...
...
Next Story

Vivo S2 : 7050ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో వివో కొత్త స్మార్ట్​ఫోన్- వీ2 హైలైట్స్ ఇవే..

Vivo S2 India launch : వివో సంస్థ భారత మార్కెట్లోకి సరికొత్త 'వివో ఎస్2' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 7,050ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 7, 2026, 10:45:39 IST
Advertisement

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘వివో’.. భారత మార్కెట్లోకి సరికొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత తన 'ఎస్' సిరీస్‌ను పునరుద్ధరిస్తూ 'వివో ఎస్2' స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. భారీ బ్యాటరీ కెపాసిటీ, అధునాతన డిస్‌ప్లే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.

వివో ఎస్​2- ధర, సేల్..

వివో వీ2 స్మార్ట్​ఫోన్..
వివో వీ2 స్మార్ట్​ఫోన్..

భారతీయ వినియోగదారుల కోసం వివో ఎస్2 స్మార్ట్​ఫోన్‌ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు.

8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 39,999

8GB RAM +256GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 44,999

ఈ స్మార్ట్‌ఫోన్ శాఫైర్ బ్లూ , రీగల్ బ్రాంజ్, సిల్క్ వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. వినియోగదారులు దీనిని వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆగస్ట్ 11 నుంచి ఈ గ్యాడ్జెట్​ సేల్ మొదలవుతుంది.

వివో ఎస్2- డిస్‌ప్లే, ప్రాసెసింగ్ పవర్..

వివో ఎస్2 స్మార్ట్‌ఫోన్ 6.83-ఇంచ్ 1.5K (1,260 x 2,800 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది. ఇది 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, పీ3 వైడ్ కలర్ గమట్‌కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ కింద ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించారు.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 8GB LPDDR4X ర్యామ్‌తో పాటు 256GB వరకు యూఎఫ్​ఎస్ 3.1 అంతర్గత స్టోరేజ్ లభిస్తుంది. అదనంగా, వర్చువల్ ర్యామ్ సాంకేతికత ద్వారా ర్యామ్‌ను మరో 8GB వరకు విస్తరించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ‘ఆరిజిన్ ఓఎస్ 6’ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది.

వివో ఎస్2- కెమెరా, వీడియో రికార్డింగ్..

ప్రధాన కెమెరా: f/1.8 ఎపర్చర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్.

సెకండరీ కెమెరా: f/2.4 ఎపర్చర్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ సెన్సార్.

సెల్ఫీ కెమెరా: ముందు భాగంలో f/2.0 ఎపర్చర్‌తో 32-మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు.

ముఖ్యమైన విషయమేమిటంటే.. ఫ్రంట్, రియర్ కెమెరాలు రెండూ కూడా 4కే రిజల్యూషన్‌లో వీడియోలను రికార్డ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

వివో ఎస్2- భారీ బ్యాటరీ, బాడీ ప్రొటెక్షన్..

ఈ వివో ఎస్2లో ప్రధాన ఆకర్షణ దీని 7,050ఎంఏహెచ్ భారీ బ్యాటరీ. ఇది వేగంగా ఛార్జ్ కావడానికి 44డబ్ల్యూ ఫ్లాష్‌ఛార్జ్ సాంకేతికతకు సపోర్ట్ చేస్తుంది.

నీరు, ధూళి నుంచి రక్షణ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను అందించారు. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ 5జీ, 4జీ ఎల్​టీఈ, వై-ఫై 5, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఓటీజీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. శాఫైర్ బ్లూ, రీగల్ బ్రాంజ్ మోడళ్లు 7.99ఎంఎం మందంతో 197 గ్రాముల బరువు ఉండగా, సిల్క్ వైట్ వేరియంట్ 8.10ఎంఎం మందంతో 199 గ్రాముల బరువు ఉంటుంది.

మరి మీరు ఈ వివో ఎస్2 స్మార్ట్​ఫోన్​ని కొంటున్నారా?

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe