అమెజాన్​ సేల్​లో ఐఫోన్ 17 సిరీస్‌పై కళ్లుచెదిరే ఆఫర్లు.. భారీగా తగ్గిన ధరలు!

కొత్త ఏడాదిలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎయిర్ సహా పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మీరు మిస్​ అవ్వకూడదు అంటే ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి..

Published on: Jan 17, 2026 3:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ జనవరి ఇప్పటికే ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్ల మీద గతంలో ఎన్నడూ లేనంతగా భారీ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. యాపిల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, వివో వంటి దిగ్గజ బ్రాండ్ల ఫోన్లను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ముఖ్యంగా యాపిల్ కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్స్ ఐఫోన్ 17 సిరీస్‌పై అమెజాన్ అదిరిపోయే డీల్స్ అందిస్తోంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అమెజాన్​ సేల్​లో భారీగా తగ్గిన ఐఫోన్​ 17 గ్యాడ్జెట్స్​ ధరలు..
అమెజాన్​ సేల్​లో భారీగా తగ్గిన ఐఫోన్​ 17 గ్యాడ్జెట్స్​ ధరలు..

అమెజాన్​ గ్రేట్​ రిపబ్లిక్​ డే సేల్​ 2026- ఐఫోన్ డీల్స్..

మీరు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మారాలని చూస్తున్నా లేదా పాత ఐఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకున్నా, ఈ సేల్ మీకు అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్- ఐఫోన్​ 17 ప్రో: యాపిల్ గతేడాది విడుదల చేసిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 17 ప్రో మోడళ్లు ఇప్పుడు మరింత తక్కువ ధరకే లభిస్తున్నాయి. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్​ఛేంజ్ బోనస్‌లు కలుపుకుంటే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ సుమారు రూ. 1,40,400 ధరకే దక్కించుకోవచ్చు. అదే సమయంలో ఐఫోన్​ 17 ప్రో రూ. 1,25,400కి లభిస్తోంది.

ఐఫోన్ ఎయిర్: యాపిల్ చరిత్రలోనే అత్యంత సన్నని మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఐఫోన్ ఎయిర్’పై కూడా ఆకర్షణీయమైన తగ్గింపులు ఉన్నాయి. రూ. 1,19,900 గా ఉండే ఈ ఫోన్​ ధర అమెజాన్​లో ప్రస్తుతం రూ. 91,249గా ఉంది. స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ డీల్.

ఐఫోన్ 15: బడ్జెట్ ధరలో ఐఫోన్ కావాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్​ న్యూస! 2023లో విడుదలైన ఐఫోన్ 15 ఇప్పుడు రూ. 51,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫర్లతో కలిపితే ఇది ఇంకా తక్కువకే వచ్చే అవకాశం ఉంది.

అదనపు ప్రయోజనాలు ఇవే..

కేవలం ఫోన్ ధర మీద తగ్గింపు మాత్రమే కాకుండా, కొనుగోలుదారులకు మరిన్ని ప్రయోజనాలను అమెజాన్ అందిస్తోంది:

ఎస్బీఐ బ్యాంక్ ఆఫర్: ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

యాపిల్​కేర్​+ ఆఫర్: 'Protect+ with AppleCare' సర్వీసులపై ఏకంగా 25 శాతం వరకు తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. దీనివల్ల మీ ఖరీదైన ఫోన్‌కు పూర్తి భద్రత లభిస్తుంది.

సులభమైన ఈఎంఐ- ఎక్స్ఛేంజ్: నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో పాటు పాత ఫోన్లను మార్చుకోవడం ద్వారా భారీగా ఎక్స్​ఛేంజ్​ బోనస్‌లను పొందవచ్చు.

ఈ అమెజాన్​ గ్రేట్​ రిపబ్లిక్​ డే సేల్ జనవరి 22 వరకు కొనసాగనుంది. స్టాక్ ముగిసేలోపే మీకు నచ్చిన ఐఫోన్ లేదా ఇతర బ్రాండ్ ఫోన్లను అమెజాన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More