షాపింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే 'అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026' ముహూర్తం ఖరారైంది. ఈ మెగా సేల్ జనవరి 16న ప్రారంభం అవుతుందని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. కొత్త గ్యాడ్జెట్లు లేదా హోమ్ అప్లయన్సెస్ కొనాలనుకుని, వాయిదా వేస్తున్న వారికి ఇది సరైన సమయం. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టీవీలు, ఆడియో ప్రొడక్టులపై అదిరిపోయే డీల్స్‌ను అమెజాన్ ఇప్పటికే టీజ్ చేస్తోంది.

వాస్తవానికి వస్తువు ధర తగ్గడమే కాకుండా.. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లను కలిపి ఉపయోగిస్తే భారీగా డబ్బు ఆదా చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫర్ల వివరాలు..
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడే వారికి 10 శాతం ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ లావాదేవీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం వరకు అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభించనుంది.
ఇంకో విషయం ఏంటంటే.. ఫ్లిప్‌కార్ట్ సేల్ జనవరి 17న ప్రారంభం కానుండగా, అమెజాన్ అంతకంటే ఒకరోజు ముందే అంటే 16 నుంచే తన సేల్‌ను మొదలుపెడుతోంది.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026- టాప్ డీల్స్ ఇవి..
బోట్ ఎయిర్‌డోప్స్ 219: నిత్యం ఫోన్ కాల్స్ మాట్లాడే వారికి ఇది చక్కని ఎంపిక. ఇందులో ఉన్న నాలుగు మైకులు (ENx టెక్నాలజీ) ట్రాఫిక్ వంటి రద్దీ ప్రాంతాల్లోనూ మీ గొంతు అవతలి వారికి స్పష్టంగా వినిపించేలా చేస్తాయి. 40 గంటల బ్యాటరీ లైఫ్‌తో వారమంతా వాడుకోవచ్చు. ప్రస్తుతం దీనిపై 73 శాతం భారీ తగ్గింపు ఉంది.
లెనోవో యోగా స్లిమ్ 7: పనిలో వేగం కోరుకునే వారి కోసం ఈ ల్యాప్‌టాప్ రూపొందించారు. కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్, 16జీబీ ర్యామ్‌తో మల్టీ టాస్కింగ్ చాలా సులభం. 1.39 కిలోల బరువుతో బ్యాగ్‌లో ఈజీగా ఇమిడిపోతుంది. ప్రస్తుతం 26 శాతం డిస్కౌంట్‌తో లభిస్తున్న ఈ ల్యాప్‌టాప్, సేల్‌లో మరింత తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}లెనోవో యోగా స్లిమ్ 7: పనిలో వేగం కోరుకునే వారి కోసం ఈ ల్యాప్‌టాప్ రూపొందించారు. కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్, 16జీబీ ర్యామ్‌తో మల్టీ టాస్కింగ్ చాలా సులభం. 1.39 కిలోల బరువుతో బ్యాగ్‌లో ఈజీగా ఇమిడిపోతుంది. ప్రస్తుతం 26 శాతం డిస్కౌంట్‌తో లభిస్తున్న ఈ ల్యాప్‌టాప్, సేల్‌లో మరింత తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}నాయిస్ ట్విస్ట్: ఫోన్ తీయకుండానే చేతి గడియారం నుంచే కాల్స్ మాట్లాడాలనుకునే వారికి ఇది బెస్ట్. 1.38 ఇంచ్ స్క్రీన్, ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తోంది. ప్రస్తుతం దీనిపై 70 శాతం తగ్గింపు లభిస్తోంది.
షావోమీ ప్యాడ్ 7: రీడింగ్, స్ట్రీమింగ్ ప్రియుల కోసం ఈ టాబ్లెట్ అద్భుతంగా ఉంటుంది. దీని 3.2కే స్క్రీన్ కాంతి పరావర్తనాన్ని తగ్గిస్తుంది, కాబట్టి ఎండలో కూర్చున్నా డిస్ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్‌తో యాప్స్ వేగంగా పనిచేస్తాయి. ప్రస్తుతం దీనిపై 20 శాతం డిస్కౌంట్ ఉంది.
అమేజ్‌ఫిట్ బిప్ 6: పెద్ద స్క్రీన్, ఎక్కువ బ్యాటరీ కావాలనుకునే వారికి ఇది కరెక్ట్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల పాటు పనిచేస్తుంది. ఇన్‌బిల్ట్ జీపీఎస్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది 47 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది.
గెలాక్సీ ట్యాబ్ ఎస్10 లైట్: శాంసంగ్ నుంచి వచ్చిన ఈ లైట్ వెయిట్ టాబ్లెట్‌తో ఎస్-పెన్ ఉచితంగా వస్తుంది. ఫొటోల నుంచి అనవసరమైన వస్తువులను తొలగించే ఏఐ ఫీచర్లు ఇందులో ఆకర్షణీయంగా ఉన్నాయి. 5జీ సదుపాయం ఉన్న ఈ టాబ్లెట్ ప్రస్తుతం 14 శాతం తగ్గింపుతో లభిస్తోంది.
మరి ఈ అమెజాన్ గ్రేడ్ రిపబ్లిక్ డే సేల్ 2026లో మీరు ఏ గ్యాడ్జెట్ కొంటున్నారు?