అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి సర్వీసు కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీంతో నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా అగ్నివీరులు సైనిక దళాల్లో కొనసాగేందుకు, ఆపై పర్మినెంట్ సర్వీస్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్గం సుగమమైంది.

"నాలుగేళ్ల కాలంలో అగ్నివీరుల పనితీరును సమీక్షించాం. వారి ప్రతిభపై అత్యంత సానుకూల స్పందన వచ్చింది. ప్రారంభంలో కేవలం 25 శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసులోకి తీసుకోవాలని భావించాం. అయితే ఇప్పుడు మిగిలిన 75 శాతం మందికి కూడా మరో రెండేళ్లపాటు సర్వీసులో కొనసాగే అవకాశాన్ని ఇస్తున్నాం" అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
రెండేళ్ల పొడిగింపుతో లభించే ప్రయోజనాలు
కేబినెట్ ఆమోదించిన నూతన నిబంధనల ప్రకారం, పొడిగించిన రెండేళ్ల కాలంలో అగ్నివీరులకు లభించే వేతనం, భత్యాలు ప్రస్తుతం అందుతున్న మొత్తం కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత, ఆసక్తి కలిగిన అగ్నివీరులందరినీ నిర్దేశిత అర్హత ప్రమాణాలకు (Objective Selection Criteria) అనుగుణంగా సైన్యంలో పూర్తిస్థాయి సైనికులుగా ఎన్‌రోల్ చేసుకుంటారు.
తొలి బ్యాచ్‌కు దక్కిన ఊరట
ముందస్తు ప్రణాళిక ప్రకారం నవంబరు మధ్య నుంచి డిసెంబరు 31 నాటికి తొలి విడతకు చెందిన 75 శాతం మంది అగ్నివీరులను సైన్యం నుంచి దశలవారీగా విడుదల చేయాల్సి ఉంది. మొదటి బ్యాచ్‌లోని దాదాపు 18,300 మంది అగ్నివీరుల నాలుగేళ్ల గడువు ముగియడానికి కొన్ని వారాల ముందే కేంద్ర ప్రభుత్వం ఈ సడలింపు నిర్ణయం తీసుకోవడం విశేషం.
సెకండ్ టూర్ ఆఫ్ డ్యూటీ: రాజ్‌నాథ్ సింగ్
కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు సంవత్సరాల పొడిగింపును ఆయన "సెకండ్ టూర్ ఆఫ్ డ్యూటీ"గా అభివర్ణించారు.
{{/usCountry}}కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు సంవత్సరాల పొడిగింపును ఆయన "సెకండ్ టూర్ ఆఫ్ డ్యూటీ"గా అభివర్ణించారు.
{{/usCountry}}"అర్హత ప్రమాణాలు సాధించిన ఆసక్తిగల అగ్నివీరులందరినీ 4 లేదా 6 ఏళ్ల వ్యవధి తర్వాత రెగ్యులర్ సైనికులుగా చేర్చుకునేందుకు ఇది దోహదపడుతుంది. మన సైనిక దళాలను మరింత యంగ్‌గా, ఫిట్‌గా, సాంకేతికంగా బలపేతం చేసే దిశగా చేపట్టిన సుదీర్ఘ సంస్కరణల్లో ఇది భాగం. ఇది కేవలం రిక్రూట్‌మెంట్ పాలసీ మాత్రమే కాదు, మారుతున్న యుద్ధ తంత్రానికి అనుగుణంగా భారత సైన్యాన్ని సిద్ధం చేసే మార్గం" అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
అగ్నిపథ్ పథకం నేపథ్యం
భారత సైన్యంలో యువత భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో 2022 జూన్‌లో అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ మోడల్‌ను కేంద్రం ప్రారంభించింది. తొలి విడతలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ దళాల్లో కలిపి మొత్తం 24,400 మంది అగ్నివీరులను ఎంపిక చేశారు. ఇందులో భారతీయ సైన్యంలో 19,000 మంది, వైమానిక దళంలో 2,850 మంది, నావికాదళంలో 2,550 మంది విధులు చేపట్టారు.
గత నిబంధనల ప్రకారం 25 శాతం మందిని మాత్రమే 15 ఏళ్ల రెగ్యులర్ సర్వీసు కోసం ఉంచుకుని, మిగిలిన 75 శాతం మందిని నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి విముక్తి చేయాల్సి ఉంది. అయితే తాజా కేబినెట్ నిర్ణయంతో విధుల నుంచి తప్పుకోవాల్సిన 18,300 మందికి మరో రెండేళ్లు అదనంగా సర్వీసులో కొనసాగే అవకాశం దక్కింది.