...
...
Next Story

8వ వేతన సంఘం : 3.83 ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్, రూ. 69వేల బేసిక్ పే​ కోసం డిమాండ్!

8వ వేతన సంఘం ప్యానెల్ బెంగళూరు సంప్రదింపులను ముగించుకుని, త్వరలో ముంబై వేదికగా తదుపరి సమావేశాలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న కనీస వేతనాన్ని రూ.68,994కి పెంచడం, 3.833 ఫిట్‌మెంట్ ఫాక్టర్, 6 శాతం వార్షిక ఇంక్రిమెంట్, 5 యూనిట్ల కుటుంబ లెక్కలతో కూడిన ప్రతిపాదనలను పెన్షనర్ల సంఘం కమిషన్‌కు సమర్పించింది.

Published on: Oct 11, 2026, 14:01:42 IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సుదీర్ఘ నిరీక్షణకు సంబంధించిన 8వ వేతన సంఘం పనులు శరవేగంగా సాగుతున్నాయి. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్ అక్టోబర్ 8న బెంగళూరులో వివిధ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలతో కీలక సంప్రదింపులు పూర్తి చేసింది. కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్స్ సహా 'కర్ణాటక పోస్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ పెన్షనర్స్ అసోసియేషన్' సమర్పించిన విజ్ఞాపన పత్రం ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

3.833 ఫిట్‌మెంట్ ఫాక్టర్.. రూ.69 వేల కనీస వేతనం!

8వ వేతన సంఘానికి పెన్షనర్ల డిమాండ్లు..
8వ వేతన సంఘానికి పెన్షనర్ల డిమాండ్లు..

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు వీలుగా వేతన నిర్మాణంలో విప్లవాత్మక మార్పులను యూనియన్ ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కనీస మూల వేతనం (బేసిక్ పే) రూ.18,000 పై 3.833 ఫిట్‌మెంట్ ఫాక్టర్ వర్తింపజేయాలని డిమాండ్ చేసింది. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే కనీస వేతనం రూ.68,994 (సుమారు రూ.69,000)కి చేరుతుంది. అదేవిధంగా, ప్రస్తుతం ఉన్న కనీస పెన్షన్ రూ.9,000 పై ఇదే 3.833 మల్టిప్లైయర్‌ను వర్తింపజేసి కనీస పెన్షన్‌ను రూ.34,497కి పెంచాలని కోరింది.

ఏక్రోయ్​డ్​ ఫార్ములా పునఃపరిశీలన.. 6 శాతానికి ఇంక్రిమెంట్!

కేవలం ఆహారం, దుస్తులు మాత్రమే కాకుండా, నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ సేవలు కుటుంబ ప్రాథమిక అవసరాలుగా మారాయని అసోసియేషన్.. 8వ వేతన సంఘానికి స్పష్టం చేసింది. అందువల్ల కనీస వేతన నిర్ణయంలో ఉపయోగించే ‘ఏక్రోయ్డ్ ఫార్ములా’ను ఆధునిక జీవన వ్యయాలకు అనుగుణంగా మార్చాలని కమిషన్‌ను కోరింది. ఉద్యోగుల పనితీరును ప్రోత్సహించేందుకు వార్షిక ఇంక్రిమెంట్ రేటును ప్రస్తుతం ఉన్న 3 శాతం నుంచి 6 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది.

పే- పెన్షన్ కాంపొనెంట్

ప్రస్తుతం ఉన్నది

పెంచాలన్న డిమాండ్

కనీస బేసిక్ పేరూ. 18,000రూ. 69,000
కనీస బేసిక్ పెన్షన్రూ. 9,000రూ. 34,470
వార్షిక వృద్ధి రేటు3%6%
ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్-3.833

5 యూనిట్ల కుటుంబ ప్రాతిపదికన వేతన గణన..

ఈ విధంగా మొత్తం 5 యూనిట్లను ప్రాతిపదికగా తీసుకుని కనీస వేతనాన్ని గణించాలని 8వ వేతన సంఘానికి వివరించారు.

ముంబై వేదికగా తదుపరి చర్చలు.. నివేదిక సమర్పణ ఎప్పుడంటే?

బెంగళూరు చర్చల అనంతరం వేతన సంఘం తదుపరి రౌండ్ సంప్రదింపులను అక్టోబర్ 22 నుంచి ముంబై వేదికగా ప్రారంభించనుంది. 2025 నవంబర్ 3న ఏర్పాటైన ఈ 8వ వేతన సంఘం నిబంధనల ప్రకారం 18 నెలల కాలపరిమితిలో అనగా 2027 మే-జూన్ నాటికి తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. కేటాయించిన 18 నెలల వ్యవధిలో ఇప్పటికే 11 నెలలు పూర్తవగా, మరో 7 నెలల సమయం మిగిలి ఉంది. ఉద్యోగ సంఘాలు కోరిన ఈ డిమాండ్లపై కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే తుది నివేదికను రూపొందించనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks