160 సీసీ స్పోర్ట్స్ బైక్ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త అడుగు వేసింది. మార్కెట్లోకి రెండు కొత్త అప్‌గ్రేడెడ్ మోడళ్లను తీసొచ్చింది. పల్సర్ ఎన్160 ఎస్, పల్సర్ ఎన్160 ఎస్ఎస్ పేర్లతో వీటిని భారత్‌లో లాంచ్ చేసింది. ఎక్స్‌షోరూమ్ ప్రకారం పల్సర్ ఎన్160 ఎస్ ధర రూ. 1,33,511 కాగా, ఫ్లాగ్‌షిప్ ఎన్160 ఎస్ఎస్ వేరియంట్ ధర రూ. 1,42,585గా కంపెనీ నిర్ణయించింది. వీటితో పాటు మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ పల్సర్ ఎన్160 విక్రయాలు కూడా యథాతథంగా కొనసాగుతాయని బజాజ్ స్పష్టం చేసింది.
కొత్త ఇంజిన్.. మెరుగైన పర్ఫార్మెన్స్!

ఈ రెండూ కేవలం కాస్మోటిక్ మార్పులతో వచ్చిన బైక్‌లు కావు. వీటి ఇంజిన్ సామర్థ్యాన్ని బజాజ్ భారీగా పెంచింది. వీటిలో సరికొత్త 165 సీసీ, ఫోర్-వాల్వ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 18.2 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 4.5 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ విభాగంలోనే అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన మోడళ్లుగా ఇవి నిలుస్తాయని కంపెనీ వెల్లడించింది.
దీనికి తోడుగా ఎలక్ట్రానిక్ థ్రోటిల్ సిస్టమ్ అయిన ‘ఇంటెలిజెంట్ థ్రోటిల్ (ఈటీబీ)’ సాంకేతికతను జోడించారు. దీనివల్ల బైక్ నడిపేటప్పుడు రైడర్‌కు పవర్ డెలివరీ ఎంతో స్మూత్‌గా, తక్షణ స్పందనతో లభిస్తుంది.
రైడింగ్ మోడ్స్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్!
ఇంటెలిజెంట్ థ్రోటిల్ (ఈటీబీ) వ్యవస్థ ద్వారా బైక్‌లో నాలుగు ప్రత్యేక రైడింగ్ మోడ్స్‌ను తీసుకొచ్చారు. రెయిన్, రోడ్, స్పోర్ట్, ఆఫ్‌రోడ్ అనే ఈ మోడ్స్ వివిధ రకాల రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా బైక్ రెస్పాన్స్‌ను మారుస్తాయి.
ట్రాఫిక్‌లో పదేపదే క్లచ్ నొక్కడం, గేర్లు మార్చడం రైడర్లకు పెద్ద విసుగు. దీనికి పరిష్కారంగా బజాజ్ ఇందులో ‘క్రాల్ టెక్నాలజీ’ని పరిచయం చేసింది. హెవీ ట్రాఫిక్‌లో ఎక్కువ గేరులో ఉన్నప్పటికీ చాలా తక్కువ వేగంతో బైక్‌ను సులభంగా ముందుకు నడపడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా, ప్రీమియమ్ మోడల్ అయిన పల్సర్ ఎన్160 ఎస్ఎస్లో 'రెస్పాన్సివ్ ట్రాక్షన్ కంట్రోల్' కూడా ఇచ్చారు. ఇది జారే రోడ్లపై బైక్ గ్రిప్ తప్పకుండా కాపాడుతుంది.
స్మార్ట్ డిస్‌ప్లే.. గూగుల్ మ్యాప్స్ సపోర్ట్
ఎన్160 ఎస్ఎస్ వేరియంట్లో టెక్నాలజీ పరంగా మరో పెద్ద అప్‌గ్రేడ్ ఇచ్చారు. ఇందులో 5 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ను అమర్చారు. భారత్‌లో ఒక స్పోర్ట్స్ బైక్‌లో గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ సపోర్ట్ రావడం ఇదే తొలిసారి అని బజాజ్ పేర్కొంది. బైక్ హ్యాండిల్‌బార్ యాంగిల్, సీటు ఎత్తును కూడా రైడర్ సౌకర్యార్థం కాస్త మార్చారు. కొత్త గ్రాఫిక్స్, అట్రాక్టివ్ కలర్డ్ అల్లాయ్ వీల్స్ బైక్‌కు సరికొత్త లుక్‌నిచ్చాయి.
రంగులు.. మార్కెట్ డిమాండ్..
{{/usCountry}}ఎన్160 ఎస్ఎస్ వేరియంట్లో టెక్నాలజీ పరంగా మరో పెద్ద అప్‌గ్రేడ్ ఇచ్చారు. ఇందులో 5 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ను అమర్చారు. భారత్‌లో ఒక స్పోర్ట్స్ బైక్‌లో గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ సపోర్ట్ రావడం ఇదే తొలిసారి అని బజాజ్ పేర్కొంది. బైక్ హ్యాండిల్‌బార్ యాంగిల్, సీటు ఎత్తును కూడా రైడర్ సౌకర్యార్థం కాస్త మార్చారు. కొత్త గ్రాఫిక్స్, అట్రాక్టివ్ కలర్డ్ అల్లాయ్ వీల్స్ బైక్‌కు సరికొత్త లుక్‌నిచ్చాయి.
రంగులు.. మార్కెట్ డిమాండ్..
{{/usCountry}}ఈ కొత్త ఎన్160 ఎస్, ఎన్160 ఎస్ఎస్ బైక్స్.. అట్లాంటిక్ బ్లూ, పెర్ల్ మెటాలిక్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ షోరూమ్‌లలో ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో పల్సర్ ఎన్160 లైనప్ ఏకంగా 60 శాతం వృద్ధిని నమోదు చేసిందని, తమ కస్టమర్లలో దాదాపు 70 శాతం మంది 35 ఏళ్లలోపు యువకులేనని బజాజ్ ఆటో తెలిపింది.