...
...
Next Story

హైప్ పీక్స్.. రిజల్ట్ జీరో! సిరాజ్ జెర్సీ వేసుకున్నా మారని అభిషేక్ శర్మ లక్.. నంబర్ వన్ బ్యాటర్ సున్నాకే పరిమితం

డేంజరస్ ఓపెనర్, క్రీజులోకి వచ్చాడంటే సిక్సర్ల మోత.. ఇలా టీ20 ప్రపంచకప్ కు ముందు అభిషేక్ శర్మపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ ఈ వరల్డ్ కప్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ అతను డకౌట్ అయ్యాడు. నెదర్లాండ్స్ తో పోరులో సిరాజ్ జెర్సీ వేసుకుని వచ్చినా అతని లక్ మారలేదు.

Published on: Feb 19, 2026, 10:40:05 IST
Advertisement

టీ20 ప్రపంచకప్ కు ముందు ఇండియన్ టీమ్ పై భారీ హైప్ రావడానికి ప్రధాన కారణం అభిషేక్ శర్మ. ఈ ప్రపంచ టీ20 నంబర్ వన్ బ్యాటర్ పొట్టి కప్ లో చెలరేగుతాడని ఫ్యాన్స్ ఆశించారు. ఇండియా కచ్చితంగా 300 స్కోరు అందుకుంటుందని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. అభిషేక్ శర్మ విధ్వంసం పక్కనపెడితే కనీసం ఒక్క రన్ కూడా చేయలేకపోతున్నాడు.

మూడు డకౌట్లు

అభిషేక్ శర్మ బౌల్డ్ (PTI)
అభిషేక్ శర్మ బౌల్డ్ (PTI)

అభిషేక్ శర్మ ఎంతటి డేంజరస్ ప్లేయరో మనకు తెలిసిందే. ఫస్ట్ బాల్ నుంచే అతని ఊతకోత మొదలవుతుంది. అతను ఆడుతుంటే బాల్ గ్రౌండ్ లో కంటే ఎక్కువగా బౌండరీ బయటే ఉంటుంది. కానీ ఏమైందో ఏమో టీ20 వరల్డ్ కప్ లో అభిషేక్ బ్యాట్ సైలెంట్ అయిపోయింది. అతను ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ డకౌట్ అయ్యాడు.

ఒక్క రన్ చేయలేక

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తన తొలి మ్యాచ్ లో అమెరికాను ఢీ కొట్టింది. ఈ పోరులో అభిషేక్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగుతాడని, ఇండియా 300 స్కోరు అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అభిషేక్ శర్మ డకౌటై షాకిచ్చాడు. ఆ తర్వాత కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్ లో అభిషేక్ ఆడలేదు.

ఇక అత్యంత కీలకమైన, ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పాకిస్థాన్ తో మ్యాచ్ లోనూ అందరి ఫోకస్ అభిషేక్ పైనే నెలకొంది. కానీ మళ్లీ ఫస్ట్ ఓవర్లోనే సున్నాకే పెవిలియన్ చేరిపోయాడు. ఇక నెదర్లాండ్స్ తో పోరులోనూ అదే రిపీట్ అయింది. బ్యాట్ ను గాల్లోకి ఊపి బౌల్డ్ అయ్యాడు. ముందు అభిషేక్ సింగిల్ తీయాలనే సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజం సూచననూ అతను పట్టించుకోలేదు.

సిరాజ్ జెర్సీ

"అదృష్టం మారడానికి అభిషేక్ వేరే జెర్సీ వేసుకుని వచ్చాడు" అని నెదర్లాండ్స్ తో మ్యాచ్ సందర్భంగా మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు. "మళ్లీ ఔట్, వరుసగా మూడు డక్‌లు. ఈ ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్ వరుసగా 0, 0, 0 చేశాడంటే నమ్ముతారా’’ అని హుస్సేన్ అన్నాడు.

స్పిన్నర్ తో బౌలింగ్

‘‘అభిషేక్ ఫస్ట్ బాల్ నుంచే దూకుడుగా ఆడే ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ లోనూ అదే చేయాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు బౌల్డ్ అయ్యాడు. ఆ రెండు డాట్ బాల్స్ అతనిపై ఒత్తిడి పెంచి ఉండొచ్చు. సిక్సర్ తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగల ఆటగాడిగా పేరు వస్తే అందుకు తగ్గట్లుగానే ఆడాలని అనుకుంటారు. అభిషేక్ అదే చేయాలనుకుంటున్నాడు. స్పిన్నర్ తో అతనికి బౌలింగ్ వేయించడం మంచి ప్లాన్. మూడో డక్’’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks