...
...
Next Story

Amazon layoffs 2026 : అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్.. వేలాది మంది ఉద్యోగులపై వేటు!

అమెజాన్ తన కార్పొరేట్ విభాగంలో మరో విడత ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. సుమారు 14,000 నుంచి 15,000 మంది ఉద్యోగులను ఈ దఫా అమెజాన్​ లేఆఫ్స్​లో తొలగించనున్నట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్​లో సంస్థ 14వేల మందిని తొలగించింది. ఉద్యోగుల సంఖ్యను 30వేల వరకు తగ్గించుకోవాలన్న టార్గెట్​ కంపెనీకి ఉన్నట్టు తెలుస్తోంది.

Published on: Jan 23, 2026, 07:30:29 IST
Advertisement

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు మరోసారి చేదు వార్త చెప్పబోతోంది. సంస్థలోని అంతర్గత బ్యూరోక్రసీని తగ్గించి, పనితీరును వేగవంతం చేసే క్రమంలో.. వచ్చే వారం నుంచే ఉద్యోగ కోతలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గత అక్టోబర్‌లో చేపట్టిన ప్రక్షాళన కొనసాగింపుగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి.

అమెజాన్​ లేఆఫ్స్​ 2026- వచ్చే మంగళవారం నుంచే ప్రారంభం?

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్.. (REUTERS)
అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్.. (REUTERS)

2025 అక్టోబరు నెలలో అమెజాన్ సుమారు 14,000 కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించింది. అప్పట్లో ప్రకటించిన 30,000 ఉద్యోగాల కోత లక్ష్యంలో ఇది సగం మాత్రమే. మిగిలిన కోతలను వచ్చే మంగళవారం నుంచే అమలు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విడతలో కూడా సుమారు 14,000 మందికి పైగా ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

అమెజాన్​ లేఆఫ్స్​ 2026- ఏయే విభాగాలపై ప్రభావం ఉండవచ్చు?

తాజా సమాచారం ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రభావం అమెజాన్‌లోని కీలక విభాగాలపై పడనుంది:

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్​)

రిటైల్ విభాగం

ప్రైమ్ వీడియో

హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్​ఆర్​ - పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ)

అయితే, ఈ కోతల పరిధి ఎంత ఉంటుంది? అనేది ఇంకా ఒక స్పష్టతకు రాలేదని, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.

అమెజాన్​ లేఆఫ్స్​ 2026- కారణం ఏంటి?

సాధారణంగా కంపెనీలు ఆర్థిక భారంతో ఉద్యోగులను తొలగిస్తాయి. కానీ అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ మాత్రం లేటెస్ట్​ లేఆఫ్స్​కి భిన్నమైన కారణం చెబుతున్నారు.

"ఈ ఉద్యోగ కోతలు కేవలం ఆర్థిక కారణాల వల్లనో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్లనో చేస్తున్నవి కావు. కంపెనీలో అవసరానికి మించి మేనేజ్‌మెంట్ లేయర్స్​ పెరిగిపోయాయి. దీనివల్ల పనిలో జాప్యం జరుగుతోంది. వీటిని తగ్గించి కంపెనీ సంస్కృతిని కాపాడటమే మా లక్ష్యం," అని జస్సీ స్పష్టం చేశారు.

తాజా అమెజాన్​ లేఆఫ్స్​ 2026 కేవలం కార్పొరేట్ (వైట్​ కాలర్​) ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. కార్పొరేట్ విభాగంలో ఉన్న 3.5 లక్షల మందిలో సుమారు 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

పాత విడతలో తొలగించిన ఉద్యోగులకు ఇచ్చిన 90 రోజుల గడువు ముగియనుండగానే, కొత్త విడత లేఆఫ్స్ వార్తలు రావడం అమెజాన్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.

తాజా వ్యవహారాలపై అంతర్జాతీయ మీడియా సంప్రదించినప్పుడు.. అమెజాన్ సంస్థ స్పందించేందుకు​ నిరారించింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks