...
...
Next Story

స్మార్ట్‌ఫోన్ వ్యసనానికి చెక్ ఈ ‘బ్రిక్​’! యువతను ఆకర్షిస్తున్న ఈ కొత్త ట్రెండ్ ఏంటి?

స్మార్ట్‌ఫోన్ వాడకం హద్దులు దాటుతుండటంతో, ముఖ్యంగా 20-35 ఏళ్ల యువత 'డిజిటల్ ఓవర్‌లోడ్' నుంచి బయటపడేందుకు 'బ్రిక్' అనే 'యాంటీ-టెక్' పరికరాన్ని ఆశ్రయిస్తున్నారు. సుమారు రూ. 5,000 ధర ఉండే ఈ చిన్న గ్రే కలర్ క్యూబ్.. ఫోన్‌లోని అనవసరమైన యాప్‌లను బ్లాక్ చేస్తుంది. ఎలా? పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Feb 16, 2026, 13:01:17 IST
Advertisement

ఈవెంట్​ ఏదైనా, ప్రదేశం ఏదైనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్​ఫోన్స్​లో మునిగిపోయే కనిపిస్తున్నారు. ఇంట్లో వాడతారు, బాత్​రూమ్​లో వాడతారు, బెడ్​రూమ్​లో వాడతారు, రోడ్డు మీద వాడతారు. ఇలా ఎక్కడపడితే అక్కడ ప్రజలు తమ ఫోన్స్​కి అతుక్కుపోయి కనిపిస్తున్నారు. చూస్తూ చూస్తూనే ఫోన్స్​కి బానిస అయిపోతున్నారు. స్మార్ట్​ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, నోటిఫికేషన్ రాగానే చెయ్యి ఆటోమేటిక్‌గా ఫోన్ వైపు వెళిపోతుంది. ఈ డిజిటల్ వ్యసనం నుంచి బయటపడటానికి ఇంటర్నెట్‌లో రకరకాల సలహాలు ఉన్నాయి. అయితే, వాటన్నింటికీ భిన్నంగా 'బ్రిక్' (Brick) అనే ఒక చిన్న పరికరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా 20-35 ఏళ్ల యువతలో వైరల్ అవుతోంది. అసలేంటి ఈ బ్రిక్​? ఇక్కడ తెలుసుకోండి..

ఏంటి

PREMIUMస్మార్ట్​ఫోన్​ని బానిసైపోయారా? ఇది చూడండి.. (Representational image)
స్మార్ట్​ఫోన్​ని బానిసైపోయారా? ఇది చూడండి.. (Representational image)

ఈవెంట్​ ఏదైనా, ప్రదేశం ఏదైనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్​ఫోన్స్​లో మునిగిపోయే కనిపిస్తున్నారు. ఇంట్లో వాడతారు, బాత్​రూమ్​లో వాడతారు, బెడ్​రూమ్​లో వాడతారు, రోడ్డు మీద వాడతారు. ఇలా ఎక్కడపడితే అక్కడ ప్రజలు తమ ఫోన్స్​కి అతుక్కుపోయి కనిపిస్తున్నారు. చూస్తూ చూస్తూనే ఫోన్స్​కి బానిస అయిపోతున్నారు. స్మార్ట్​ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, నోటిఫికేషన్ రాగానే చెయ్యి ఆటోమేటిక్‌గా ఫోన్ వైపు వెళిపోతుంది. ఈ డిజిటల్ వ్యసనం నుంచి బయటపడటానికి ఇంటర్నెట్‌లో రకరకాల సలహాలు ఉన్నాయి. అయితే, వాటన్నింటికీ భిన్నంగా 'బ్రిక్' (Brick) అనే ఒక చిన్న పరికరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా 20-35 ఏళ్ల యువతలో వైరల్ అవుతోంది. అసలేంటి ఈ బ్రిక్​? ఇక్కడ తెలుసుకోండి..

ఏంటి ఈ 'బ్రిక్'? ఇది ఎలా పనిచేస్తుంది?

PREMIUMస్మార్ట్​ఫోన్​ని బానిసైపోయారా? ఇది చూడండి.. (Representational image)
స్మార్ట్​ఫోన్​ని బానిసైపోయారా? ఇది చూడండి.. (Representational image)

ఎయిర్‌పాడ్స్ కేస్ పరిమాణంలో ఉండే ఈ చిన్న గ్రే కలర్ క్యూబ్ ధర సుమారు రూ. 5,000 (59 డాలర్లు). ఇది మీ ఫోన్ స్క్రీన్ టైమ్‌ను రోజుకు సగటున 3 గంటలు తగ్గిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.

పనితీరు: మీరు ఏ యాప్స్‌ను అయితే వాడకూడదు అనుకుంటున్నారో వాటిని బ్రిక్ యాప్‌లో ఎంచుకోవాలి. తర్వాత మీ ఫోన్‌ను ఈ 'బ్రిక్' పరికరానికి తాకిస్తే (టాప్​), ఆ యాప్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి!

అన్‌బ్రిక్: మళ్లీ ఆ యాప్స్ వాడాలి అంటే, ఫోన్‌ను తిరిగి ఆ పరికరానికి తాకించాల్సిందే. అంటే, ఆ చిన్న క్యూబ్‌ను మీరు ఇంట్లో వదిలేసి బయటకు వెళితే, ఇక ఆ రోజంతా మీరు ఫోన్ టెంప్టేషన్స్‌కు దూరంగా ఉన్నట్టే!

పెరిగిన 'యాంటీ-టెక్' క్రేజ్!

