎం స్టాఫ్ సైడ్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా స్పష్టం చేశారు. పెన్షనర్లు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Published on: Aug 31, 2026, 07:28:51 IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక సంచలన ప్రచారంపై నేషనల్ కౌన్సిల్ జేసీఎం (ఎన్​సీ-జేసీఎం) స్టాఫ్ సైడ్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా తీవ్రస్థాయిలో స్పందించారు. కేటగిరీల వారీగా పెన్షన్లు నిలిపివేస్తున్నారని, లేదా 2026 తర్వాత పదవీ విరమణ పొందే వారికి మాత్రమే 8వ వేతన సంఘం ప్రయోజనాలు వర్తిస్తాయంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు.

పుకార్లను నమ్మవద్దు: శివగోపాల్ మిశ్రా స్పష్టత

8వ వేతన సంఘం వల్ల పెన్షన్లు ఆగిపోతాయా?
8వ వేతన సంఘం వల్ల పెన్షన్లు ఆగిపోతాయా?

గత కొన్ని రోజులుగా తన పేరుతో సోషల్ మీడియా వేదికగా తప్పుడు సందేశాలు ప్రచారంలోకి రావడంతో ఎంతోమంది పెన్షనర్లు ఆందోళనకు గురవుతున్నారని మిశ్రా వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

"ఈ ప్రచారాలన్నీ తప్పుడు సమాచారంతో కూడుకున్నవి. పెన్షనర్లు వీటిని ఎంతమాత్రం నమ్మవద్దు," అని శివగోపాల్ మిశ్రా విజ్ఞప్తి చేశారు.

"8వ వేతన సంఘంలో పెన్షన్ల అంశంపై నిరంతరం చర్చలు జరుగుతున్నాయి. పెన్షనర్లందరికీ నిరంతరాయంగా పింఛన్ అందుతుంది. వారి పెన్షన్ పరిమాణంలో మెరుగైన పెరుగుదల ఉంటుందని నేను పూర్తి ఆశాభావంతో ఉన్నాను," అని ఆయన స్పష్టం చేశారు.

ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ (ఏఐఆర్​ఎఫ్) ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న మిశ్రా.. యూట్యూబ్ ఛానెళ్లు లేదా వాట్సాప్ గ్రూపులలో వచ్చే అనధికారిక వార్తలను పట్టించుకోవద్దని కోరారు. యూనియన్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన సూచించారు.

8వ వేతన సంఘం పురోగతి ఏంటి?

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన 8వ వేతన సంఘం టీఓఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కమిషన్ 18 నెలల వ్యవధిలో నివేదిక సమర్పించాల్సి ఉంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల వేతనాలు, పింఛన్లలో మార్పులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉన్న వేలాది మంది కేంద్ర ప్రభుత్వ రైల్వే, డిఫెన్స్, పోస్టల్, ఇన్కమ్ టాక్స్ ఉద్యోగులకు, రిటైర్డ్ సిబ్బందికి ఈ నిర్ణయాలు ఎంతో కీలకం కానున్నాయి.

సవరణల కోసం యూనియన్ల ఒత్తిడి..

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks