భారీ డిజైన్​ మార్పుతో కొత్త Kia Seltos ఎస్​యూవీ- లాంచ్​ ఎప్పుడంటే..

సరికొత్త కియా సెల్టోస్ ఎస్​యూవీ మోడల్​ టీజర్​ని సంస్థ విడుదల చేసింది. ఈ క్రమంలో లాంచ్‌కు ముందే డిజైన్​కి సంబంధించి కొన్ని విషయాలు తెలిశాయి. ఈ ఎస్​యూవీ డిసెంబర్​ 10న ఇండియాలోకి అడుగుపెట్టబోతోంది.

Published on: Dec 01, 2025 4:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీల్లో ఒకటి కియా సెల్టోస్​. కియా సంస్థకు కూడా ఇది బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​. ఇక ఇప్పుడు ఈ కియా సెల్టోస్​కి నెక్ట్స్​ జనరేషన్​ వర్షెన్​ని తీసుకొస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇది డిసెంబర్​ 10న అధికారికంగా లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో కియా ఒక టీజర్‌ను విడుదల చేసింది. ఫలితంగా ఎస్​యూవీకి సంబంధించి కొన్ని విషయాలు తెలిశాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త కియా సెల్టోస్​ (Instagram/Kiaind)
కొత్త కియా సెల్టోస్​ (Instagram/Kiaind)

కొత్త కియా సెల్టోస్-​ డిజైన్​లో మార్పు, షార్ప్​ లుక్..

కియా విడుదల చేసిన తాజా టీజర్ ప్రకారం, రాబోయే సెల్టోస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కియా మోడళ్లలో కనిపించే డిజైన్ విధానాన్ని అనుసరించనుంది. కొత్తగా అమర్చిన వర్టికల్​, హారిజాంటల్ ఎల్​ఈడీ లైటింగ్ ఎలిమెంట్స్ ఈ వీడియోలో​ కనిపిస్తున్నాయి. హెడ్‌ల్యాంప్‌లలోకి ఇంటిగ్రేట్​ చేసిన అట్రాక్టివ్​ సీ-షేప్​ డీఆర్​ఎల్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ముందు భాగం: రీడిజైన్​ చేసిన గ్రిల్ ఈ ఎస్‌యూవీకి మరింత విశాలమైన, ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తోంది. డీఆర్​ఎల్​లు, హెడ్‌లైట్‌ల కోసం పొందుపరిచిన ఎల్​ఈడీ వెల్‌కమ్ యానిమేషన్ ప్రీమియం అనుభూతిని జతచేస్తుంది. కియా బ్యాడ్జ్ గ్రిల్‌కు పైన ఉంది.

పనోరమిక్ సన్‌రూఫ్: టీజర్ చివరిలో చూపించిన పనోరమిక్ సన్‌రూఫ్ ఈ ఎస్‌యూవీ ఉన్నత స్థాయి ఆకర్షణను సూచిస్తుంది.

  • మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ కొనాలా? వద్దా? ఫస్ట్​ రివ్యూ కోసం ఇక్కడ క్లిక చేయండి.

కొత్త కియా సెల్టోస్​- ఇంటీరియర్, ఇంజిన్ అంచనాలు..

కొత్త తరం కియా సెల్టోస్ ఎస్​యూవీ ఇంటీరియర్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఈ బ్రాండ్ మెరుగైన సాఫ్ట్ మెటీరియల్స్, పెద్ద టచ్‌స్క్రీన్, అదనపు సౌకర్యం కోసం మార్పులు చేసిన సీట్లతో రీడిజైన్​ చేసిన క్యాబిన్‌ను తీసుకొస్తుందని అంచనాలు ఉన్నాయి.

ఇంజిన్: హుడ్ కింద, కియా కొత్త తరం సెల్టోస్‌లో తన నిరూపితమైన ఇంజిన్ శ్రేణినే కొనసాగించవచ్చని భావిస్తున్నారు. ఇందులో:

  • 1.5 లీటర్ పెట్రోల్
  • 1.5 లీటర్ టర్బో-పెట్రోల్
  • 1.5 లీటర్ డీజిల్.

అంతేకాకుండా, మునుపటి టెస్ట్ నివేదికల ప్రకారం, స్ట్రాంగ్​-హైబ్రిడ్ ఇంజిన్​ని ఈసారి పరిచయం చేసే అవకాశం ఉంది. ఇది మైలేజీని గణనీయంగా పెంచి, ఈ ఎస్‌యూవీకి మరింత ఆదరణ లభించేలా చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్: మ్యాన్యువల్, ఐఎంటీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో కొత్త కియా సెల్టోస్​ కొనసాగే అవకాశం ఉంది. అయితే, స్మూత్​ గేర్ మార్పులు, మెరుగైన డ్రైవింగ్ అనుభూతి కోసం వీటిలో అప్​గ్రేడ్స్​ తీసుకురావొచ్చు.

ఇండియాలో కియా సెల్టోస్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10.79 లక్షలుగా ఉంది. కొత్త వర్షెన్​ ధర ఇంకాస్త ఎక్కువగానే ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

కియా సెల్టోస్ కొత్త మోడల్​కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు డిసెంబర్ 10న విడుదల కానున్నాయి. ఆ టైమ్​కి ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వివరాలపై క్లారిటీ వచ్చేస్తుంది.

News/News/భారీ డిజైన్​ మార్పుతో కొత్త Kia Seltos ఎస్​యూవీ- లాంచ్​ ఎప్పుడంటే..
News/News/భారీ డిజైన్​ మార్పుతో కొత్త Kia Seltos ఎస్​యూవీ- లాంచ్​ ఎప్పుడంటే..