స్మార్ట్​ఫోన్స్​కి దూరంగా ఉండాలనే కోరిక పెరగడం వల్లే ఇలాంటి కొత్త రకం టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి:

ఓపల్: ఇది కూడా బ్రిక్ లాగే యాప్స్‌ను బ్లాక్ చేస్తుంది. 2020 నుంచి ఇప్పటివరకు యూజర్లు 20 కోట్ల గంటల సమయాన్ని ఫోన్లకు దూరంగా గడిపేలా చేసిందని ఈ సంస్థ చెబుతోంది.

ఫారెస్ట్: మీరు ఎంత సేపు ఫోన్ ముట్టుకోకుండా ఉంటే, యాప్‌లో వర్చువల్ చెట్లు అంతగా పెరుగుతాయి. మీరు బాగా ఫోన్‌కు దూరంగా ఉంటే, మీ పేరు మీద ఆఫ్రికాలో నిజమైన మొక్కను నాటుతారు!

డమ్ ఫోన్స్: టచ్ స్క్రీన్ లేని పాతకాలపు బటన్ ఫోన్లను వాడటం ఇప్పుడు ఒక 'కూల్' ఫ్యాషన్‌గా మారింది.

డిజిటల్ డిటాక్స్ - ఒక కొత్త జీవనశైలి..

అమ్‌స్టర్‌డ్యామ్‌లో ప్రారంభమైన 'ఆఫ్‌లైన్ క్లబ్' ఇప్పుడు బాలీతో పాటు 19 నగరాలకు విస్తరించింది. ఇక్కడ ఫోన్లకు ప్రవేశం లేదు. రెస్టారెంట్లు, బార్లలో కూడా ఫోన్లను లాకర్లలో పెట్టేస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లకు బదులు పెన్నులు, నోట్‌ప్యాడ్‌లు, పాతకాలపు కెమెరాలతో కూడిన #AnalogueBags ట్రెండ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా 'ఆల్కహాలిక్స్ అనానిమస్' లాగా, ఫోన్ వ్యసనపరుల కోసం 'ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ అడిక్ట్స్ అనానిమస్'గా మారుతోంది.

డిజిటల్​ ఓవర్​లోడ్​ వల్లే..

అనేక పరిశోధకుల ప్రకారం.. నేటి యువత 'డిజిటల్ ఓవర్‌లోడ్' అనుభవిస్తున్నారు. ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండాలి, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వాలి అనే ఒత్తిడి వారిని వేధిస్తోంది. అమెరికాలో 30 ఏళ్ల లోపు వారు నిద్రలేవగానే చూసేది, పడుకునే ముందు చూసేది ఫోనే! దాదాపు 40% మంది ఫోన్‌ను పక్కనే పెట్టుకుని పడుకుంటున్నారు. డేటా ప్రైవసీ, తప్పుడు సమాచారం పట్ల భయం కూడా ఈ 'డిజిటల్ డిటాక్స్'కు కారణమవుతోంది.

ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే— 2026ను 'అనలాగ్ ఇయర్'గా ప్రకటించిన జెన్-జీ యువత, ఆ ప్రకటనను కూడా 'టిక్‌టాక్'లోనే చేస్తున్నారు! బ్రిక్ పరికరం వైరల్ అయింది సోషల్ మీడియాలోనే. అంటే ఫోన్ వదిలేయాలనే ప్రచారం కూడా ఫోన్ స్క్రీన్ల మీదే జరుగుతోంది. అందుకే చాలా డిజిటల్ డిటాక్స్ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అయితే 'కళ్ల ముందు టెంప్టేషన్ లేకపోతేనే నియంత్రణ సాధ్యం' అనే సూత్రంపై పనిచేసే 'బ్రిక్' మాత్రం సత్ఫలితాలను ఇస్తోందని యూజర్లు చెప్తున్నారు.

ప్రశ్నలు- సమాధానాలు :-

ప్రశ్న- బ్రిక్' పరికరం ఇతర యాప్-బ్లాకర్ల కంటే ఎలా భిన్నమైనది?

సమాధానం- సాధారణ యాప్-బ్లాకర్లను ఫోన్‌లోనే సులభంగా డిసేబుల్ చేయవచ్చు, కానీ 'బ్రిక్' ఒక భౌతిక పరికరం. మీరు బ్లాక్ చేసిన యాప్‌లను తిరిగి పొందాలంటే, మీ ఫోన్‌ను ఆ పరికరానికి దగ్గరగా తీసుకువెళ్లి తాకించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ బ్రిక్ పరికరాన్ని ఇంట్లో వదిలేసి బయటకు వెళితే, ఆ టెంప్టేషన్ నుంచి మీరు పూర్తిగా దూరంగా ఉండగలుగుతారు. అంటే, ఇది 'కంటికి దూరమైతేనే మనసుకి దూరం' అనే సూత్రంపై పనిచేస్తుంది.

ప్రశ్న- 'డిజిటల్ డిటాక్స్' అంటే ఏంటి? యువత దీనివైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?

సమాధానం- కొంత కాలం పాటు స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా, ఇంటర్నెట్‌కు దూరంగా ఉండి భౌతిక ప్రపంచంతో గడపడాన్ని 'డిజిటల్ డిటాక్స్' అంటారు. నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండాలనే ఒత్తిడి, డేటా ప్రైవసీ ఆందోళనలు, 'డూమ్-స్క్రోలింగ్' వల్ల కలిగే మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకు యువత ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

All Access.
One Subscription.

Get 360° coverage—from daily headlines
to 100 year archives.

E-Paper
Full
Archives
Full Access to
HT App & Website
Games
 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe