...
...
Next Story

హాస్పిట‌ల్ నుంచి అభిషేక్ శ‌ర్మ డిశ్చార్జ్‌.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇవాళ ఇండియా మ్యాచ్‌.. 300 లోడింగ్‌! లైవ్ స్ట్రీమింగ్

టీమిండియాకు గుడ్ న్యూస్. టీ20 ప్రపంచకప్ లో నమీబియాతో మ్యాచ్ కు ముందు ఇండియా విధ్వంసక ఓపెనర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ రోజు పసికూనతో పోరులో ఇండియా 300 అందుకుంటుందేమో చూడాలి. మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడున్నాయి.

Published on: Feb 12, 2026, 12:14:04 IST
Advertisement

టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. తమ ఓపెనింగ్ మ్యాచ్ లో అమెరికాపై విజయంతో టోర్నీని స్టార్ట్ చేసిన భారత్.. రెండో మ్యాచ్ లో ఈ రోజు నమీబియాతో తలపడనుంది. డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడం గుడ్ న్యూస్.

ఇండియా వర్సెస్ నమీబియా

అభిషేక్ శర్మ (PTI)
అభిషేక్ శర్మ (PTI)

డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా మరో పోరుకు సై అంటోంది. టీ20 ప్రపంచకప్ లో గురువారం నమీబియాను ఢీ కొడుతోంది. తొలి మ్యాచ్ లో యుఎస్ఏపై విక్టరీతో సూర్యకుమార్ సేన జోష్ లో ఉంది. నమీబియాను చిత్తు చేయాలనే టార్గెట్ పెట్టుకుంది.

లైవ్ స్ట్రీమింగ్

టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-ఎ లో ఈ రోజు ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ ఉంది. ఈ పోరు రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ఈ మ్యాచ్ ను లైవ్ చూడొచ్చు. ఓటీటీలో అయితే జియోహాట్ స్టార్ లో మ్యాచ్ ను వీక్షించొచ్చు.

300 లోడింగ్

300 లోడింగ్.. ఇప్పుడు నమీబియాతో మ్యాచ్ కు ముందు ఇండియన్ ఫ్యాన్స్ ఎక్కువగా డిస్కస్ చేస్తున్న టాపిక్ ఇదే. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న టీమిండియా.. పసికూన నమీబియాపై చెలరేగి తొలిసారి 300 స్కోరు అందుకుంటుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి మన ఇండియా వీరులు ఏం చేస్తారో చూడాలి.

అభిషేక్ ఆడేనా?

నమీబియాతో మ్యాచ్ కు ముందు రోజు శాంసన్ నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్ కోచ్ తో మాట్లాడుతూ కనిపించాడు. దీన్ని బట్టి చూస్తే ఈ మ్యాచ్ లో శాంసన్ ఆడటం ఖాయమని చెప్పొచ్చు. అయితే అతని రీసెంట్ ఫామ్ మాత్రం బెటర్ గా ఏం లేదు.

శాంసన్ గత ఐదు మ్యాచ్‌లలో 135.29 స్ట్రైక్ రేట్‌తో 46 పరుగులు మాత్రమే సాధించాడు. సగటు 9.20 మాత్రమే. ఈ నేపథ్యంలో నమీబియాతో మ్యాచ్ లో ఆడే ఛాన్స్ వస్తే శాంసన్ దీన్ని ఎంత వరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks