కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీవితాలను మార్చే దిశగా 8వ వేతన సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్ అక్టోబర్ 8న బెంగళూరులో కీలక సమావేశాన్ని పూర్తి చేసుకుంది. ఆ తర్వాత అక్టోబర్ 22, 23 తేదీల్లో ముంబై వేదికగా తదుపరి రౌండ్ సంప్రదింపులు జరపడానికి సన్నాహాలు చేస్తోంది.

2025 నవంబర్ 3న 8వ వేతన సంఘం ఏర్పాటైనప్పటి నుంచి గత 11 నెలల కాలంలో ఈ ప్యానెల్ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించింది. దిల్లీ, లడఖ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి వంటి వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ సిబ్బంది వినతులను స్వీకరించింది. నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోకుండా సవరించిన వేతన నిర్మాణం ఉండాలని సంఘాలు గట్టిగా ఒత్తిడి తెస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నిత్యం పెరుగుతున్న డీఏ అంశం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్లు ఎలా లేవనెత్తుతోందో ఇక్కడ తెలుసుకుందాము..
పెరిగిన డీఏ.. ఫిట్‌మెంట్ ఫాక్టర్ డిమాండ్లు!
కరువు భత్యం (డీఏ) నిరంతరం పెరుగుతుండటమే ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలకు ప్రధాన మూలకారంగా మారింది. గణాంకాలను పరిశీలిస్తే, 2023 జులైలో 46 శాతంగా ఉన్న డీఏ.. 2024 జనవరికి 50 శాతానికి, జులై 2024 నాటికి 53 శాతానికి, 2025 జనవరికి 55 శాతానికి, జులై 2025లో 58 శాతానికి, 2026 జనవరి నాటికి ఏకంగా 60 శాతానికి చేరుకుంది.
ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున (డీఏని ద్రవ్యోల్బణానికి ప్రతిబింబంగా చూస్తారు), వేతన సవరణలో వర్తింపజేసే 'ఫిట్‌మెంట్ ఫాక్టర్' శాతాన్ని గణనీయంగా పెంచాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. గతంలో 6వ పే కమిషన్ 1.86 ఫిట్‌మెంట్ ఫాక్టర్‌ను, 7వ పే కమిషన్ 2.57 ఫిట్‌మెంట్ ఫాక్టర్‌ను వర్తింపజేశాయి. కానీ ఈసారి నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ఉద్యోగుల విభాగం, భారత్ పెన్షనర్స్ సమాజ్ వంటి ప్రతిష్టాత్మక సంఘాలు ఏకంగా 3.833 ఫిట్‌మెంట్ ఫాక్టర్‌ను డిమాండ్ చేస్తున్నాయి. దీనివల్ల కనీస మూల వేతనం రూ. 69,000 కు చేరుతుంది. మరోవైపు, సర్వే ఆఫ్ ఇండియా మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ 3.61 ఫిట్‌మెంట్ ఫాక్టర్‌ను కోరుతోంది.
డీఏ విలీనం.. శాశ్వత వేతన సవరణ వ్యవస్థ!
కేవలం పదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయడం వల్ల ద్రవ్యోల్బణం ధాటికి సామాన్య ఉద్యోగి ఆర్థిక భారం మోయలేకపోతున్నాడని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్ సూచించింది. డీఏ లేదా డీఆర్ (డియర్నెస్ రిలీఫ్) 50 శాతం దాటిన వెంటనే 90 రోజుల్లోగా సవరించిన ఫిట్‌మెంట్ ఫాక్టర్‌ను సిఫార్సు చేసేలా ‘శాశ్వత వేతన సమీక్షా మండలి’ ని ఏర్పాటు చేయాలని కోరింది.
{{/usCountry}}కేవలం పదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయడం వల్ల ద్రవ్యోల్బణం ధాటికి సామాన్య ఉద్యోగి ఆర్థిక భారం మోయలేకపోతున్నాడని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్ సూచించింది. డీఏ లేదా డీఆర్ (డియర్నెస్ రిలీఫ్) 50 శాతం దాటిన వెంటనే 90 రోజుల్లోగా సవరించిన ఫిట్‌మెంట్ ఫాక్టర్‌ను సిఫార్సు చేసేలా ‘శాశ్వత వేతన సమీక్షా మండలి’ ని ఏర్పాటు చేయాలని కోరింది.
{{/usCountry}}అంతేకాకుండా, డీఏ 25 శాతం దాటిన ప్రతిసారీ ఆ మొత్తాన్ని బేసిక్ పేలో విలీనం చేయాలని పోస్టల్ యూనియన్లతో పాటు భారత్ పెన్షనర్స్ సమాజ్ ప్రతిపాదించింది. దీనివల్ల ఉద్యోగులు, పింఛనుదారుల కొనుగోలు శక్తి స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు.
8వ వేతన సంఘం సిఫార్సులు ఎప్పుడు అమలవుతాయి?
8వ పే కమిషన్ తన సుదీర్ఘ అధ్యయనం, సంప్రదింపుల అనంతరం 2027 మే-జూన్ నాటికి కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించే అవకాశముంది. ఆ తర్వాత కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపి జీవోలు జారీ చేసే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇదంతా జరిగి, ఉద్యోగులకు పెంచిన జీతాలు పడేసరికి 2029 లేదా 2030 అవ్వొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా తగిన వేతన సిఫార్సులు వస్తాయని కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.