ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన నెక్ట్స్ జన్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. 2026 ప్రారంభంలో వివో వీ70 సిరీస్, వివో ఎక్స్200టీ, వివో ఎక్స్300 ఎఫ్ఈ మోడళ్లను కంపెనీ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఫోన్లు అధికారికంగా లాంచ్ కాకముందే వీటికి సంబంధించిన ధరలు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ల లాంచ్ ఎప్పుడు ఉండవచ్చు? ధరలు ఎలా ఉండబోతున్నాయి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో కొత్త స్మార్ట్‌ఫోన్స్- భారత్‌లో లాంచ్ ఎప్పుడు?
లీకైన వివరాల ప్రకారం.. వివో తన వీ70, వీ70 ఎలైట్, ఎక్స్200టీ మోడళ్లను 2026 జనవరి చివరిలో భారత్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. అక్కడి నుంచి మరికొంత కాలానికి వివో ఎక్స్300 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
లీకైన ధరల వివరాలు (అంచనా):
టిప్‌స్టర్ సమాచారం ప్రకారం, ఈ ఫోన్ల ధరలు సుమారుగా ఇలా ఉండవచ్చు..
వివో వీ70: రూ. 45,000
వివో వీ70 ఎలైట్: రూ. 50,000
వివో ఎక్స్200టీ: రూ. 55,000
వివో ఎక్స్300 ఎఫ్ఈ: రూ. 60,000
అయితే, ఇవి కేవలం అంచనా ధరలు మాత్రమేనని, ఫోన్ లాంచ్ సమయంలో వీటిలో మార్పులు ఉండవచ్చని గమనించాలి.
వివో కొత్త స్మార్ట్‌ఫోన్- ఫీచర్లు, కలర్ ఆప్షన్స్..
కలర్స్: వివో వీ70 మోడల్ రెడ్ (ఎరుపు), ఎల్లో (పసుపు) రంగుల్లో లభించే అవకాశం ఉంది.
స్టోరేజ్: ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్లో రావచ్చని తెలుస్తోంది. అయితే, అంతర్జాతీయంగా (ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం) ఇది 12జీబీ ర్యామ్ వేరియంట్లోనూ కనిపించింది.
{{/usCountry}}స్టోరేజ్: ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్లో రావచ్చని తెలుస్తోంది. అయితే, అంతర్జాతీయంగా (ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం) ఇది 12జీబీ ర్యామ్ వేరియంట్లోనూ కనిపించింది.
{{/usCountry}}సాఫ్ట్‌వేర్: ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌పై పనిచేస్తుంది. ఇందులో 5జీ, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, వై-ఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.
పవర్ ఫుల్ ప్రాసెసర్: ఇటీవల గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 'వీ2538' మోడల్ నంబర్‌తో కనిపించింది. దీని ప్రకారం, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో రానుంది. సింగిల్ కోర్ టెస్టింగ్‌లో 1,235 పాయింట్లు, మల్టీ కోర్ టెస్టింగ్‌లో 3,920 పాయింట్లను ఈ ఫోన్ సాధించింది. ఇది భారతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) వెబ్‌సైట్‌లో కూడా కనిపించడంతో భారత్‌లో దీని విడుదల ఖాయమని తెలుస్తోంది.
వివో ఎక్స్200టీ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉండబోతోంది?
మీడియా నివేదికల్లో అత్యంత ఆసక్తికరమైన విషయం.. ఈ ఫోన్ పొజీషనింగ్! ఎక్స్200టీని "ఎక్స్200, ఎక్స్200 ఎఫ్ఈల కలయిక" గా సంస్థ తీసుకురావొచ్చని అంచనాలు ఉన్నాయి.
ఇది నిజమైతే.. ఎక్స్200 ఎఫ్ఈ నుంచి కాంపాక్ట్, సౌకర్యవంతమైన డిజైన్‌ను, ఎక్స్200 నుంచి శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ డీఎన్ఏని ఈ ఎక్స్200టీ తీసుకుంటుంది.
ఇందులో ZEISS-బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఇది ప్రధానంగా పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది.
సాధారణంగా ఉండే 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు, ఇందులో పెద్ద బ్యాటరీని ఆశించవచ్చు. బహుశా, ఇది ఎక్స్200ఎఫ్ఈలో ఉన్న బ్యాటరీ పరిమాణానికి దగ్గరగా ఉండొచ్చు.
పూర్తి వివరాల తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.