భార్యకు చెల్లించే భరణం (మెయింటెనెన్స్) మొత్తానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. భర్త నికర జీతంలో 25 శాతం మొత్తాన్ని భార్యకు భరణంగా ఇవ్వాలనేది కేవలం ఒక సాధారణ మార్గదర్శకం మాత్రమేనని, ప్రతి కేసులోనూ దీనిని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రతి కేసులోని వాస్తవాలు, రికార్డుల ఆధారంగా భరణం మొత్తాన్ని పెంచే లేదా తగ్గించే పూర్తి అధికారం కోర్టులకు ఉంటుందని వెల్లడించింది.

జస్టిస్ అచల్ సచ్‌దేవ్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. భరణం మొత్తాన్ని లెక్కించేటప్పుడు భర్త మొత్తం జీతాన్ని (Gross Salary) కాకుండా, అన్ని రకాల పన్నులు, తప్పనిసరి మినహాయింపులు పోను చేతికి వచ్చే నికర ఆదాయాన్ని (Net Income) మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
కాన్పూర్ దేహాత్‌కు చెందిన పింకీ అలియాస్ ప్రీతి, ఆమె భర్త శ్రీ జై ప్రకాష్ దాఖలు చేసిన రెండు పరస్పర క్రిమినల్ రివిజన్ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఫ్యామిలీ కోర్టు తనకు కేటాయించిన ₹12,000 నెలవారీ భరణాన్ని పెంచాలని భార్య కోరగా, కింది కోర్టు ఇచ్చిన ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ భర్త మరో పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టుల పరిధిపై హైకోర్టు స్పష్టత
సాధారణ పరిస్థితుల్లో కింది కోర్టులు నిర్ణయించిన భరణం మొత్తాన్ని రివిజన్ కోర్టులు మార్చలేవని న్యాయస్థానం పేర్కొంది. "రివిజన్ కోర్టు పరిధి కేవలం పర్యవేక్షణకు (Supervisory) సంబంధించిందే తప్ప అప్పీలేట్ పరిధి కాదు. అందువల్ల కింది కోర్టులు నిర్ణయించిన భరణాన్ని సాధారణంగా మార్చలేం" అని ధర్మాసనం పేర్కొంది.
అయితే, కింది కోర్టు తీర్పులో స్పష్టమైన లోపాలు ఉన్నా, కీలకమైన సాక్ష్యాలను విస్మరించినా, లేదా చట్టపరమైన సూత్రాలను తప్పుగా అన్వయించి తీవ్ర అన్యాయానికి కారణమైనా.. అటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో రివిజన్ కోర్టులు జోక్యం చేసుకోవడం సమంజసమేనని జస్టిస్ అచల్ సచ్దేవ్ స్పష్టం చేశారు.
వాస్తవ ఆదాయం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
{{/usCountry}}అయితే, కింది కోర్టు తీర్పులో స్పష్టమైన లోపాలు ఉన్నా, కీలకమైన సాక్ష్యాలను విస్మరించినా, లేదా చట్టపరమైన సూత్రాలను తప్పుగా అన్వయించి తీవ్ర అన్యాయానికి కారణమైనా.. అటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో రివిజన్ కోర్టులు జోక్యం చేసుకోవడం సమంజసమేనని జస్టిస్ అచల్ సచ్దేవ్ స్పష్టం చేశారు.
వాస్తవ ఆదాయం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
{{/usCountry}}ఈ కేసులో భర్త స్థూల నెలవారీ జీతం ₹86,674 కాగా, అన్ని మినహాయింపుల తర్వాత ఆయన ఖాతాలో ₹67,043 జమవుతోంది. అయితే, ఫ్యామిలీ కోర్టు ఈ రికార్డులను, డాక్యుమెంటరీ సాక్ష్యాలను సరిగ్గా పరిశీలించకుండానే భరణాన్ని ఖరారు చేసిందని హైకోర్టు గుర్తించింది. సుప్రీంకోర్టు 'రజనీష్ వర్సెస్ నేహా' కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం భర్త తన ఆస్తులు, అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉండగా, ఆయన దానిని దాఖలు చేయలేదు. కింది కోర్టు కూడా ఈ అంశాన్ని పట్టించుకోకుండా నిర్ణయానికి రావడం సరికాదని హైకోర్టు తప్పుబట్టింది.
భరణం మొత్తం పెంపు
కింది కోర్టు భర్త వాస్తవ ఆదాయాన్ని, ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టు అభిప్రాయపడింది. 'కళ్యాణ్ డే చౌదరి వర్సెస్ రీటా డే చౌదరి నీ నంది (2017)' కేసును ప్రస్తావిస్తూ.. 25 శాతం జీతం అనేది కేవలం ఒక దిశా నిర్దేశం మాత్రమేనని పునరుద్ఘాటించింది. భర్త అంగీకరించిన ఆదాయ వివరాలను కింది కోర్టు విస్మరించిందని పేర్కొంటూ, జూలై 10న ఇచ్చిన తీర్పులో భార్యకు ఇచ్చే నెలవారీ భరణాన్ని ₹12,000 నుండి ₹20,000 కి పెంచింది. భార్య మొదట దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచే ఈ పెంపు వర్తిస్తుందని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.