ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో బజాజ్ 'చేతక్' తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సరికొత్త 'చేతక్ సీ25'తో వినియోగదారులకు మరింత చేరువ కావాలని కంపెనీ భావిస్తోంది. బజాజ్ చేతక్ లైనప్‌లో ఇదే అత్యంత చౌకైన మోడల్. దీని ధరను రూ. 91,399 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

రోజువారీ వినియోగం, మంచి రేంజ్, తక్కువ బరువు, ప్రయాణంలో సౌకర్యం వంటి కీలక అంశాలపై బజాజ్ ఈసారి ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో హెచ్‌టీ ఆటో టీమ్ పూణె నగర రద్దీలో ఈ స్కూటర్ పనితీరును స్వయంగా పరీక్షించింది. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది? చేతక్ సీ25 రివ్యూని ఇక్కడ చూసేయండి..
బజాజ్ చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ..
- పరిచయమున్న లుక్.. కానీ భారీగా తగ్గిన బరువు-
పైకి చూస్తే చేతక్ సీ25 పాత మోడళ్లలాగే కనిపిస్తుంది. ఆ సొగసైన మెటల్ బాడీ, గుండ్రటి ఆకారం, క్లాసిక్ లైన్లు ఏమాత్రం మారలేదు. రోడ్డుపై వెళుతుంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ప్రీమియం లుక్ కనిపిస్తుంది.
కానీ, అసలైన మార్పు లోపల ఉంది. బజాజ్ ఇందులో సరికొత్త స్టీల్ ట్యూబ్యులర్ ఫ్రేమ్‌ను, ఫ్లోర్‌బోర్డ్ కింద చిన్న బ్యాటరీని అమర్చింది. దీనివల్ల స్కూటర్ బరువు గణనీయంగా తగ్గింది. ఇతర చేతక్ మోడళ్లతో పోలిస్తే ఇది 22 కిలోలు తక్కువ. అంటే కేవలం 107 కిలోలు మాత్రమే! పార్కింగ్ నుంచి తీసేటప్పుడు లేదా రద్దీలో మలుపులు తిప్పేటప్పుడు ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఉపయోగకరంగా కూడా ఉంటుంది.
2. రోజువారీ వాడకానికి సౌకర్యం-
{{/usCountry}}2. రోజువారీ వాడకానికి సౌకర్యం-
{{/usCountry}}భారతీయ రోడ్లపై ఉండే గుంతలు, ఎగుడుదిగుడులను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా సులభంగా తట్టుకుంటుంది. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ప్రయాణాన్ని సాఫీగా ఉంచుతాయి. సీట్ హైట్ 763 ఎంఎం ఉండటం వల్ల తక్కువ ఎత్తు ఉన్నవారు కూడా సులభంగా ఈ బజాజ్ చేతక్ సీ25 ఈ-స్కూటర్ని నడపవచ్చు. కాలు పెట్టుకోవడానికి ఫ్లోర్‌బోర్డ్ వద్ద తగినంత స్థలం ఉంది, దీనివల్ల ప్రయాణం అంతగా అలసట అనిపించదు.
3. సిటీ అవసరాలకు తగ్గ పనితీరు-
ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. "ఇది కేవలం నగర ప్రయాణాల కోసమే" అని కంపెనీ స్పష్టం చేస్తోంది. ఇందులో ఈకో, స్పోర్ట్ అని రెండు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. పార్కింగ్ కోసం రివర్స్ మోడ్ కూడా ఇచ్చారు. ఈకో మోడ్ ట్రాఫిక్‌లో చాలా సహజంగా ఉంటుంది. స్పోర్ట్ మోడ్ కొంచెం వేగాన్ని ఇస్తుంది. వేగం పుంజుకునేటప్పుడు ఎక్కడా కుదుపులు లేకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవింగ్ స్మూత్‌గా ఉండటం మెచ్చుకోదగ్గ విషయం.
4. ప్రాక్టికాలిటీ, ఫీచర్లు-
డిస్‌ప్లే: కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఫోన్ కాల్స్ రిసీవ్ చేయడం లేదా రిజెక్ట్ చేసే ఫీచర్ కూడా ఉంది.
స్టోరేజ్: సీటు కింద 25 లీటర్ల స్పేస్ ఉంది. ఇందులో హెల్మెట్ లేదా రోజువారీ సరుకులు సులభంగా పడతాయి.
గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎం ఉండటం వల్ల స్పీడ్ బ్రేకర్ల దగ్గర బండి కింద తగిలే ప్రమాదం తక్కువ.
5. బ్యాటరీ అండ్ రేంజ్-
2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఈ బజాజ్ చేతక్ సీ25లో వాడారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 113 కి.మీ (ఐడీసీ) రేంజ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. కాగా సాధారణంగా వాడుకలో 95 కి.మీ వరకు వస్తుందని ఆశించవచ్చు. సున్నా నుంచి 80 శాతం ఛార్జింగ్ అవ్వడానికి 2 గంటల 25 నిమిషాలు పడుతుంది.
బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సిటీ డ్రైవ్‌కి బెస్ట్- కానీ..
వేగం విషయంలో ఇది కేవలం 55 కిలోమీటర్లకే పరిమితం కావడం వల్ల హైవేల మీద నడపడానికి అంతగా సెట్ అవ్వదు. అలాగే, హిల్ హోల్డ్ కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి మరిన్ని ఫీచర్లు కావాలంటే మీరు రూ. 3,000 అదనంగా చెల్లించి 'టెక్ పాక్' తీసుకోవాల్సి ఉంటుంది.
మీరు కేవలం నగర వీధుల్లో తిరగడానికి, నడపడం సులభంగా ఉండే, నాణ్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలని కోరుకుంటే ఈ బజాజ్ చేతక్ సీ25 ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇందులో జిమ్మిక్కులు లేవు, కానీ రోజువారీ ప్రయాణానికి అవసరమైన భరోసా ఉంది. కాంప్లెక్స్ ఫీచర్లతో తలనోప్పి వద్దు అనుకునే మధ్యతరగతి వాహనదారులకు ఇది సరిగ్గా సరిపోతుంది.