...
...
Next Story

Bank holiday today : తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు..

నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు నేడు సెలవు ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో ఇది వరుస సెలవుల (లాంగ్ వీకెండ్) సమయం. శుక్రవారం నుంచి సోమవారం వరకు బ్యాంకులకు హాలీడే లభించింది. పూర్తి వివరాలు..

Published on: Jan 24, 2026, 08:15:39 IST
Advertisement

బ్యాంకు పనుల కోసం వెళ్లే వారికి ముఖ్య గమనిక. నేడు నాలుగొవ శనివారం కావడంతో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ సెలవులో ఉంటాయి. అయితే, అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం బ్యాంకులకు లాంగ్​ వీకెండ్​ సెలవులు నడుస్తున్నాయి. చాలా చోట్ల శుక్రవారం నుంచి సోమవారం వరకు బ్యాంకులకు హాలీడేలు ఉన్నాయి.

బ్యాంకులకు లాంగ్​ వీకెండ్​ సెలవులు..

బ్యాంకులకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు.. (Bloomberg)
బ్యాంకులకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు.. (Bloomberg)

నిన్న (జనవరి 23) నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, త్రిపుర వంటి రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీడే లభించింది. నేడు నాలుగో శనివారం, రేపు ఆదివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇక ఎల్లుండి (జనవరి 26) రిపబ్లిక్ డే కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు హాలీడే. అంటే చాలా ప్రాంతాల్లో శుక్రవారం నుంచి సోమవారం వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నట్టు.

ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం జనవరి 2026లో సెలవులు..

జనవరి 1 (గురువారం): నూతన సంవత్సర వేడుకలు / గాన్-న్గాయ్ సందర్భంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌లలో బ్యాంకులు బంద్.

జనవరి 2 (శుక్రవారం): న్యూ ఇయర్ వేడుకలు / మన్నం జయంతి సందర్భంగా మిజోరం, కేరళలో సెలవు.

జనవరి 3 (శనివారం): హజ్రత్ అలీ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు.

జనవరి 4 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.

జనవరి 10 (శనివారం): రెండవ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు.

జనవరి 12 (సోమవారం): స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో సెలవు.

జనవరి 14 (బుధవారం): మకర సంక్రాంతి / మాఘ బిహు సందర్భంగా గుజరాత్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో సెలవు.

జనవరి 15 (గురువారం): పొంగల్ / మకర సంక్రాంతి / ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, సిక్కింలలో బ్యాంకులు బంద్.

జనవరి 16 (శుక్రవారం): తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా తమిళనాడులో సెలవు.

జనవరి 17 (శనివారం): ఉలవర్ తిరునాళ్ సందర్భంగా తమిళనాడులో సెలవు.

జనవరి 18 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.

జనవరి 23 (శుక్రవారం): నేతాజీ జయంతి / వసంత పంచమి సందర్భంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, త్రిపురలలో సెలవు.

జనవరి 24 (శనివారం): నాలుగవ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు.

జనవరి 25 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.

జనవరి 26 (సోమవారం): గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు బంద్.

ఇవి పని చేస్తాయి..

సెలవు రోజుల్లో బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ, మీ ఆర్థిక అవసరాల కోసం డిజిటల్ సేవలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి.

ఆన్‌లైన్ బ్యాంకింగ్: మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు 24 గంటలూ పనిచేస్తాయి.

నగదు ఉపసంహరణ: అత్యవసర నగదు కోసం ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి.

యూపీఐ: ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ చెల్లింపుల్లో ఎలాంటి అంతరాయం ఉండదు.

అయితే, చెక్కుల క్లియరెన్స్ వంటి పనులకు మాత్రం సెలవు రోజుల్లో అవకాశం ఉండదు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద ఆర్బీఐ ఈ సెలవులను నిర్ణయిస్తుంది. కాబట్టి చెక్కుల ద్వారా లావాదేవీలు జరిపే వారు ఈ వరుస సెలవులను దృష్టిలో ఉంచుకోవడం మంచిది.

"స్థానిక పండుగలు, రాష్ట్రాల వారీగా సెలవుల్లో మార్పులు ఉండవచ్చు. కాబట్టి వినియోగదారులు తమ సమీపంలోని బ్యాంకు శాఖలో సెలవుల జాబితాను ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం," అని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks