టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ జనవరి ఇప్పటికే ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్ల మీద గతంలో ఎన్నడూ లేనంతగా భారీ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. యాపిల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, వివో వంటి దిగ్గజ బ్రాండ్ల ఫోన్లను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ముఖ్యంగా యాపిల్ కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్స్ ఐఫోన్ 17 సిరీస్‌పై అమెజాన్ అదిరిపోయే డీల్స్ అందిస్తోంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026- ఐఫోన్ డీల్స్..

మీరు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మారాలని చూస్తున్నా లేదా పాత ఐఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకున్నా, ఈ సేల్ మీకు అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్- ఐఫోన్ 17 ప్రో: యాపిల్ గతేడాది విడుదల చేసిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 17 ప్రో మోడళ్లు ఇప్పుడు మరింత తక్కువ ధరకే లభిస్తున్నాయి. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలుపుకుంటే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ సుమారు రూ. 1,40,400 ధరకే దక్కించుకోవచ్చు. అదే సమయంలో ఐఫోన్ 17 ప్రో రూ. 1,25,400కి లభిస్తోంది.
ఐఫోన్ ఎయిర్: యాపిల్ చరిత్రలోనే అత్యంత సన్నని మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఐఫోన్ ఎయిర్’పై కూడా ఆకర్షణీయమైన తగ్గింపులు ఉన్నాయి. రూ. 1,19,900 గా ఉండే ఈ ఫోన్ ధర అమెజాన్‌లో ప్రస్తుతం రూ. 91,249గా ఉంది. స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ డీల్.
ఐఫోన్ 15: బడ్జెట్ ధరలో ఐఫోన్ కావాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస! 2023లో విడుదలైన ఐఫోన్ 15 ఇప్పుడు రూ. 51,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫర్లతో కలిపితే ఇది ఇంకా తక్కువకే వచ్చే అవకాశం ఉంది.
అదనపు ప్రయోజనాలు ఇవే..
కేవలం ఫోన్ ధర మీద తగ్గింపు మాత్రమే కాకుండా, కొనుగోలుదారులకు మరిన్ని ప్రయోజనాలను అమెజాన్ అందిస్తోంది:
{{/usCountry}}కేవలం ఫోన్ ధర మీద తగ్గింపు మాత్రమే కాకుండా, కొనుగోలుదారులకు మరిన్ని ప్రయోజనాలను అమెజాన్ అందిస్తోంది:
{{/usCountry}}ఎస్బీఐ బ్యాంక్ ఆఫర్: ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
యాపిల్‌కేర్+ ఆఫర్: 'Protect+ with AppleCare' సర్వీసులపై ఏకంగా 25 శాతం వరకు తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. దీనివల్ల మీ ఖరీదైన ఫోన్‌కు పూర్తి భద్రత లభిస్తుంది.
సులభమైన ఈఎంఐ- ఎక్స్ఛేంజ్: నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో పాటు పాత ఫోన్లను మార్చుకోవడం ద్వారా భారీగా ఎక్స్ఛేంజ్ బోనస్‌లను పొందవచ్చు.
ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 22 వరకు కొనసాగనుంది. స్టాక్ ముగిసేలోపే మీకు నచ్చిన ఐఫోన్ లేదా ఇతర బ్రాండ్ ఫోన్లను అమెజాన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోండి.