14 బాల్స్‌లోనే అభిషేక్ 50-గురువు యూవీ రికార్డు జ‌స్ట్ మిస్‌-10 ఓవ‌ర్ల‌లోనే 155 కొట్టేసిన టీమిండియా

అభిషేక్ శర్మ పెను తుపాను చూపించాడు. క్రికెట్ గ్రౌండ్ లో సిక్సర్ల సునామీ తెప్పించాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. గురువు యువరాజ్ సింగ్ రికార్డును కొద్దిలో మిస్ అయ్యాడు. ఆదివారం న్యూజిలాండ్ తో మూడో వన్డేలో ఇండియా 10 ఓవర్లలోనే 155 కొట్టేసి, గెలిచేసింది. 

Published on: Jan 25, 2026 10:23 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అభిషేక్ శర్మనా మజానా! అతని చేతిలోని బ్యాట్ మంత్రదండంలా మారి బంతిని పదేపదే స్టాండ్స్ లోకి పంపించేసింది. పూనకం వచ్చినట్లు ఊగిపోయిన ఈ టీమిండియా ఓపెనర్ న్యూజిలాండ్ బౌలింగ్ ను చిత్తుగా కొట్టాడు. ఆదివారం న్యూజిలాండ్ తో మూడో టీ20లో అభిషేక్ శర్మ 14 బాల్స్ లోనే ఫిఫ్టీ సాధించేశాడు. తన గురువు యువరాజ్ సింగ్ రికార్డుకు 2 బంతుల దూరంలో ఆగిపోయాడు.

అభిషేక్ శర్మ (PTI)
అభిషేక్ శర్మ (PTI)

అభిషేక్ రికార్డు

ఆదివారం (జనవరి 25) న్యూజిలాండ్ తో మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు అభిషేక్ శర్మ. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఓ ఫుల్ మెంబర్ టీమ్ పై టీ20ల్లో అత్యంత వేగంగా అర్ధ శతకం చేసిన మూడో బ్యాటర్ గా నిలిచాడు. ఫస్ట్ ప్లేస్ లో అభిషేక్ గురువు యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) ఉన్నాడు. యూవీ రికార్డును జస్ట్ 2 బంతుల తేడాతో మిస్ అయ్యాడు అభిషేక్.

  • ఫుల్ మెంబర్ జట్టుపై అత్యంత వేగవంతమైన 50 (బంతుల ప్రకారం):
    12 బంతులు - యువరాజ్ సింగ్ vs ఇంగ్లాండ్, డర్బన్ 2007
    13 బంతులు - జాన్ ఫ్రైలింక్ vs జింబాబ్వే, బులవాయో 2025
    14 బంతులు - కోలిన్ మున్రో vs శ్రీలంక, ఆక్లాండ్ 2016
    14 బంతులు - అభిషేక్ శర్మ vs న్యూజిలాండ్, గువహటి 2026
    15 బంతులు- క్వింటన్ డి కాక్ vs వెస్టిండీస్, సెంచూరియన్ 2023

తొమ్మిదోసారి

అభిషేక్ తన మొదటి బంతికే దూకుడుగా ఆడి, జాకబ్ డఫీ బౌలింగ్‌లో ముందుకు వచ్చి నేరుగా స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అతను 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో 50 పరుగులు చేయడం T20Iలలో ఇది తొమ్మిదవసారి.

  • T20Iలలో 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో 50 పరుగులు అత్యధిక సార్లు:
    9 - అభిషేక్ శర్మ
    8 - సూర్యకుమార్ యాదవ్
    7 - ఫిల్ సాల్ట్
    7 - ఎవిన్ లూయిస్

ఇండియా గ్రాండ్ విక్టరీ

న్యూజిలాండ్ తో మూడో టీ20లో ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఛేజింగ్ లో 10 ఓవర్లలోనే 155 రన్స్ కొట్టేసింది. అభిషేక్ శర్మ (20 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయారు. వీళ్ల బాదుడుతో ఇండియా 10 ఓవర్లలోనే గెలిచేసింది.

బుమ్రా జోరు

అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులే చేసింది. జస్ప్రీత్ బుమ్రా (3/17) మూడు వికెట్లతో అదరగొట్టాడు. హార్దిక్ పాండ్యా (2/23), స్పిన్నర్ రవి బిష్ణోయ్ (2/18), హర్షిత్ రాణా (1/35) కూడా బౌలింగ్ లో రాణించారు. గ్లెన్ ఫిలిప్స్ (48) కివీస్ తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. 5 టీ20 ల సిరీస్ ను భారత్ 3-0తో దక్కించుకుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More